Shah Rukh Khan Re Confirms King Movie Release Date: బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ కథానాయకుడిగా నటించిన 'డంకీ' థియేటర్లలో ఆశించిన విజయం అధించలేదు. బాక్స్ ఆఫీస్ బరిలో బోల్తా కొట్టింది. ఆ తర్వాత సుమారు మూడేళ్ల పాటు మరో సినిమా చేయలేదు. ఆయన వెండితెరకు దూరంగా ఉన్నారు. ఇప్పుడు షారుఖ్ ఖాన్ కొత్త సినిమా 'కింగ్'తో థియేటర్లలోకి రానున్నారు.

డిసెంబర్ 24న 'కింగ్' విడుదల
King Release On December 24th, Confirms Shah Rukh Khan: ఈ ఏడాది కొత్త సినిమాతో థియేటర్లలోకి రానున్నారు షారుఖ్ ఖాన్. దాంతో అభిమానుల్లో చాలా అంచనాలు ఉన్నాయి. అయితే, కొన్నాళ్ళుగా ఈ సినిమా చడీచప్పుడు చేయలేదు. దాంతో 'కింగ్' విడుదల వచ్చే ఏడాదికి వాయిదా పడిందంటూ సోషల్ మీడియాలో రూమర్లు వచ్చాయి. ఆ పుకార్లకు షారుఖ్ ఖాన్ చెక్ పెట్టారు.

Also Read: Ramayana - ఆదిపురుష్ పాటలే బెటరా? సొంత పాటలు కాపీ కొట్టిన రెహమాన్?

డిసెంబర్ 24న క్రిస్మస్ సీజన్ సందర్భంగా ప్రపంచ వ్యాప్తంగా 'కింగ్'ను థియేటర్లలో విడుదల చేయనున్నట్లు కన్ఫర్మ్ చేశారు. సోషల్ మీడియాలో రిలీజ్ డేట్ పోస్టర్ షేర్ చేశారు షారుఖ్ ఖాన్.

షారుఖ్ ఖాన్ కథానాయకుడిగా 'పఠాన్' వంటి విజయవంతమైన సినిమాను తీసిన యువ దర్శకుడు సిద్ధార్థ్ ఆనంద్ (Siddharth Anand)... ఇప్పుడీ భారీ యాక్షన్‌ డ్రామా 'కింగ్' సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్, మార్‌ఫ్లిక్స్ పిక్చర్స్ సంస్థలు సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నారు. నిర్మాతల్లో షారుఖ్ ఖాన్, సిద్ధార్థ్ ఆనంద్ కూడా ఉన్నారు.

Also Read: Balakrishna Koratala Siva NBK112 Movie Music Director - అనిరుధ్ రవిచందర్ కాదు... తమన్ లేడు... బాలయ్య - కొరటాల సినిమా సంగీత దర్శకుడిగా తెరపైకి కొత్త పేరు

View this post on Instagram

A post shared by Shah Rukh Khan (@iamsrk)

'కింగ్'లో షారుఖ్ ఖాన్ సరసన దీపికా పదుకోన్ కథానాయికగా నటించారు. ఇంకా ఈ సినిమాలో షారుఖ్ కుమార్తె సుహానా ఖాన్, అభిషేక్ బచ్చన్, అనిల్ కపూర్, రాణి ముఖర్జీ, జాకీ ష్రాఫ్, అర్షద్ వార్సీ ఇతర పాత్రల్లో కనిపించనున్నారు. షారుఖ్, దీపిక మీద ఓ పాటను మాత్రమే చిత్రీకరించాల్సి ఉంది. క్రిస్మస్ రేసులో డిసెంబర్ 24న 'కింగ్'ను తీసుకు వస్తున్నారు.

Also Read: Dhurandhar Actor In Nani Bloody Romeo - నాని సినిమాలో 'ధురంధర్' యాక్టర్... ఢిల్లీ షూట్ అప్డేట్ ఏమిటంటే?