Karthika Deepam Edi Nava Vasantham Serial Today Episode బుల్లితెర ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్న "కార్తీకదీపం 2" సీరియల్ రోజు రోజుకూ ట్విస్ట్‌లు టర్న్‌లతో ఆసక్తికరంగా మారుతోంది. పారు పిల్లల్ని మార్చడం వల్ల జ్యోత్న్న చాలా నష్టపోయింది అనే చెప్పొచ్చు.. ఇంటి వారసురాలిగా రాజభోగాలు అనుభవించాల్సిన జ్యోత్స్నని దీప మెల్లమెల్లగా పని మనిషిని చేసేస్తుంది. మొదట బావే సర్వస్వం అని పెరిగిన జ్యోత్స్న నుంచి కార్తీక్‌ని లాక్కుంది.. తర్వాత నాన్నని లాక్కుంది.. అమ్మనీ తన వైపు తిప్పుకుంటుంది. ఇప్పుడు ఇంటి వారసురాలిగా పెరుగుతున్న జ్యోత్స్న సీఈఓ అధికారాన్ని లాక్కుంది.. అన్నీ కోల్పోతున్న జ్యోత్స్న ఈ రోజు ఎలాంటి స్థితికి వచ్చిందో..ఈ రోజు(జులై 1న) రాత్రికి ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరగనుందో ఎలాంటి ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకోనున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

జ్యోత్స్నకి దారుణమైన శిక్ష..

జ్యోత్స్నని దీప అసిస్టెంట్‌గా పని చేయమని పెద్దాయన ఆర్డర్ వేస్తారు. దీప రాకముందు ఆఫీస్‌కి రావాలి.. దీప వెళ్లిన తర్వాత వెళ్లాలి.. దీప ఏ వర్క్ ఇస్తే అది చేయాలి.. కాదు కూడదు అనకూడదు.. ఈరోజు నుంచి జ్యోత్స్నకి ఎలాంటి సౌకర్యాలు ఉండవు.. కారు.. డ్రైవర్ ఇలాంటివి ఏవీ ఉండవు.. జ్యోత్స్న బ్యాంక్ అకౌంట్స్ అన్నీ బ్లాక్ చేయబడతాయి. అప్పులు చేయడానికి తప్పులు చేయడానికి వీల్లేదు.. దీప దగ్గర అసిస్టెంట్‌గా పని చేస్తున్నందుకు జీతం ఇస్తాం.. అది ఎంత అనేది దీప నిర్ణయిస్తుంది.. ఇవేమీ నచ్చకపోతే ఆఫీస్ నుంచి వెళ్లిపోవచ్చు.. ఆఫీస్‌ నుంచి వెళ్లిపోతే ఇంట్లో కూడా స్థానం లేదు. అని అగ్రిమెంట్ ఏర్పాటు చేయిస్తారు. అది విన్న జ్యోత్స్న ఫ్యూజులు ఎగిరిపోతాయి. అన్నీ ఓకే అయితే సంతకం పెట్టు లేదంటే బయటకి వెళ్లిపో అని పెద్దాయన జ్యోత్స్నకి చెప్తాడు.

మనవరాలికి ఇంత శిక్షా..

మనవరాలికి ఇంత పెద్ద శిక్ష వేస్తారా అని పారు అడిగితే పూర్వం రాజులు తన వారసుల్ని రాజ్యం నుంచి దూరంగా వదిలేస్తారు. అప్పుడే తను ఎన్నో కష్టాలను ఎదుర్కొని తన రాజ్యాన్ని వెతుక్కొని వస్తారు. రాజ్యం ఏలుతారు అని చెప్తారు. పెద్దాయన చెప్పిన ప్రతీ మాటకు కార్తీక్ దీపని చూసి అలాగే బతికింది ఇప్పుడు రాజ్యానికి వచ్చేసింది అని అనుకుంటాడు. సవాలు స్వీకరిస్తావా.. సంతకం పెడతావా,, వెళ్లిపోతావా అని జ్యోత్స్నని పెద్దాయన అడిగితే సంతకం పెట్టి సవాలు స్వీకరిస్తున్నా అని అంటుంది.

