Karthika Deepam Edi Nava Vasantham Serial Today Episode బుల్లితెర ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్న "కార్తీకదీపం 2" సీరియల్ రోజు రోజుకూ ట్విస్ట్‌లు టర్న్‌లతో ఆసక్తికరంగా మారుతోంది. ఈ రోజు(ఆగస్టు 6న) రాత్రికి ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరగనుందో ఎలాంటి ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకోనున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

ఎందుకురా చూడటం లేదు..

జ్యోత్స్న సూరజ్‌ని కలిసి అవుట్‌ హౌస్‌ నుంచి పొమ్మంటే ఆఫీస్‌కి వచ్చావేంట్రా.. ఇక్కడ కూడా నువ్వు ఉండకూడదు.. నువ్వు వెళ్లిపో అని జ్యోత్స్న అంటే మీ ఇంట్లో ఉండొద్దు అన్నావ్ వచ్చేశా.. ఇక్కడ నేను దీప గారి అడ్వైజర్‌ని నన్ను చూడటం నీకు ప్రాబ్లమ్ అయితే కళ్లు మూసుకో.. మాట్లాడటం ఇష్టం లేకపోతే నోరు మూసుకో అని సూరజ్ అంటాడు. నా ముఖం చూసి మాట్లాడరా అని జ్యోత్స్న అంటే నాకు ఇష్టం లేదు.. అని అంటాడు. జరిగింది అంతా తలచుకొని నా మీద ఏమైనా ప్లాన్ చేయాలి అనుకున్నావ్ అంటే ఊరుకోను అని జ్యో అంటే నేను ఏం ప్లాన్ చేయను అని సూరజ్ అంటాడు. లేదురా నువ్వు ఇలా నా ముఖం చూడకుండా.. నా గురించి ఎవరికీ చెప్పకపోవడం.. ఇలా తప్పించుకొని తిరగడం ఇలా అన్నీ చూస్తే ఏదో గట్టిగానే ప్లాన్ చేశావ్ అని జ్యోత్స్న అంటుంది. ఇంతలో సూరజ్‌కి పెద్దాయన పిలవడంతో నా గురించి చెప్తావా.. ఏం చెప్తావో చెప్పరా అని జ్యోత్స్న అడుగుతుంది. జ్యోత్స్న పారిజాతానికి కాల్ చేసి సూరజ్ ఆఫీస్‌లోనే ఉన్నాడు. నా ముఖం చూడటం లేదు అని చెప్తుంది.

Also Read : Part Timers Series OTT : ఓటీటీలోకి బిగ్ బాస్ తనూజ ఎంట్రీ - ఎమోషనల్ కామెడీ సిరీస్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

ఇక్కడ నుంచి కూడా వెళ్లిపోతా..

సూరజ్‌ శివన్నారాయణ దగ్గరకు వెళ్తాడు. ఎందుకు అవుట్‌హౌస్‌ ఖాళీ చేసి వెళ్లిపోయావ్ అని అడుగుతారు. గాయాలు అయ్యావని వచ్చాను.. తగ్గిపోయావి.. ఇంకా ఉండటం మర్యాద కాదు సార్ అని సూరజ్ అంటాడు. ఇంకా పాత సూరజ్‌లానే ఉన్నావా.. అప్పటి సూరజ్‌లా నిన్ను చూడాలి అనుకోవడం లేదు.. అప్పుడు నువ్వు నాకు సాయం చేసిన సూరజ్‌వే.. ఇప్పుడు నువ్వు నా మనిషివి.. నా ఇంట్లో మనిషివి.. నా మనవడు కార్తీక్ అంటే నాకు చాలా ఇష్టం వాడితో పాటు వాడి స్థానం నీకు ఇచ్చాను అంటే నా మనసులో స్థానం అర్థం చేసుకో అని పెద్దాయన అంటారు. అంత మంచి స్థానం ఇచ్చినందుకు థ్యాంక్స్ సార్.. కానీ అంత విలువైన స్థానాలు శాశ్వతం కాదు సార్. అతిథిలా వచ్చాను అతిథిలా వెళ్లిపోతాను.. దీప గారు ఇచ్చిన పని అయిపోతే ఇక్కడ నుంచి కూడా వెళ్లిపోతా అని సూరజ్ అంటాడు. కారణం ఏంటి అని పెద్దాయన అడిగితే నా మనసుకి ఇష్టం లేని చోట నేను ఉండలేను అని సూరజ్ అంటాడు. నీ కంటే పెద్దవాడిని ఎంతో జీవితం చూసిన వాడిని.. తప్పు చేస్తే సొంత వాళ్లని కూడా క్షమించిన వాడిని అలాంటిది నాకు నచ్చిన వాడిని వదులుకోను కూడా.. నీ విషయంలో నేను ఏమైనా తప్పు చేశానా అని పెద్దాయన అంటే లేదు అని సూరజ్ అంటే నా వాళ్లు ఎవరైనా చేశారా అని అడిగితే సూరజ్ జ్యోత్స్నని గుర్తు చేసుకుంటాడు. ఉండాలి అనుకున్నా ఉన్నాను.,. వెళ్లిపోవాలి అనుకున్నాను వెళ్లిపోతాను.. నా వర్క్ కూడా అయిపోయింది సార్ దీప గారికి కూడా చెప్పి వెళ్లిపోతా అని అంటాడు. సరే ఒకసారి ఇంటికి వచ్చి వెళ్లిపో అని పెద్దాయన అంటే రాను అని సూరజ్ అంటాడు. నా కోసం రా అని పెద్దాయన చెప్తారు. సూరజ్ ఏం చెప్పకుండా వెళ్లిపోయాడేంటా అని పెద్దాయన అనుకుంటారు.

