<p><strong>Kabali Film Producer Kp Chowdary is Committed Suicide :</strong> గోవాలో కబాలి సినిమా నిర్మాత కృష్ణ ప్రసాద్ చౌదరి ఆత్మహత్య చేసుకున్నారు. పలు సినిమాలకు నిర్మాతగా వ్యవహరించిన కేపీ చౌదరి.. గతంలో డ్రగ్స్ వివాదంలో చిక్కుకున్నారు. పోలీసులు డ్రగ్స్ క్రయవిక్రాయల కేసులో కేపీ చౌదరిని అరెస్ట్ కూడా చేశారు. అనంతరం విడుదలయ్యారు. గోవా వెళ్లిన ఆయన అక్కడ ఓ హోటల్లో ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. </p>