Korean Facial or Hydra Facial for Deep Cleansing : ఫేషియల్ చేయించుకుంటే చర్మం డీప్ క్లీన్ అవుతుంది. అలాగే రక్త ప్రసరణ కూడా పెరుగుతుంది. అంతేకాకుండా ఒత్తిడి కూడా తగ్గుతుంది. చర్మ రంధ్రాల్లో పేరుకుపోయిన మురికి, నూనె, డెడ్ స్కిన్ తొలగిపోతాయి. దీనివల్ల ముఖం మరింత ప్రకాశవంతంగా, కాంతివంతంగా, తాజాగా కనిపిస్తుంది. వృద్ధాప్య ముడతలను తగ్గించి, చర్మానికి బిగుతును అందిస్తుంది.

ప్రకాశవంతమైన, శుభ్రమైన, క్లియర్ స్కిన్ కోసం ఫేషియల్ చేయించుకునేవారు.. కొరియన్ ఫేషియల్ లేదా హైడ్రా ఫేషియల్ ట్రై చేయాలనుకుంటారు. మీరు కూడా ఫేషియల్ చేయించుకోవాలని ఆలోచిస్తుంటే.. మీ చర్మానికి ఏ ఫేషియల్ సరిపోతుందో.. ఈ రెండింటీలో ఏది మంచి ఫలితాలు ఇస్తుందో చూసేద్దాం.

Also Read : కొరియన్ గ్లాస్ స్కిన్ కోసం ఈ మ్యాజిక్ డ్రింక్ తాగాలా? నిమ్మ-కీరదోసకాయ జ్యూస్‌తో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

కొరియన్ ఫేషియల్

మీ చర్మం పొడిగా, జిడ్డుగా, సున్నితంగా లేదా నిర్జీవంగా ఉంటే.. మీరు కొరియన్ ఫేషియల్ చేయించుకోవచ్చు. ఇది మీ ముఖానికి తాజాదనాన్ని, కాంతిని అందిస్తుంది. చర్మాన్ని లోపలి నుంచి మెరుగుపరుస్తుంది. అయితే ముఖంపై చాలా మొటిమలు, గాయాలు లేదా ఇన్ఫెక్షన్లు ఉంటే.. ఈ ఫేషియల్ చేయించుకునే ముందు తప్పకుండా చర్మవ్యాధి నిపుణుల సలహా తీసుకోవాల్సి ఉంటుంది.

కొరియన్ ఫేషియల్ ప్రాసెస్..

ముందుగా ముఖాన్ని రెండుసార్లు శుభ్రపరుస్తారు. ఆ తర్వాత తేలికపాటి ఎక్స్‌ఫోలియేషన్ చేసి టోనర్, ఎసెన్స్, సీరమ్ రాస్తారు. దీని తర్వాత షీట్ మాస్క్, మాయిశ్చరైజర్, సన్‌స్క్రీన్ రాస్తే ప్రక్రియ పూర్తవుతుంది. కొరియన్ ఫేషియల్ చర్మాన్ని శుభ్రపరచడానికి, తేమను నిలుపుకోవడానికి సహాయపడుతుంది. ముఖం మృదువుగా, తాజాగా కనిపిస్తుంది. దీనిలో ఉపయోగించే సీరమ్, మాస్క్ చర్మానికి తేమను అందిస్తాయి. తేలికపాటి మసాజ్ ముఖ కండరాలకు ఉపశమనం కలిగిస్తుంది.

Also Read : కొరియన్ గ్లాస్ స్కిన్ వెనుక సీక్రెట్ ఇదే.. రోజూ ఫాలో అవ్వగలిగే స్కిన్‌కేర్ టిప్స్ ఇవే

హైడ్రా ఫేషియల్

పొడి, జిడ్డు, కాంబినేషన్, సున్నితమైన చర్మం ఉన్నవారు హైడ్రా ఫేషియల్ చేయించుకోవచ్చు. ఇది బ్లాక్‌హెడ్స్, వైట్‌హెడ్స్, పెద్ద రంధ్రాలు, జిడ్డు చర్మం, తేలికపాటి మచ్చల సమస్యలను తగ్గిచండంలో సహాయపడుతుంది.

హైడ్రా ఫేషియల్ ప్రాసెస్..

ముందుగా ముఖాన్ని ఒక యంత్రంతో శుభ్రపరిచి.. డెడ్ స్కిన్ సెల్స్ తొలగిస్తారు. ఆ తర్వాత రంధ్రాలలోని మురికిని పీల్‌తో శుభ్రం చేస్తారు. వాక్యూమ్ టెక్నాలజీతో బ్లాక్‌హెడ్స్, మురికిని తొలగించి.. చివరగా హైలురోనిక్ యాసిడ్, ఇతర పోషకాలు కలిగిన సీరమ్‌తో చర్మానికి తేమను అందిస్తారు. ఈ ఫేషియల్ తర్వాత చర్మం శుభ్రంగా, మృదువుగా, తేమగా కనిపిస్తుంది. చర్మం ఆకృతి కూడా మెరుగ్గా కనిపిస్తుంది.

Also Read : మృదువైన స్కిన్, గ్లో కోసం సహజమైన ఫేస్ ప్యాక్స్(Homemade Face Packs).. ఇంట్లో ట్రై చేసేయండి

ఏది బెస్ట్ అంటే..

మీ అవసరాలు.. మీకు ఎలాంటి లుక్ కావాలనే దానిని బట్టి ఏ ఫేషియల్ చేయించుకోవాలో డిసైడ్ అవ్వండి. మీకు ఆయిలీ స్కిన్ ఉంటే కొరియన్ ఫేషియల్ బెస్ట్ ఆప్షన్ అవుతుంది. పొడిబారిన స్కిన్ ఉన్నవారికి, ఎక్కువకాలం హైడ్రేషన్ కావాలనుకునేవారి హైడ్రా ఫేషియల్ బెస్ట్ ఆప్షన్. మీరు ముందుగానే నిపుణులతో ఎగ్జామిన్ చేయించుకుని.. మీ ఫేస్, కాంబినేషన్ బట్టి అవసరమైన ఫేషియల్ చేయించుకోవచ్చు.

Also Read : వేప ఫేస్ ప్యాక్‌తో గ్లోయింగ్ స్కిన్.. మొటిమలు, ఆయిల్ స్కిన్‌ కూడా దూరం, ఇలా ట్రై చేయండి

గమనిక : ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.