రా డ్రాప్ చేస్తా..

సూరజ్ బయట వెయిట్ చేస్తుంటే జ్యోత్స్న స్కూటీ మీద వెళ్లి సూరజ్ పక్కనే స్కూటీ ఆపి పిలుస్తుంది. సూరజ్ జ్యోత్స్న వైపు కూడా చూడదు.. నేను నీకు లిఫ్ట్ ఇవ్వడానికి వచ్చా అని జ్యోత్స్న అంటుంది. అవసరం లేదు అని సూరజ్ అంటే పర్లేదు ఎక్కడ ఉంటావో చెప్పు డ్రాప్ చేస్తా అని అంటాడు. ఏం వద్దు అని సూరజ్ అంటాడు. మా తాతతో ఏం మాట్లాడావ్ అని జ్యోత్స్న అడుగుతుంది. నేను చెప్పను నాకు అవసరం లేదు అని సూరజ్ అంటాడు. ఇంతలో సూరజ్ బుక్ చేసిన బైక్ రావడంతో ఏం మాట్లాడకుండా వెళ్లిపోతాడు.

Also Read : Crime Thrillers OTT : ఒకే ఓటీటీలో ఒకే రోజు మూడు క్రైమ్ థ్రిల్లర్స్ స్ట్రీమింగ్ - ఎందులో చూడొచ్చంటే?

తను మానేశాడు..

జ్యోత్స్న సూరజ్‌ని తిట్టుకుంటూ ఉంటే దీప, కార్తీక్‌లు వచ్చి ఎవరిని తిడుతున్నావ్ అని అడుగుతారు. నీ అడ్వైజర్‌ సూరజ్‌ని అని జ్యోత్స్న అంటే ఇప్పుడు తను నా అడ్వైజర్ కాదు తను మానేశాడు అని దీప అంటుంది. మరి నా ముఖం ఎందుకు చూడటం లేదు.. ఏంటి నీ బాధ అని కార్తీక్ అడిగితే అలా ఏం లేదు బావ కొందరు వెళ్లిపోతే బెటర్ అని కోపంగా వెళ్లిపోతుంది. జ్యోత్స్న పైకి కోపంగా ఉంది కానీ బాధ పడుతుంది అని దీప, కార్తీక్ అనుకుంటారు.

నన్ను ఒంటరిగా వదిలేయ్..

పారు జ్యోత్స్నతో మాట్లాడటానికి వెళ్తే నన్ను ఒంటరిగా వదిలేయ్ అని జ్యోత్స్న అరుస్తుంది. నీ జీవితం బాగు పడటానికి సరైన నిర్ణయం తీసుకునే టైం వచ్చిందే సరైన నిర్ణయం తీసుకో అని పారు అంటుంది. నిర్ణయం తీసుకోవడానికి ఏం లేదు.. ఆ సూరజ్ గాడు ఇంట్లో నుంచి పోయాడు.. మంచి నిర్ణయం తీసుకున్నా కాబట్టే నా జీవితం ఆ సూరజ్‌ గాడికి బలై పోకుండా కాపాడుకున్నా అని జ్యోత్స్న అంటుంది. నీకు రియాలిటీ చూపించాల్సిందే అని పారు ఓ పెన్‌ పేపర్ పట్టుకొని టీచర్ అవతారం ఎత్తుతుంది. నీకు ఉన్న బలాలు వాడికి ఉన్న బలాలు చూద్దాం అని జ్యోత్స్న, సూరజ్ పేర్లు చెరో వైపు రాసి పారిజాతంతో పాటు ఇంట్లో అందరి పేర్లు సూరజ్ వైపు రాస్తుంది. జ్యోత్స్న ఏంటి నీ పేరు వాళ్లతో రాశావని అని అడిగితే నేను కూడా ఆ పార్టీకే వెళ్లిపోయా అని పారు అంటుంది.

పెళ్లి చేసుకోవే..

