Karthika Deepam Edi Nava Vasantham Serial Today Episode బుల్లితెర ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్న "కార్తీకదీపం 2" సీరియల్ రోజు రోజుకూ ట్విస్ట్‌లు టర్న్‌లతో ఆసక్తికరంగా మారుతోంది. ఈ రోజు(సెప్టెంబరు 11వ తేదీన) రాత్రికి ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరగనుందో ఎలాంటి ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకోనున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

ఎవరి తలైనా నరుకుతాడు..

శివన్నారాయన జరిగింది ఇంట్లో చెప్పి ఆ దక్షిణామూర్తి కాలు నేను పట్టుకోవాలంట.. ఇక నుంచి వాళ్లని ఎవరూ తలచుకోవడానికి కూడా వీల్లేదు అని చెప్తారు. ఇంతలో అక్కడికి సూరజ్ వస్తాడు. నీతో మాట్లాడాలి తాత అని సూరజ్ అంటే ఎవడ్రా నీకు తాత.. ముందుకు వస్తే చంపేస్తా.. పగ పెట్టుకొని మనుషుల ప్రాణాలు తీయాలనుకునేవారురా మీరు.. అని ఫైర్ అవుతాడు. తల్లి ఆర్డర్ చేస్తే ఎవరి తలైనా నరుకుతాడు వీడు అని శివన్నారాయణ అంటే ఎందుకు అలా మూర్ఖుడిలా మాట్లాడుతావు అని సూరజ్ అంటాడు.

మా నాన్న చావుకి కారణం నీ కుటుంబమే..

జ్యోత్స్న సూరజ్ దగ్గరకు వెళ్లి ఏంటి అలా మాట్లాడుతున్నావ్ అని అడుగుతుంది. పెళ్లిలో మీరంతా అంతలా చెప్తుంటే మా అమ్మ ఏమైనా పొరపాటు పడిందా అని తెలుసుకోవడానికి వచ్చా కానీ ఇక్కడికి వచ్చాక మీ తాత ఆవేశం చూశాకా అర్థమైంది.. మా నాన్న చావుకి కారణం ఈ కుటుంబమే.. నీ కుటుంబమే ఈ రోజు చిన్న విషయానికి ఇంత రెచ్చిపోయిన మీ తాత ఆ రోజు ఎంత గొడవ చేసుంటాడో.. మా నాన్న చావుకి మా అత్త సుమిత్ర మాత్రమే కాదు.. మీ కుటుంబం మొత్తం అని సూరజ్ అంటాడు. ఆపరా.. మీ కుటుంబం మా అమ్మానాన్నల్ని చంపాలి అనుకున్నారు.. అది జరగక మా మీద నింద వేశారు అని జ్యోత్స్న అంటుంది.

సూరజ్‌ని కొట్టిన జ్యోత్స్న..

మా తాత కూతురి కోసం మీ ఇంటి గుమ్మం తొక్కాడు. నాతల్లి మారిపోయింది అని నీ తల్లి ఆలోచించలేదా.. బాబాయ్ అని మా అమ్మ మీ తాతని పిలుస్తుంది కదా.. అప్పుడు మీరు ఆలోచించ లేదా.. మేం అన్ని అడుగులు మీతో కలవాలి అని ముందుకు వస్తే మీరు ఒక్క అడుగు వేయలేరా.. ఈ రోజు మా తాతకి జరిగిన అన్యాయం ఓ పెద్ద నిదర్శనం.. శివన్నారాయణ ఓ మూర్ఖుడు అనడానికి అని సూరజ్ అంటాడు. మా తానని ఏమైనా అంటే నీకు మర్యాద దక్కదు అని జ్యోత్స్న అంటుంది. ఏంటే నువ్వు మర్యాద ఇచ్చేది.. ఈ పెళ్లి ఆగిపోవడం పది మందిలో పరువు పోవడం.. మీ తాత తల దించుకోవడం మీకు జరగాల్సిందే.. నువ్వు హంతకురాలి కూతురివి కాబట్టే నీకు ఇలా జరిగింది అని సూరజ్ అంటే సూరజ్‌ని జ్యోత్స్న లాగి పెట్టి కొట్టి ఎవర్రా హంతకురాలు.. నా ఇంటికి వచ్చి నా తల్లిని హంతకురాలు అంటావా.. నేను తిరిగి చాలా అనగలను.. నా తల్లిని హంతకురాలు అనడానికి నువ్వు సరిపోవు.. తగిన శాస్తి జరిగింది అన్నావ్ కదా.. ఏం పాపం చేసిందిరా నా కుటుంబం.. నేను నిన్ను ప్రేమించినట్లే మా అమ్మ మా నాన్నని ప్రేమించింది.. ప్రేమించడమే తప్పు అయితే ఆ తప్పు చేయని ఆడది ఈ భూమ్మీదే ఉండదు.. తగినశాస్తి జరిగింది అన్న మాట వెనక్కి తీసుకో.. ఎందుకంటే ఆగిపోయింది పెళ్లి కాదు.. నా ఊపిరి.. ఆ తర్వాత నేను కదులు తున్నాను.. అంటే ఇది నాకు జరగాల్సిందే.. మనసు లేని మనిషిని ప్రేమించాను అని అంటుంది. మా తాతకి నేను ఉన్నాను.. మా తాతకి అవమానం జరిగితే నేను ఊరుకోను అని సూరజ్ అంటే నాది సేమ్ వార్నింగ్.. మీ తాతకి నువ్వు ఉంటే నా తాతకి నేను ఉన్నాను.. ఇక నువ్వు వెళ్లొచ్చు.. అని జ్యోత్స్న అంటే వస్తా అని రావొద్దు మంచివాళ్లకే ఈ ఇంట్లో చోటు ఉంది అని జ్యోత్స్న అంటే అలా అయితే మీకు ఎవరికీ ఈ ఇంట్లో చోటు లేదు అందరూ బయటకు వెళ్లాల్సిందే అని సూరజ్ అంటాడు. సూరజ్ వెళ్తూ కారు కీస్ తీస్తుంటే పర్సు కింద పడిపోతుంది.

