Karthika Deepam Edi Nava Vasantham Serial Today Episode బుల్లితెర ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్న "కార్తీకదీపం 2" సీరియల్ రోజు రోజుకూ ట్విస్ట్‌లు టర్న్‌లతో ఆసక్తికరంగా మారుతోంది. ఈ రోజు(జూన్ 5న) ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరగనుందో ఎలాంటి ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకోనున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

నేను చదవను మేడం..

దీప, జ్యోత్స్నలు ఎవరి పనుల్లో వాళ్లు బిజీగా ఉంటారు. జ్యోత్స్న ఓ ఫైల్ చెక్ చేస్తుంటే కార్తీక్ చూసి ఇందులో ఇన్ని తప్పులు ఉంటే ఎలా అని అంటాడు. ఇక దీప దగ్గరకు మేనేజర్ వచ్చి ఫైల్ చెక్ చేయమని అంటాడు. దీప ఆ ఫైల్ చూసి ఇంగ్లీష్లో ఉంది చదవమని అంటుంది. దానికి మేనేజర్ నేను చదవను మేడం మళ్లీ మీరు ఛైర్మన్ గారి దగ్గర నాకు తిట్లు పడేలా చేస్తారు అంటాడు.

వెళ్లడానికి వీళ్లేదు బావ..

కార్తీక్ ఫైల్ చూడటానికి వెళ్లబోతే జ్యోత్స్న ఆపుతుంది. వెళ్లడానికి వీల్దేదు బావ ఇక్కడ ఎవరి డ్యూటీ వాళ్లే చేయాలి అని అంటుంది. ఇప్పుడు నీ చేతులు నన్ను ఆపేయొచ్చు.. కానీ ఏదో ఒక రోజు నువ్వు ఆపే అవసరం లేకుండా ఎదుటి వాళ్లు చైతన్యవంతులు అవుతారు.. అప్పుడు నీలాంటి వాళ్లకి ఆపే అవసరం కూడా రాదు అని కార్తీక్ అంటాడు. ఆ ఛాన్స్ నేను ఎవరికీ ఇవ్వను బావ అని జ్యోత్స్న చెప్తుంది.

ఇప్పుడేం చేయాలి..

దీప ఫైల్ చూస్తూ బావని జ్యోత్స్న రానివ్వదు.. ఇప్పుడు నేను ఏం చేయాలి అని అనుకుంటూ మేనేజర్‌కే చదవమని అంటుంది. మీరు మార్చమన్న డిటైల్స్ ఉన్నాయి అని మేనేజర్ అంటాడు. దీప మనసులో ఇతను చెప్పింది ఎలా నమ్మాలి అని మనసులో అనుకుంటుంది. కార్తీక్ దీపకి ఎలా సాయం చేయాలి అని అనుకుంటూ ఫ్యూన్‌ని పిలిచి ఫోన్‌లో యాప్ ఉంటుంది. ఫొటో తీసి పంపిస్తే ఇంగ్లీష్‌ని తెలుగులో మార్చి ఇస్తుంది. చదువుకోవచ్చు అని డైరెక్షన్ కార్తీక్ ఇస్తే దీప అలాగే చేసి విషయం తెలుసుకుంటుంది.

జ్యోత్స్నని లాగిపెట్టి కొట్టిన దీప..

నువ్వు చెప్పింది ఏంటి.. ఇందులో ఉంది ఏంటి.. నీతో ఎవరు ఇలా చేయిస్తున్నారు అని దీప మేనేజర్‌ని అడుగుతుంది. దాంతో ఆయన జ్యోత్స్న అని చెప్తాడు. ఇంకా ఎన్ని రోజులు ఇలా చేస్తావ్ అని దీప జ్యోత్స్నని లాగి పెట్టి కొడుతుంది. తీరా చూస్తే ఇదంతా జ్యోత్స్న కల.

ఈ మీటింగ్ అందుకే..

శివనారాయణ బోర్డు మీటింగ్ పెడతారు. దీప, జ్యోత్స్నలకు అప్పగించిన కంపెనీల గ్రోత్ చూద్దామని అంటారు. జ్యోత్స్నకు అప్పగించిన కంపెనీలో 10 శాతం గ్రోత్ కనిపిస్తుందని దశరథ్ చెప్పగానే అందరూ క్లాప్స్ కొడతారు. ఇక దీప అయితే 10 శాతం మైనస్‌లో ఉంటుంది. అందరూ దీపకి ఏం చేయలేదు.. అది జ్యోత్స్నకి అప్పగించేమని అంటారు. దీప నీకు ఉన్న ప్రాబ్లమ్ ఏంటో అందరికీ చెప్పు అని కార్తీక్ అంటాడు.

