New Zealand Head Coach Plans Pace Test For Indian Batting Sensation: అక్టోబర్ 22 నుంచి టీమ్ ఇండియాతో ప్రారంభం కానున్న పరిమిత ఓవర్ల సిరీస్ కోసం న్యూజిలాండ్ హెడ్ కోచ్ రాబ్ వాల్టర్ వ్యూహాత్మక మైండ్ గేమ్స్ ఆరంభించాడు. ఐపీఎల్ తో పాటు అండర్-19 ప్రపంచకప్‌లో మెరుపు బ్యాటింగ్‌తో వెలుగులోకి వచ్చిన భారత టీనేజ్ సంచలనం వైభవ్ సూర్యవంశీపై అతడు ప్రత్యేక దృష్టి సారించాడు. న్యూజిలాండ్‌లోని ఫాస్ట్, బౌన్స్ పిచ్‌లపై ఈ యువ లెఫ్ట్ హ్యాండర్ ఎలా ఆడతాడో చూడాలని తనకు ఆసక్తిగా ఉందని బుధవారం మీడియాతో మాట్లాడుతూ వాల్టర్ పేర్కొన్నాడు. "మంచి పేస్, బౌన్స్ ఉండే వికెట్లపై వైభవ్ ఆటతీరు ఎలా ఉంటుందో చూడటానికి నేను ఎంతో ఉత్సాహంగా ఉన్నాను. అతడు అద్భుతమైన ప్రతిభావంతుడు. ఐపీఎల్‌లో ప్రపంచ స్థాయి బౌలర్లను అతడు ఎదుర్కొన్న తీరు అందరం చూశాం. అయితే ఇతర దేశాల విభిన్న పరిస్థితుల్లో ఆ ప్రతిభను ఎలా కొనసాగిస్తాడు, మా పిచ్‌లపై అతడిని మేము ఎలా కట్టడి చేస్తామనేది అసలైన సవాల్. ఒత్తిడి పరిస్థితుల్లో ఆటగాళ్లు ఎలా స్పందిస్తారో చూడాలని ఒక కోచ్‌గా నాకు ఎప్పుడూ ఉంటుంది. ఒకవేళ అతడు రాకపోయినా భారత జట్టులో ఇతర అగ్రశ్రేణి ఆటగాళ్లు చాలామందే ఉన్నారు" అని వాల్టర్ తెలిపాడు.

Read Also: Rinku Singh's Test Cricket Ambition: సింగిల్ ఫార్మాట్ ప్లేయర్ అనే ముద్రను చెరిపేస్తా.. వైట్ జెర్సీ వేసుకోవడమే లక్ష్యం, రోకో జంట‌ వరల్డ్ కప్ ఎత్తాలంటూ రింకూ సింగ్ మనసులోని మాట

అహ్మదాబాద్ ఫైనల్ గాయాలు..
ఈ ఏడాది అహ్మదాబాద్‌లో జరిగిన టీ20 ప్రపంచకప్ ఫైనల్లో భారత్ చేతిలో ఎదురైన ఘోర పరాభవం తమ ఆటగాళ్ల మదిలో ఇంకా ఉందా అనే ప్రశ్నకు వాల్టర్ స‌మాధాన‌మిచ్చాడు. "ఫైనల్ మ్యాచ్‌లో ఓడిపోవడం ఎవరికీ నచ్చదు. ఆ బాధ కచ్చితంగా ఉంటుంది. అయితే మా మొదటి ప్రాధాన్యత ప్రతీకారం తీర్చుకోవడం కాదు, కివీస్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తూ సొంతగడ్డపై గొప్ప క్రికెట్ ఆడటం. ప్రపంచకప్ ఫైనల్ తర్వాత మా జట్టు మళ్లీ పూర్తి స్థాయిలో కలిసి ఆడుతున్న సందర్భమిది. భారత్‌తో ఆడేటప్పుడు మైదానంలో ఎప్పుడూ అద్భుతమైన ఎనర్జీ ఉంటుంది. స్వదేశంలో వారిపై విజయాలు సాధించడానికే మా ఆటగాళ్లు గట్టిగా ప్రయత్నిస్తారు" అని తెలిపాడు.

Read Also: Gambhir Sleepless Night: సంజూను తప్పించిన రాత్రి నిద్రపట్టలేదు.. వైభవ్ కోసం కఠిన నిర్ణయం తీసుకున్నానని చెప్పిన‌ గంభీర్

2027 వన్డే వరల్డ్ కప్ బ్లూప్రింట్..
రాబోయే 2027 వన్డే ప్రపంచకప్ కోసం తమ ప్రణాళికలు ఇప్పటికే సిద్ధంగా ఉన్నాయని వాల్టర్ తెలిపాడు. గ్లోబల్ టోర్నీలలో తమ ట్రాక్ రికార్డు నిలకడగా ఉందని, వచ్చే ఏడాదిన్నర కాలంలో ప్రస్తుత బృందంలో చిన్నపాటి సర్దుబాట్లు మాత్రమే చేస్తామని తెలిపాడు. భారత పర్యటనలో ఐదు టీ20లు, ఐదు వన్డేలతో పాటు కేవలం రెండు టెస్టులు మాత్రమే ఉండటంపై కాస్త నిరాశ వ్యక్తం చేస్తూ, మూడు టెస్టుల సిరీస్ ఉంటే మరింత బాగుండేదని వ్యాఖ్యానించాడు.

అక్టోబర్ చలిగాలులు..
న్యూజిలాండ్‌లో అక్టోబర్ నెలలో రాత్రి వేళల్లో ఉండే చల్లని వాతావరణం తమ బౌలర్లకు ప్రయోజనం చేకూరుస్తుందని వాల్టర్ వ్యాఖ్యానించాడు. రాత్రి 8 గంటలకు మ్యాచ్ మొదలై అర్ధరాత్రి దాటిన తర్వాత ముగియడం వల్ల ఆటగాళ్లకు నిద్ర, రికవరీ సమస్యలు ఎదురవుతాయని, ప్రయాణాల మధ్య ఈ సమయాన్ని సమర్థవంతంగా నిర్వహించుకోవడమే కీలకమని పేర్కొన్నాడు.