తాత, మనవడికి బాధ..

దక్షిణామూర్తి బట్టలు చిరిగి కూర్చొంటే సూరజ్ చెంప దెబ్బతో కూర్చొంటాడు. మాలిని సుమిత్ర ఏం అనుకుంటుంది అని సుమిత్రకు ఫోన్ చేస్తుంది. నా కొడుకుని నీ కూతురు కొట్టింది అంటే మంచిపనే చేసింది. ఎలా పెంచావ్ వాడిని.. నువ్వు నీ కొడుక్కి విషం ఇచ్చి పెంచావ్.. ఒక ఆడదాని మీదకి ఆయుధంగా వదిలావ్,, ఆడపిల్ల జీవితం నాశనం చేయాలి అనుకున్నవాడికి ఇలాగే జరగాలి.. కొడుకు చెంప ఎరుపెక్కింది అని నీ మనసు బరువెక్కినట్లు ఉంది.. కానీ మండపంలో నా కూతురి పెళ్లి ఆగిపోయినప్పుడు నాకు ఇంకా గుండె బరువు ఎక్కింది.. నా పతనం చూడాలి అనుకున్నవారు ఎవరూ నా వాళ్లు కాదు.. అది నా తండ్రి అయినా.. నా మేనల్లుడు అయినా.. నా వదినా అయినా.. మరోసారి నా ఇంటి గుమ్మం తొక్కొద్దు అని నీ కొడుకుకి చెప్పు తొక్కితే ఇదే రిపీట్ అవుతుంది అని సుమిత్ర అంటుంది. ఇదీ మీ కూతురి వరస.. మనం అందరం శివన్నారయణ ముందు ఓడిపోయాం.. మనం వాళ్ల మీద పగ తీర్చుకోవాలి అనుకుంటున్నాం కానీ వాళ్లే మన మీద పగ తీర్చుకుంటున్నారు అని మాలిని అంటుంది. అవమానానికి బదులు చెప్పాల్సిందే.. శివన్నారాయణ కుటుంబానికి బుద్ధి చెప్తా విధ్వంసం అంటే ఎలా ఉంటుందో వాళ్లకి చేసి చూపిద్దాం అని మాలిని అంటుంది.

మీకు సాయం చేస్తా..

మాలిని దీప, కార్తీక్‌లను కలుస్తుంది. పిన్ని సూరజ్ లాంటి వాళ్లని మన చుట్టూ ఎంత మందిని పెట్టిందో అని కార్తీక్ అంటే అంత అవసరం ఇంకా రాలేదు అని మాలిన అంటే కన్న కొడుకునే అనాథ అని నమ్మించావ్ కదా అని కార్తీక్ అంటాడు. మిమల్ని కంపెనీ నుంచి తీసేశారంట కదా.. మీకు ఆస్తిలో వాటా కూడా ఇవ్వలేదు.. ఇప్పుడు తీసేస్తే ఎలా అందుకే మీకు ఓ ఆఫర్ ఇస్తున్నా.. దీప నీకు నేను ఆఫర్ ఇస్తున్నా మా దగ్గర పని చేయ్ అని మాలిని అంటుంది. కార్తీక్ అంటే శివన్నారాయణ కూతురి కొడుకు కాబట్టి ఏం చెప్పినా తాతకే సపోర్ట్ చేస్తాడు. కానీ నువ్వు సుమిత్ర కుటుంబంతో ఏం సంబంధం లేని దానివి అని అంటే ఈ మాట కరెక్టే జాగ్రత్తగా విను దీప అని కార్తీక్ అంటాడు. శివన్నారాయణ కుటుంబం మాకు అన్యాయం చేసింది మనం చేతులు కలిపితే వాళ్ల పొగరు అణచొచ్చు అని మాలిన చేయి ఇస్తుంది. నాతో చేయి కలిపితే మీ జీవితాలు మారిపోతాయ్ అని అంటుంది. మనం సుమిత్ర దశరథ్‌ల పొగరు దించుదాం అని మాలిని అంటే ఈ మాట మరోసారి చెప్పండి అని దీప మాలిని చేయి నలిపేస్తుంది. ఏంటి అత్త సుమిత్ర, దశరథ్‌ల పొగరు దించుతావా.. కొడుకుని అడ్డు పెట్టుకొని ఇంత చేశావ్ లేదంటే కష్టం ఆ ఇంటి కాంపౌండ్‌లోకి కూడా అడుగు పెట్టనివ్వను.. సుమిత్రమ్మ నా కన్నతల్లి లాంటిది అని దీప అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.

<a title="ఇలాంటి మరిన్ని ఆసక్తికర విషయాలతో పాటు తర్వాత ఎపిసోడ్‌లో ఏం జరగనుంది? తెలుసుకోవాలి అనుకుంటే మా ఏబీపీ దేశం పేజీని ఫాలో అవ్వండి." href="https://telugu.abplive.com" target="_self">ఇలాంటి మరిన్ని ఆసక్తికర విషయాలతో పాటు తర్వాత ఎపిసోడ్‌లో ఏం జరగనుంది? తెలుసుకోవాలి అనుకుంటే మా ఏబీపీ దేశం పేజీని ఫాలో అవ్వండి.