Khaleel Ahmed : ఇండియన్ ప్రీమియర్‌ లీగ్ 2026 సీజన్‌లో ఐదు సార్లు ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్‌కు భారీ కష్టం వచ్చి పడింది. జట్టులో కీలక బౌలర్‌గా ఎదుగుతున్న ఖలీల్ అ్మద్‌ గాయం కారణంగా టోర్నీ నుంచి నిష్క్రమించాడు. సీజన్ ప్రారంభంలో మూడు వరుస ఓటములతో ఇబ్బందిపడ్డ చెన్నై, ఇటీవలే వరుస విజయాలతో పుంజుకుంటున్న తరుణంలో ఈ పరిణామం జట్టు సమతూకాన్ని దెబ్బ తీసేలా కనిపిస్తోంది.

ఖలీల్‌ అహ్మద్‌కు గాయం

కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై 32 పరుగుల తేడాతో ఘన విజయం సాధించినప్పటికీ ఆ మ్యాచ్‌లో ఖలీల్‌ గాయపడ్డాడు. ఇన్నింగ్స్ 17వ ఓవర్‌ వేస్తున్న సమయంలో ఖలీల్‌ తన కుడి వైపు హిప్‌ వద్ద తీవ్రమైన నొప్పితో బాధపడ్డాడు. కేవలం ఐదు బంతులు వేసి అరో బంతి వేయలేక మైదానాన్ని వీడాల్సి వచ్చింది. మిగిలిన బంతిని గుర్జాపనీత్‌ సింగ్ పూర్తి చేశాడు.

OFFICIAL ANNOUNCEMENT

Khaleel Ahmed has been ruled out of IPL 2026 after sustaining a right quadricep injury in the game against KKR.

Wishing Khaleel a speedy recovery.#WhistlePodu pic.twitter.com/PFQz3iSWRq

— Chennai Super Kings (@ChennaiIPL) April 16, 2026

ఖలీల్‌కు వైద్య పరీక్షలు చేసి గ్రేడ్‌ 2 టియర్ అని తేలింది. ఈ రకకమైన గాయం నుంచి కోలుకోవడానికి పది నుంచి 12 వారాల సమయం పడుతుందని సీఎస్కే వర్గాలు చెబుతున్నాయి. అంటే సీజన్‌లో ఖలీల్ మళ్లీ గ్రౌండ్‌లోకి దిగే ఛాన్స్ లేదని తేలుస్తోంది.

సీఎస్కేకు షాక్ తప్పదా

ఖలీల్ అహ్మద్ ఈ సీజన్‌లో చెన్నై తరున డెసిగ్నేడెట్‌ న్యూ బాల్ బౌలర్‌గా ఉన్నాడు. పవర్‌ ప్లేలో వికెట్లు తీయడంలోనూ, పరుగులు నియత్రించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ సీజన్‌లో ఆడిన 5 మ్యాచ్‌లలో ఖలీల్ కేవలం రెండు వికెట్లు మాత్రమే తీశాడు. అయినా అతని ఎకానమీ రేటు 8.67గా ఉంది. ప్రస్తుతం సీఎస్కే బౌలర్లలో రెండో అత్యుత్తమ ఎకానమీ రేటు ఖలీల్‌దే. కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో ఖలీల్ అద్భుతమైన బౌలింగ్ చేశాడు.

గాయాల బారిన సీఎస్కే

ఈ సీజన్ ఐపీఎల్‌లో మొదటి నుంచి చెన్నైను గాయాలు వెంటాడుతున్నాయి. జట్టుకు వెన్నెముక అయిన ధోనీ కాఫ్‌ ఇంజూరీ కారణంగా ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. సీజన్ ప్రారంభంలోనే నాథన్‌ ఎల్లిస్ టోర్నీ నుంచి తప్పుకున్నాడు. ఇతని స్థానంలో వచ్చిన స్పెన్సర్‌ కూడా గాయపడ్డాడు. ప్రస్తుతం కోలుకుంటున్నా ఎప్పుడు అందుబాటులోకి వస్తాడో తెలియదు. గాయం కారణంగానే డెవాల్ట్ బ్రెవిస్ మొదటి మూడు మ్యాచ్‌లకు అందుబాటులో లేడు.