Karthika Deepam Edi Nava Vasantham Serial Today Episode బుల్లితెర ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్న "కార్తీకదీపం 2" సీరియల్ రోజు రోజుకూ ట్విస్ట్‌లు టర్న్‌లతో ఆసక్తికరంగా మారుతోంది. ఈ రోజు(జూన్ 30న) రాత్రికి ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరగనుందో ఎలాంటి ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకోనున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

తాతకి తెలిస్తే చంపేస్తాడు..

కార్తీక్ పారుతో అవుట్ హౌస్‌కి తాళం కొన్నదే నేను.. నా దగ్గర ఇంకో తాళం ఉంది.. సూరజ్ కాల్ చేసి చెప్పగానే నేను దీప వచ్చేశాం.. ఆ తాళం తీసి ఇంట్లోకి వెళ్లాం.. కావాలనే మళ్లీ వాచ్మెన్‌తో తాళం వేయించా.. ఈ విషయం తాతకి తెలిస్తే ఏమవుతుందో తెలుసు కదా అని కార్తీక్ అంటే చంపేస్తారు అని పారు అంటుంది. అందుకే చెప్పడం లేదు.. ఇప్పటికే ఒక శిక్ష అనుభవిస్తున్నావ్ జాగ్రత్త ఇలాంటివి మానుకో అని కార్తీక్ స్వీట్ వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతాడు.

ALSO READ: Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today June 29th: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: విహారి ఇంటికొచ్చిన లక్ష్మీ! పండుని మామయ్య అంటూ ఏడిపించేసిన సిరి పాప!

అమ్మాయిని తేవడం ఏంటి గ్రానీ..

పారు జ్యోత్స్న గదిలోకి వెళ్లిన తర్వాతా జ్యోత్స్న పారుతో ఏంటి గ్రానీ అమ్మాయిని తెస్తావా ఇలాంటి ప్లాన్ చేయడం ఏంటి.. అయినా బావకి నిజం తెలిసినా ఏం అనడం లేదు అంటే దాని వెనక ఇంకేదో ప్లాన్ ఉంది అని జ్యోత్స్న అనుమానిస్తుంది. ఇక కార్తీక్ దీపలు సూరజ్ దగ్గరకు వెళ్లి క్యారెక్టర్ మీద దెబ్బ తీయడానికి చేసే కుట్రలు ఇలా ఉంటాయి బ్రదర్.. అసలు నిజాలు ఇలా ఉంటాయి బ్రదర్ అని చెప్పి తర్వాత ఈ సక్సెస్‌లో నీది సగం అందుకే స్వీట్స్ తెచ్చాం అని సూరజ్‌ి స్వీట్ ఇవ్వమని దీపకి చెప్తాడు. దీప స్వీట్ ఇవ్వగానే సూరజ్ థ్యాంక్స్ వదినా అని అంటాడు. దీప కార్తీక్ అలా చూస్తూ ఉండిపోతే పిలవాలి అనిపించింది.. అని అంటాడు. దీప చాలా హ్యాపీ అయిపోతుంది.

సూరజ్ గురించి తెలుసుకుందాం..

దీప పడుకోకుండా సూరజ్‌ తనని వదిన అని పిలిచిన విషయం గుర్తు చేసుకొని నవ్వుకుంటుంది. కార్తీక్ ఏమైందని అడిగితే కొత్త బంధం దొరికింది.. నాకు ఓ మరిది మీకు ఓ తమ్ముడు దొరికాడు అని అంటుంది. ఈరోజు ఉండి రేపు వెళ్లిపోయే మనిషి మీద అభిమానం పెంచుకోవద్దు అని కార్తీక్ అంటాడు. సూరజ్ వెళ్లిపోతాడా అని దీప అంటే బ్రదర్ కాస్త డిఫరెంట్.. రాను అన్నాడు వచ్చాడు.. ఉండను అన్నాడు ఉంటున్నాడు.. రేపు ఏం చేస్తాడో తెలీదు కదా అని కార్తీక్ అంటాడు. సూరజ్ మనతో ఉండిపోవాలి అంటే మనం ఒక పని చేయాలి అని దీప అంటుంది. ఏంటి అని కార్తీక్ అడుగుతాడు. సూరజ్ గతం తెలుసుకుందాం.. తను ఎవరో తన తల్లిదండ్రులు ఎవరో తెలుసుకుంటే సూరజ్ బ్రాంచ్ కూడా మనలోనే ఉంది కదా.. ఇంకో బ్రాంచ్ ఏర్పాటు చేయొచ్చు.. సూరజ్ చాలా మంచోడు బావ.. నాకు జ్యోత్స్న వల్ల తోబుట్టువు బంధం లేదు కానీ సూరజ్ వల్ల ఆ ప్రేమ దక్కింది అని అంటుంది.

సూరజ్‌ స్కూటీలో జ్యోత్స్న..