ఇంట్లో అందరూ సూరజ్‌తో నీ పెళ్లి చేయాలి అనుకుంటున్నారు. నీకు పెళ్లి అయితే ఆస్తి మొత్తం నీ పేరు మీద రాస్తా అని చెప్పారు. సూరజ్‌కి దీప కార్తీక్‌లు నువ్వు దాసు కూతురివి అని చెప్పరు. సూరజ్ అనాథ కాబట్టి సూరజ్ ఇల్లరికం వచ్చేస్తాడు. పైగా మీ అమ్మ నిన్ను పెళ్లి చేసుకుంటే నెత్తిన పెట్టుకొని చూసుకుంటుంది. సూరజ్‌ గాడికి నువ్వంటే ఇష్టమే.. కానీ నీలా ఓపెన్‌గా చెప్పడు. నీకు మనసులో వాడు ఓకే అని ఉన్నా నీ అహంకారం ఒప్పుకోదు అని పారు అంటుంది. అలా అని నేను చెప్పానా అని జ్యోత్స్న అంటే ఆఫీస్‌లో వాడు నీ ముఖం చూడకపోతే నీకు ఎందుకే అంత నొప్పి.. వాడు అందంలో కూడా రాజేనే.. నీకు సరైన జోడీనే.. వాడిని నువ్వు పెళ్లి చేసుకుంటే వాడు ఒక్కడే ఈ రెస్టారెంట్‌ని యువరాజులా నడుపుతాడు. నువ్వు యువరాణిలా కూర్చొవచ్చు.. ఈ సంబంధం వద్దు అన్నావ్ అంటే మరో సంబంధం చూస్తారు. అప్పుడు నువ్వు అత్తారింటికి వెళ్లిపోవాలే అందుకే ఈ సంబంధాన్ని ఒప్పుకోవే అని పారు అడుగుతుంది. జ్యోత్స్న మౌనంగా వెళ్లిపోతుంది.

ఆస్తి మొత్తం నీదే జ్యోత్స్న..

శివన్నారాయణ, దశరథ్, సుమిత్ర, పారిజాతం జ్యోత్స్నతో ఈ రోజు సూరజ్‌తో మాట్లాడుతాం అని చెప్తారు. నాకు ఇష్టం లేదు అని జ్యోత్స్న అంటే నీ ఇష్టంతో మాకు పని లేదు అని దశరథ్ అంటాడు. డాడీ అని జ్యోత్స్న అంటే అవును జ్యోత్స్న నీకు ఏం కావాలో నీకు తెలీదు.. అది మాకు తెలీదు.. నీకు ఏం ఇస్తే సంతోషంగా ఉంటావో మాకు తెలుసు.. అందుకే నీ ఇష్టంతో మాకు పని లేదు.. కానీ నీకు తెలియాలి అని చెప్పాం అంతే అని సుమిత్ర అంటుంది. ఇంతలో కార్తీక్, దీపలు వస్తారు,, వస్తూ వస్తూ వీలునామా తీసుకొస్తారు. అంతా నువ్వు చెప్పినట్లే రాయించా మామయ్య అని కార్తీక్ అంటాడు. వీలునామా చదువురా అని దశరథ్ అంటే ఈ వీలునామా ప్రకారం సూరజ్‌, జ్యోత్స్నల పెళ్లి అయిన తర్వాత ఆస్తి మొత్తం జ్యోత్స్నకే దక్కుతుంది. వీలునామా వేరేలా ఉండాలి కదా అని పారు అంటే మామయ్య మార్చేశాడు అని కార్తీక్ అంటాడు. పారిజాతం తీసుకొని జ్యోత్స్నకి చదవమని అంటే ఏది ఎవరికి ఇవ్వాలో నీకు తెలీదు అని శివన్నారాయణ తీసుకొని ఇప్పుడు వీలునామా రాయించడం ఏంటి అని అడిగితే దానికి నేనే కారణం అని సుమిత్ర అంటుంది. తాత ఆస్తి పోతే కార్తీక్ ఊరుకుంటాడా అని పారు అంటే తాత ఆస్తిలో నాకు ఒక్క రూపాయి కూడా వద్దు మేం కోరుకున్నది కూడా జ్యోత్స్న పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండటమే అని కార్తీక్ అంటాడు. అలా ఎప్పటికీ జరగదు అని జ్యోత్స్న వెళ్లిపోవాలని చూస్తే కచ్చితంగా జరుగుతుంది జ్యోత్స్న అని సుమిత్ర అంటుంది. పెళ్లి తర్వాత ఆస్తి మొత్తం నీది నీ భర్తదే మేం చెప్పినట్లు విని సూరజ్‌ని పెళ్లి చేసుకో అని సుమిత్ర అంటే జ్యోత్స్న కోపంగా వెళ్లిపోతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.

<a title="ఇలాంటి మరిన్ని ఆసక్తికర విషయాలతో పాటు తర్వాత ఎపిసోడ్‌లో ఏం జరగనుంది? తెలుసుకోవాలి అనుకుంటే మా ఏబీపీ దేశం పేజీని ఫాలో అవ్వండి." href="https://telugu.abplive.com" target="_self">ఇలాంటి మరిన్ని ఆసక్తికర విషయాలతో పాటు తర్వాత ఎపిసోడ్‌లో ఏం జరగనుంది? తెలుసుకోవాలి అనుకుంటే మా ఏబీపీ దేశం పేజీని ఫాలో అవ్వండి.