Karthika Deepam Edi Nava Vasantham Serial Today Episode బుల్లితెర ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్న "కార్తీకదీపం 2" సీరియల్ రోజు రోజుకూ ట్విస్ట్‌లు టర్న్‌లతో ఆసక్తికరంగా మారుతోంది. ఈ రోజు(సెప్టెంబరు 17వ తేదీన) రాత్రికి ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరగనుందో ఎలాంటి ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకోనున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

దీప వదినను కాపాడాను...

మాలిని దీప గురించి ఆలోచిస్తూ చచ్చిందా బతికిందా ఏం తెలీడం లేదు అని అనుకుంటుంది. ఇంతలో సూరజ్ ఇంటికి వస్తాడు. సూరజ్ షర్ట్‌కి రక్తం మరకలు చూసి ఏమైంది అని మాలిని అడిగితే దీప వదినకు యాక్సిడెంట్ అయితే కాపాడాను అని చెప్తాడు. దీపని నువ్వు కాపాడావా అని మాలిని అంటే ఒకరి ప్రాణం కాపాడితే అలా అడుగుతావేంటి ఇప్పటికి కూడా దీప వదిన ఎలా ఉంది అని అడగటం లేదు అమ్మ,, ప్రాణం విలువ మనకి బాగా తెలుసు.. అని అంటాడు. నేను జ్యోత్స్న కలిసి దీపని కాపాడాం అని సూరజ్ మొత్తం చెప్తాడు. వాళ్లకి నువ్వు సాయం చేసినా వాళ్లు మాత్రం నిన్ను శత్రువు కొడుకులా చూస్తారు అని చెప్తుంది. ఇక కొత్త బ్రాంచ్‌కి వెళ్లు కొన్ని రోజులు నువ్వ అక్కడే ఉండాలి అని చెప్తుంది. సరే అని సూరజ్ అంటాడు.

త్వరగా వెళ్లు బావ..

దీప దగ్గరకు కార్తీక్ వెళ్లి మాట్లాడుతాడు. జ్యత్స్న, సూరజ్ నీ ప్రాణాలు కాపాడి మనం వాళ్లకి రుణపడేలా చేసుకున్నారు అని కార్తీక్ అంటాడు. ఇక దీప రెస్టారెంట్స్ మీద ఫైర్ యాక్సిడెంట్ అయిన విషయం చెప్పి ఒకసారి ఇంటికి వెళ్లి మాట్లాడమని అంటుంది. కార్తీక్ ఇంటికి వెళ్లే సరికి ఇంటికి లాక్ చేసి ఉంటుంది. మేనేజర్‌ని అక్కడ చూసి నువ్వేంటి ఇక్కడ అసలు ఇంట్లో వాళ్లు ఎక్కడ అడిగితే వాళ్లని మాలిని మేడం గెంటేసింది.. అని మొత్తం జరిగింది చెప్పి ఇవన్నీ మాలిని మేడంవే మొత్తం జప్తు చేసుకున్నారు అని చెప్తాడు. రేయ్ నమ్మకద్రోహి అంటూ తిడతాడు. మీ వాళ్లు ఓ రోడ్ల మీద పడి తిరుగుతున్నారో వెళ్లండి సార్ అని అంటాడు. ఇక దీపని డిశ్చార్జీ చేస్తామని చెప్పడంతో కార్తీక్ హాస్పిటల్‌కి వెళ్తాడు.

జ్యోత్స్న తిట్టుకుంటూ ఉంటుంది..

సూరజ్ కారులో వెళ్తూ ఉంటే జ్యోత్స్న ఫోన్ కనిపిస్తుంది. సూరజ్ ఫోన్ పట్టుకొని జ్యోత్స్న ఫోన్ అనుకుంటాడు. ఇక జ్యోత్స్న తన ఫోన్‌ కోసం మరో వ్యక్తి ఫోన్ నుంచి ఫోన్ చేస్తే సూరజ్ లిఫ్ట్ చేస్తాడు. నీ ఫోన్ నా దగ్గరే ఉంది.. ఎక్కడ ఉన్నావో చెప్పు తీసుకొచ్చి ఇస్తా అని సూరజ్ అంటే ఏం ఉందని ఇస్తావ్‌రా.. నమ్మించి ఇల్లు ఆస్తులు లాగేసుకొని రోడ్డు మీదకి లాగేశావ్ మేం రోడ్డు మీదకి వచ్చి రెండు రోజులు అయింది.. ఫోన్ కూడా నువ్వే ఉంచుకో అని ఫోన్ కట్ చేస్తుంది. ఇక సూరజ్ ఆ ఫోన్ గల వ్యక్తికి ఫోన్ చేసి అడ్రస్ అడుగుతాడు.

దీపకి తెలిసిన నిజం..

కార్తీక్, కాంచన, శ్రీధర్ వాళ్లు ఏమైపోయారో ఎంత వెతికినా దొరకడం లేదు అని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంతలో దీప వినేస్తుంది. ఏమైంది అని అడిగటంతో జరిగింది అంతా చెప్తారు. కూతురు ఇళ్లే కదా రావొచ్చు కదా అని దీప ఎమోషనల్ అవుతుంది. మన వాళ్లని మనతోనే మోసం చేయించింది ఆ మాలిని అని కార్తీక్ అంటాడు. ఇక దీప కార్తీక్‌లు ఎక్కడున్నా వాళ్లని ఇంటికి తీసుకొద్దాం అని మొత్తం వెతుకుతారు.

సూరజ్ సాయం..

సూరజ్ ఆ లొకేషన్‌కి వెళ్లి జ్యోత్స్న ఫోన్ చేసిన వ్యక్తితో కార్తీక్‌కి ఫోన్ చేయించి మీరు వెతుకుతున్న ఫ్యామిలీ మణికొండ బస్‌స్టాండ్లో ఉన్నారు అని అడ్రస్ చెప్పిస్తాడు. కార్తీక్, దీపలు వెంటనే అక్కడికి వెళ్తారు. పెద్దాయన, పారు, సుమిత్ర, దశరథ్, జ్యోత్స్న అక్కడే రోడ్డు పక్కన కూర్చొని ఉంటారు. కార్తీక్, దీపలు అక్కడికి వెళ్లి ఏంటి తాత ఇదది నా కూతురి ఇల్లు కంటే రోడ్డే మంచిది అనుకున్నారా.. జరిగింది అంతా నాకు తెలుసు అని కార్తీక్ అంటాడు. మేం ఇక్కడ ఉన్నాం అని మీకు ఎవరు చెప్పారు అని శివన్నారాయణ అంటే రెండు రోజులు నుంచి వెతుకుతున్నాం అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.

<a title="ఇలాంటి మరిన్ని ఆసక్తికర విషయాలతో పాటు తర్వాత ఎపిసోడ్‌లో ఏం జరగనుంది? తెలుసుకోవాలి అనుకుంటే మా ఏబీపీ దేశం పేజీని ఫాలో అవ్వండి." href="https://telugu.abplive.com" target="_self">ఇలాంటి మరిన్ని ఆసక్తికర విషయాలతో పాటు తర్వాత ఎపిసోడ్‌లో ఏం జరగనుంది? తెలుసుకోవాలి అనుకుంటే మా ఏబీపీ దేశం పేజీని ఫాలో అవ్వండి.