నాకు ఆ సపోర్ట్ కావాలి..

దీప మీటింగ్‌లో కంపెనీ నడపడానికి తనకి సపోర్ట్ అవసరం లేదని.. ఒంటరిగా పోరాడటం తనకి అలవాటే అని కానీ భాష వల్ల ప్రాబ్లమ్ ఉందని.. అందుకు సాయంగా ఓ మనిషి కావాలి అంటుంది. నీకు ఎవరూ సాయం చేయకూడదు అని చెప్పాం కదా అని జ్యోత్స్న అంటుంది. మీకు తోడుగా కార్తీక్ ఉన్నారు కదా.. మేనేజర్ ఉన్నారు కదా అలాగే నాకు కావాలి అని అంటుంది. అందరూ దీప కోరిక న్యాయంగానే ఉందని అంటారు. జ్యోత్స్న కూడా నో ప్రాబ్లమ్ అని కానీ దీప తన అసిస్టెంట్‌ని తానే వెతుక్కోవాలని అంటుంది.

సూరజ్ ఎంట్రీ..జ్యో షాక్..

అందరూ ఓకే అనడంతో దీప అసిస్టెంట్‌గా సూరజ్ ఎంట్రీ ఇస్తాడు. జ్యోత్స్న సూరజ్‌ని కొట్టించడంతో గాయాలు చూసి అందరూ మళ్లీ ఏమైనా కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చావా అని పెద్దాయన అడిగితే కలిసి పని చేయడానికి వచ్చా అని అంటాడు. నీ అసిస్టెంట్ వీడా అని జ్యోత్స్న అంటే కాదు మేడం నేను కలిసి పని చేయడానికి వచ్చా అని అంటాడు. నేను దీప గారి కోసం పని చేయడానికి వచ్చా అంటాడు. బాగా చదువుకున్న నువ్వు లక్షల్లో జీతం అడుగుతావ్.. కంపెనీ అంత ఇవ్వదు.. వెళ్లిపో అని జ్యోత్స్న అంటే నేను శాలరీ కోసం పని చేయను.. శాలరీ ఇస్తే అస్సలు ఇక్కడ ఉండను.. దీప గారితో పని చేస్తే నా ఫుడ్ కోర్ట్ వాళ్ల దగ్గర పెట్టుకునే ఛాన్స్ ఇచ్చారు.. ఫుడ్ మీ దగ్గర తింటే.. జ్యూస్ మా దగ్గర తాగుతారు. ఇద్దరికీ లాభమే అందుకే ఆఫర్ ఒప్పుకున్నా అంటాడు. అందరూ క్లాప్స్‌ కొట్టి దీప తెలివికి మెచ్చుకోవాలి అంటారు.

ఆ దెబ్బలు ఏంటి.. ఏమైంది..

దశరథ్ సూరజ్ తలకి గాయం అవ్వడం.. చేయి విరిగిపోవడం చూసి ఏమైంది ఏంటి ఆ గాయాలు అని అడుగుతారు. రాత్రి కుక్కలు వెంట పడ్డాయ్ అని సూరజ్ అంటాడు. తన పేరు చెప్పనందుకు జ్యోత్స్న హ్యాపీ అయిపోతుంది. సూరజ్‌లో చాలా మంచి వ్యాపార లక్షణాలు ఉన్నాయి.. చాలా మంచోడిలా ఉన్నాడు అని దశరథ్, శివనారాయణ అనుకుంటారు.

కలిసి పని చేస్తున్న దీప, సూరజ్! మండిపోతున్న జ్యో

దీప, సూరజ్ కలిసి పని చేస్తుంటే జ్యోత్స్న చూసి రగిలిపోతుంది. ఎవరికో మండినట్లు ఉందని కార్తీక్ అంటాడు. ఎంత మంది వచ్చినా నన్ను ఏం చేయలేరు అని జ్యోత్స్న అంటుంది. ఇక కార్తీక్ కాఫీ తాగడానికి వెళ్తున్నా ఎవరైనా రావొచ్చు అని దీప వినేలా అంటాడు. దీప విని సూరజ్‌కి చెప్పి కార్తీక్ వెనకాలే వెళ్తుంది. జ్యోత్స్న, సూరజ్ ఒకర్ని ఒకరు చూసుకుంటారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.

ఇలాంటి మరిన్ని విషయాలతో పాటు తర్వాత ఎపిసోడ్‌లో ఏం జరగనుంది? ఇలాంటి మరిన్ని ఆసక్తికర వివరాలు కోసం మా ఏబీపీ దేశం పేజీని ఫాలో అవ్వండి.