Keesara Toll Plaza Road Accident: కీసర టోల్ ప్లాజా వద్ద కారుపై బోల్తా పడిన లారీ.. ఎన్టీఆర్ జిల్లాలో విషాదం

4 days ago 2
ARTICLE AD
<p>ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గ పరిధిలో పెను విషాదం చోటుచేసుకుంది. కంచికచర్ల మండలం కీసర టోల్ ప్లాజా వద్ద శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న ఒక లారీ బ్రేకులు ఒక్కసారిగా ఫెయిల్ కావడంతో డ్రైవర్ &nbsp;కంట్రోల్ కోల్పోయాడు. దీంతో ఆ లారీ అదుపు తప్పి పక్కనే ఉన్న కారుపై ఒక్కసారిగా బోల్తా పడింది.</p> <p><br /><img src="https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2026/04/11/a6cc0581be216fe0cee3031769977df01775909374363233_original.jpeg" /></p> <p>ఈ ప్రమాద దాటికి కారు పూర్తిగా నుజ్జునుజ్జయింది. లారీ భారీ బరువు కింద కారు నలిగిపోవడంతో, అందులో ఎంతమంది ప్రయాణికులు ఉన్నారు? వారి పరిస్థితి ఏమిటి? అనే విషయాలపై ప్రస్తుతం స్పష్టత లేదు. కారు లోపల చిక్కుకున్న వారిని బయటకు తీసేందుకు అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు మరియు టోల్ ప్లాజా సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్రేన్ల సహాయంతో లారీని పక్కకు తొలగించి, సహాయక చర్యలు ముమ్మరం చేశారు. ఈ ఘటనతో హైవేపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది.</p>
Read Entire Article