Kiara Advani Necklace Photos Gone Viral : బాలీవుడ్ హీరోయిన్ కియారా అద్వానీ రీసెంట్‌గా ఓ ఈవెంట్‌లో సందడి చేశారు. అయితే, ఆమె ధరించిన రెండు నెక్లెస్‌లు వైరల్‌గా మారాయి. సోషల్ మీడియాలో పెద్ద చర్చకే దారితీశాయి. ఇంతకూ ఆ నెక్లెస్‌లు ఏంటి? ఆ కథేంటో ఓసారి చూస్తే...

ముంబైలో రీసెంట్‌గా జరిగిన GQ మోస్ట్ ఇన్‌ఫ్లుయెన్షియల్ యంగ్ ఇండియన్స్ 2026 ఈవెంట్‌లో కియారా అద్వానీ పాల్గొన్నారు. నల్లటి లెదర్ బస్టియర్‌లో కనిపించిన ఆమె... లగ్జరీ బ్రాండ్ క్రోమ్ హార్ట్స్‌కు చెందిన శిలువ ఆకారపు లాకెట్స్ ఉన్న నెక్లెస్‌లు ధరించారు. ఈ ఫోటోలు వైరల్ కాగా... కొందరు ఆమె స్టైలిష్ లుక్‌ను ప్రశంసించగా... మరికొందరు మాత్రం శిలువ ఆకారంలో ఉన్న లాకెట్స్‌పై ఫోకస్ చేశారు.

ఇదే హాట్ టాపిక్

కియారా హిందువు, ఆమె పేరెంట్స్ హిందూ మతానికి చెందిన వారు అయినప్పుడు ఇలాంటి లాకెస్ట్ ఎందుకు ఆమె వేసుకున్నారు? అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. మరి కొంతమంది ఆమె వివాహాన్ని కూడా దీనికి లింక్ చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. 2023లో కియారా సిద్దార్థ్ మల్హోత్రాను వివాహం చేసుకున్నారు. సంప్రదాయ పద్ధతిలో మూడు ముళ్ల బంధంతో వీరిద్దరూ ఒక్కటయ్యారు.

ప్రస్తుతం ఇది హాట్ టాపిక్‌గా మారగా... చాలా వరక కియారాను సపోర్ట్ చేస్తూ పోస్టులు పెడుతున్నారు. ఈ లాకెట్స్ ఆమె తరచూ ధరిస్తారని... క్యాజువల్ దుస్తులతో పాటు ఫ్యాషన్ యాక్సెసరీస్‌గా వీటిని వాడతారని చెబుతున్నారు. ఇందులో మతపరమైన అంశాలకు చోటు లేదని... దీనిపై చర్చ అనవసరం అంటూ కామెంట్స్ చేస్తున్నారు. స్టైలిష్ లుక్ కోసం చిన్న సైజు శిలువ లాకెట్స్, సన్నని చైన్‌తో కలిపి ధరిస్తుంటారని తెలుస్తోంది.

Also Read : రావణుడు వర్సెస్ కుబేరుడు - 'రామాయణ' ఫస్ట్ పార్ట్ స్టోరీ ప్లాట్ రివీల్... రావణుడి పాత్రే ఎందుకంటే?

బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ పలు సినిమాలు చేశారు కియారా. గతేడాది వార్ 2లో తన నటనతో మెప్పించారు. ఈ ఏడాది యశ్ టాక్సిక్‌లో హీరోయిన్‌గా చేస్తున్నారు. వరల్డ్ వైడ్‌గా జూన్ 4న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగులో 'భరత్ అనే నేను' మూవీతో ఎంట్రీ ఇచ్చిన కియారా... వినయ విధేయ రామ, గేమ్ ఛేంజర్ మూవీస్‌లో నటించారు.