జ్యోత్స్నని ఆఫీస్‌కి పది నిమిషాల్లో రమ్మని పెద్దాయన చెప్తారు. దాంతో కారు లేదు ఎలా వెళ్లాలా అని జ్యోత్స్న పారుతో మాట్లాడుతూ ఉంటుంది. ఇంతలో సూరజ్ కార్తీక్ స్కూటీ తీసుకొని వస్తాడు. ఇదేంటి వీడు వచ్చాడు అని పారు అంటే మా బావ స్కూటీ నువ్వేంటి తీస్తున్నావ్ అని జ్యోత్స్న అడుగుతుంది. నీకు పది నిమిషాల్లో ఆఫీస్‌కి రమ్మని కాల్ వచ్చిందా.. రా అయితే అని అంటాడు. నేను రాను అని జ్యోత్స్న అంటే నీకు ఇంకా 5 నిమిషాలు టైం ఉందని సూరజ్ అంటాడు. దాంతో పారు జ్యోత్స్నని స్కూటీ ఎక్కిస్తుంది. సూరజ్ గోతుల్లో స్కూటీ నడుపుతుంటే జ్యోత్స్న తిడుతుంది. ఇద్దరూ ఒకర్ని ఒకరు తిట్టుకుంటూ సొంత బావమరదల్లా తిట్టుకుంటారు. సూరజ్ పని పట్టాలి అని జ్యోత్స్న తన జడ పిన్నుతో సూరజ్‌ని గుచ్చుతుంది.

సీఈఓగా బాధ్యతలు తీసుకున్న దీప..

దీప ఆఫీస్‌లో సీఈవోగా బాధ్యతలు తీసుకుంటుంది. పెద్దాయన కంగ్రాట్స్ చెప్పి బొకే ఇస్తారు. దీప అందరికీ స్వీట్స్ ఇస్తుంది. జ్యోత్స్న స్వీట్ తినిపిస్తే దీప నాకు వద్దు అని అనేస్తుంది. తర్వాత దీపని క్యాబిన్‌కి తీసుకెళ్లి సీఈవో స్థానంలో కూర్చొపెడతారు. అందరూ వెళ్లిన తర్వాత దీప కార్తీక్‌కి స్వీట్ తినిపించి ఆశీర్వాదం తీసుకుంటుంది. తర్వాత కార్తీక్‌ని పట్టుకొని ఏడుస్తుంది. ఈ పదవి ఈ గౌరవం నీ బతుకు అంతా నువ్వు ఇచ్చిందే బావ.. ఎవరికీ అవసరం లేదు అని అందరూ నన్ను వదిలేశారు.. నువ్వే నాకు జీవితం ఇచ్చారు.. పాత సైకిల్ మీద టిఫెన్స్ పెట్టుకొని అమ్ముకునే దీప ఇప్పుడు ఇంత పెద్ద సంస్థకి అధినేత్రి అయింది.. నువ్వు లేకపోతే నేను లేను బావ అని దీప ఏడుస్తుంది. ఇది నీ స్థానం దీప.. నువ్వు నా కోసం పుట్టావ్.. పారు, జ్యోత్స్న ఎక్కడి వాళ్లు.. నిన్ను సీఈఓగా కాదు ఆ ఇంటి వారసురాలిగా అత్తామామ పక్కన కూర్చొపెట్టినప్పుడు చెప్పు థ్యాంక్స్ అని.. ఈ బిడ్డ సుమిత్ర మనవడు లేదా మనవరాలిగా పుట్టాలి అంతే.. ఏదో ఒకరోజు నేను నీ మనవరాలిని కాదు అని జ్యోత్స్న తాతకి చెప్పే పరిస్థితి వస్తుంది అని కార్తీక్ అంటాడు. జ్యోత్స్న ఆ మాటలు వింటుంది.

దీప అసిస్టెంట్..

తాత నన్ను అర్జెంటుగా రమ్మన్నారు అదేంటో చెప్పండి అని అడుగుతుంది. పెద్దాయన ఓ పేపర్ కార్తీక్‌కి ఇచ్చి అంతా రాశాను నువ్వే జ్యోత్స్నకి చెప్పు అని అంటాడు. కార్తీక్ బయటకు చదువుతాడు. జ్యోత్స్న ప్రతీ రోజు ఆఫీస్‌కి రావాలి.. జ్యోత్స్నకి డీఏ పోస్ట్ ఇచ్చారు అని అంటాడు. డీఏ అంటే ఏంటి బావ అని జ్యోత్స్న అంటే దీప అసిస్టెంట్ అని కార్తీక్ అంటాడు. జ్యోత్స్న బిత్తరపోతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.

ఇలాంటి మరిన్ని ఆసక్తికర విషయాలతో పాటు తర్వాత ఎపిసోడ్‌లో ఏం జరగనుంది? తెలుసుకోవాలి అనుకుంటే మా ఏబీపీ దేశం పేజీని ఫాలో అవ్వండి.