ALSO READ: Karthika Deepam 2 Serial Today June 30th: కార్తీకదీపం 2 సీరియల్: సీఈఓ బాధ్యతలు తీసుకున్న దీప.. దీప అసిస్టెంట్‌గా జ్యోత్స్న! దీపని వదినా అన్న సూరజ్!

ఎవడ్రా నన్ను ఆపేది..

జ్యోత్స్న జరిగింది తలచుకొని బాధ పడుతుంటే సూరజ్ వచ్చి ఒక తప్పు నీ పొజిషన్ మార్చేసింది. ఒక సంతకం నీ తలరాతనే మార్చేసింది.. కాళ్లు నేళ్ల మీద వదిలేసి ఆకాశంలో ఎగురుతున్నా అనుకున్నావ్.. నువ్వేదో ప్రత్యేకం అనుకున్నావ్.. ఇప్పుడు రెక్కలు విరిగిన పక్షిలా నేల మీద పడ్డావ్ అని అంటాడు. సూరజ్ ఎవడ్రా నన్ను ఆపేది అని జ్యోత్స్న అంటుంది. నువ్వేనే నిన్ను ఆపేది.. నీ అహంకారం.. నీ బలుపు.. నీ పొగరు.. మమల్ని కొంత కాలం ఇబ్బంది పెట్టొచ్చు.. కానీ నిన్ను పూర్తిగా నాశనం చేస్తాయి అని అంటాడు. మీరు ఎక్కడి నుంచో వచ్చి నా హోదాని అధికారాన్ని తీసుకుంటా అంటే ఊరుకుంటానా.. మా గ్రానీ చేసిన ఒక్క తప్పు నన్ను నా ఆఫీస్‌లోనే అసిస్టెంట్‌ని చేసింది.. అయినా వదలను నేను నాకు నచ్చినట్లు బతుకుతాను.. నా పొగరే నా ఐడెంటిటీ అని జ్యోత్స్న అంటుంది.

మీ ఇద్దరికీ ఈ మధ్య మాటలు ఎక్కువ అయ్యాయి..

ఇంతలో కార్తీక్‌ సూరజ్‌కి కాల్ చేస్తాడు. ఎక్కడా అని అడిగితే డీఏ గారితో మాట్లాడుతున్నా అని సూరజ్ అంటాడు. దానికి కార్తీక్ మీ ఇద్దరికీ ఈ మధ్య మాటలు ఎక్కువ అయ్యాయి అని అంటాడు. ఎంత మాట అన్నావ్ బ్రదర్ అని సూరజ్ అంటాడు. సరే సరే తనని త్వరగా ఇక్కడికి తీసుకొచ్చేయ్ పని ఉంది అని అంటాడు. సూరజ్ సరే అని బ్రదర్ పిలుస్తున్నాడు పద అని అంటాడు. జ్యోత్స్న చిరాకుగా వెళ్లే ఐలవ్‌యూ బంగారం అంటూ సూరజ్ అరుస్తాడు.

ALSO READ: Illu Illalu Pillalu Serial Today July 1st: ఇల్లు ఇల్లాలు పిల్లలు: స్కానింగ్ రిపోర్ట్స్‌తో డాక్టర్ తుక్కు రేగ్గొట్టిన నర్మద! రాజపుష్పం గదిలో ప్రేమ!

ఇదే నీ స్థానం.. ఇక్కడే కూర్చొ..

జ్యోత్స్న కార్తీక్ దగ్గరకు వెళ్తే రండి డీఏ గారు అని కార్తీక్ అంటాడు. డీఏ ఏంటి జ్యోత్స్న అని పిలు.. ప్రేమ ఎక్కువ అయితే మరదలు అను అని అంటుంది. దానికి కార్తీక్ నాకు అంత ప్రేమ ఎక్కువ అయిపోలేదులే అని అంటాడు. ఇక జ్యత్స్నని దీప గది ముందు హాల్‌లో సీటు ఏర్పాటు చేస్తాడు. అది చూసిన పారు పాపంరా.. ఏసీ లేదు ఏం లేదు ఇక్కడ కూర్చొవడం ఏంటి అని అంటే పీఏ సీఈఓ పాటు ఆ గదిలో కూర్చొంటుందా అంటి అని అంటాడు. పారు కార్తీక్‌ని బతిమాలుతుంటే జ్యోత్స్న ఏం అవసరం లేదు అని అక్కడే కూర్చొంటుంది. కార్తీక్ జ్యోత్స్నతో ఈ రోజు నుంచి నువ్వు దీపకి అసిస్టెంట్ కానీ నీకు ఎవరూ అసిస్టెంట్‌లు ఉండరు అని అంటాడు.

