Konda Murali Comments :కాంగ్రెస్‌ చెలరేగిన కొండా సురేఖ కుమార్తె సుస్మిత కామెంట్స్ దుమారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఆమె చేస్తున్న చర్యలు పార్టీకి వ్యతిరేకంగా ఉన్నాయని చర్యలు తీసుకోవాలని పీసీసీ నియమించిన క్రమశిక్షణ సంఘం తేల్చింది. పీసీసీ ప్రెసిడెంట్‌కు నివేదిక కూడా ఇచ్చింది. అయితే దీనిపై కీలక నేత భట్టి విక్రమార్కతో కొండా మురళీ చర్చించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ మరిన్ని వ్యాఖ్యలు చేశారు. ఎలా, ఏం మాట్లాడాతో తన కుమార్తె ఇష్టమని వాటిని ప్రశ్నించే హక్కు తమకు లేదని అన్నారు. ఎవరి అభిప్రాయాలు వారికి ఉంటాయన్నారు. తాము మాత్రం కాంగ్రెస్‌లోనే కొనసాగుతామని అన్నారు.