KTM Bikes Recall News Update: KTM అభిమానులకు ఒక ముఖ్యమైన అలెర్ట్‌. భారత మార్కెట్లో, ముఖ్యంగా యూత్‌లో మంచి పాపులారిటీ ఉన్న 2024 KTM 125, 250, 390 & 990 Duke బైకులను కంపెనీ అధికారికంగా రీకాల్‌ చేసింది. దీనికి కారణం.. ఫ్యూయల్‌ ట్యాంక్‌ క్యాప్‌ సీల్‌లో ఏర్పడే క్రాక్‌లు. ఇవి ముందుగా గుర్తించకపోతే ఫ్యూయల్‌ లీక్‌ అయ్యే ప్రమాదం ఉందని KTM వెల్లడించింది. కాబట్టి, మీ దగ్గర కూడా 2024 KTM 125, 250, 390 లేదా 990 Duke బైక్‌ ఉంటే, వెంటనే VIN ద్వారా బైక్‌ స్టేటస్‌ చెక్‌ చేయండి.

ప్రమాణాలకు తగ్గట్లుగా లేని ఫ్యూయల్‌ ట్యాంక్‌ క్యాప్‌ సీల్‌
కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం, క్వాలిటీ టెస్ట్‌ల సమయంలో కొంతమంది యూనిట్లలో ఫ్యూయల్‌ ట్యాంక్‌ క్యాప్‌ సీల్‌, KTM ప్రమాణాలకు పూర్తిగా సరిపోయే విధంగా పనిచేయడం లేదని గుర్తించారు. మెటీరియల్‌లో ఏర్పడిన చిన్న లోపాల వల్ల సీల్‌లో సూక్ష్మ చీలికలు వచ్చే అవకాశం ఉంది. ఇలా జరిగితే ట్యాంక్‌ క్యాప్‌ ప్రాంతంలో ఫ్యూయల్‌ లీక్‌ అయ్యే ప్రమాదం ఉంటుంది. దీనికి నివారణ చర్యలు తీసుకున్న KTM, కస్టమర్ల భద్రత విషయంలో ఎలాంటి రాజీ పడబోమని చెప్పింది.

ఈ సమస్యకు పరిష్కారంగా అన్ని ప్రభావిత మోటార్‌సైకిళ్లలో ఫ్యూయల్‌ క్యాప్‌ సీల్‌ను పూర్తిగా ఉచితంగా మార్చి ఇస్తారు. రీప్లేస్‌మెంట్‌ ప్రాసెస్‌ మాత్రం పూర్తిగా అధికృత KTM డీలర్‌షిప్‌ల వద్ద మాత్రమే జరగాలి.

KTM యజమానులు, తమ బైక్‌ ఈ రీకాల్‌లోకి వస్తుందా లేదా అని స్వయంగా చెక్‌ చేసుకోవచ్చు. అందుకోసం రెండు ఆప్షన్‌లు ఉన్నాయి:

1. సమీప KTM సర్వీస్‌ సెంటర్‌ను సందర్శించడం.

2. KTM అధికారిక వెబ్‌సైట్‌లోని ‘Service’ సెక్షన్‌లో VIN నంబర్‌ & Delivery Certificate Number నమోదు చేయడం.

“క్వాలిటీ టెస్ట్‌ల్లో కొన్ని ఫ్యూయల్‌ క్యాప్‌ సీల్‌లు కంపెనీ ప్రమాణాలను పూర్తిగా అందుకోలేకపోయాయి. మెటీరియల్‌లో లోపాల కారణంగా చిన్న క్రాక్‌లు రావచ్చు. వాటి వల్ల ఫ్యూయల్‌ లీకేజీ సంభవించే అవకాశం ఉంది. అందువల్ల ప్రభావిత మోడళ్లలోని సీళ్లను వెంటనే రీప్లేస్‌ చేస్తున్నాం” - KTM అధికారిక ప్రకటన

KTM 390 Adventure & Vitpilen 401 మోడళ్లలో కూడా...
ఇది, KTM ఈ మధ్య కాలంలో చేస్తున్న ఏకైక రీకాల్‌ కాదు. ఇటీవలే KTM 390 Adventure & Vitpilen 401 మోడళ్లను కూడా రీకాల్‌ చేసింది. వాటిలో వచ్చిన సమస్య - ఎలక్ట్రానిక్ థ్రోటిల్ అసెంబ్లీ తప్పుగా ఉండడం (faulty electronic throttle assembly). రైడ్‌ చేస్తున్నప్పుడు ఈ అసెంబ్లీ అకస్మాత్తుగా పనిచేయకుండా థ్రోటిల్ స్పందన పూర్తిగా ఆగిపోతుంది. ఇంజిన్‌ rpm ఒకే స్థాయిలో నిలిచిపోతుంది, థ్రాటిల్‌ ఇన్‌పుట్‌ తీసుకోదు.

ఈ సమస్యను వ్యక్తిగతంగా ఎదుర్కొన్న రైడర్లు కూడా ఉన్నారు. ప్రయాణం మధ్యలో, ముఖ్యంగా ఎత్తైన రహదారుల్లో లేదా హైవేపై స్పీడ్‌లో ఉంటే థ్రోటిల్ స్పందించకపోవడం చాలా ప్రమాదకరం. ఒక రైడర్‌, తన బైక్‌ థ్రోటిల్ పనిచేయకపోయినప్పటికీ, అదృష్టవశాత్తు డీలర్‌షిప్‌కు దగ్గరగా ఉండడంతో KTM Crawl Assist ద్వారా బైక్‌ను కనీస వేగంతో ముందుకు తీసుకెళ్లగలిగాడు. ఈ ఫీచర్‌ లో-స్పీడ్‌ పరిస్థితుల్లో ఇంజిన్‌ స్తంభించిపోకుండా ఆటోమేటిక్‌గా రేవ్‌ పెంచుతుంది, ట్రాఫిక్‌లో చాలా ఉపయోగపడుతుంది.

మొత్తం మీద, భద్రతను ప్రాధాన్యంగా చూసే KTM, ఎటువంటి చిన్న సమస్యనైనా రీకాల్‌ ద్వారా వెంటనే పరిష్కరించడానికి ముందుకొస్తోంది. మీ బైక్‌ కూడా ఈ రీకాల్‌లో ఉందా, లేదా అన్నది వెంటనే VIN ద్వారా చెక్‌ చేసుకుని, మీ సమీపంలోని KTM డీలర్‌షిప్‌ను సంప్రదించడం మంచిది.

ఇంకా ఇలాంటి ఆటోమొబైల్‌ వార్తలు & అప్‌డేట్స్‌ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.