ఈ బెల్ ఐడియా ఎవరిది..

దీప బెల్ కొడితే జ్యోత్స్న టేబుల్ మీద మోగుతుంది. డీఏ గారు వెళ్లండి అని కార్తీక్ అంటే ఎక్కడికి అని జ్యోత్స్న అంటుంది. ఈ బెల్ ఐడియా ఎవరిది బాబు అని పారు అడుగుతుంది. నాదే అండీ.. మాటి మాటికి పిలిస్తే సీఈఓ గారు అలిసిపోతారు అని ఈ బెట్ ఐడియా నేను ఇచ్చా అని సూరజ్ అంటాడు. నువ్వు మామూలోడివి కాదు అని పారు అనుకుంటుంది. ఇక జ్యోత్స్న దీప దగ్గరకు వెళ్లి ఎందుకు పిలిచావ్ అంటే ఈ బెల్ పని చేస్తుందా లేదా అని చెక్ చేశా అని అంటుంది. జ్యోత్స్న వెళ్లిపోతుంటే కార్తీక్ బెల్ కొడతాడు. మళ్లీ జ్యోత్స్న వస్తే ఊరికే టెస్ట్ చేశా అని కార్తీక్ అంటాడు. మళ్లీ దీప కాలింగ్ బెల్ కొట్టి ఈ సారి నీ కోసమే కొట్టా ఒకటి తక్కువైంది అని అంటుంది. ఏంటి అని జ్యోత్స్న అంటే అప్పుడే ఫ్యూన్ వచ్చి మేడం కాఫీ అని అంటాడు. అర్థమైందా ఏం తగ్గిందో అని అంటుంది. అర్థమైంది మేడం అని జ్యోత్స్నఅంటుంది. అది గుడ్ అలా రా దారికి అని దీప అంటుంది. కార్తీక్ దీపతో సెల్ఫీ తీసుకుంటాడు. జ్యోత్స్న తట్టుకోలేకపోతుంది అని దీప అంటే ఇది ప్రారంభమే ముందు ఉంది పండగ అని అంటాడు.

ఆగవే.. ఏం చేస్తున్నావ్..

దీప కార్తీక్, జ్యోత్స్న దీప ఇంటి నుంచి వచ్చిన క్యారేజ్ తింటారు. దీప జ్యోత్స్నకి వాళ్ల ఫుడ్ వడ్డిస్తుంది. అప్పుడు జ్యోత్స్న దీప తాళి చూసి నీ మెడలో పడింది కాబట్టి నువ్వు ఇంత అనుభవిస్తున్నావ్.. అదే నా మెడలో పడుండే నేను ఈ సంస్థకి యజమాని అయ్యేదాన్ని అనుకుంటుంది. ఇక దీప స్పూన్ కింద పడిపోతే కార్తీక్ ప్లేట్‌లో తీసుకుంటుంది. దాంతో దీప ఆగవే అని అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.

<a title="ఇలాంటి మరిన్ని ఆసక్తికర విషయాలతో పాటు తర్వాత ఎపిసోడ్‌లో ఏం జరగనుంది? తెలుసుకోవాలి అనుకుంటే మా ఏబీపీ దేశం పేజీని ఫాలో అవ్వండి." href="https://telugu.abplive.com" target="_self">ఇలాంటి మరిన్ని ఆసక్తికర విషయాలతో పాటు తర్వాత ఎపిసోడ్‌లో ఏం జరగనుంది? తెలుసుకోవాలి అనుకుంటే మా ఏబీపీ దేశం పేజీని ఫాలో అవ్వండి.