Karimnagar Crime News: భార్య యూట్యూబర్, భర్త ఇంటీరియర్‌ డిజైనర్. చాలా రోజులుగా ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నారు. తన సోషల్ మీడియాలో ఉన్న ఫాలోవర్స్‌కు ఆమె బంపర్ ఆఫర్ ఇచ్చింది. ఆమె స్వయంగా కాల్ చేసి ఆఫర్స్ ఇచ్చేది. వచ్చిన వారితో ఏకాంతంగా గడిపేది. వాటిని భర్త సీక్రెట్‌గా వీడియోలు తీసేవాడు. వాటిని అడ్డం పెట్టుకొని కోట్లు వసూలు చేశారు. కరీంనగర్‌లో జరిగిన ఈ దందా గురించి తెలుసుకున్న పోలీసులు షాక్ తిన్నారు. వారిని అదుపులోకి తీసుకొని వారి నుంచి భారీ స్థాయిలో న్యూడ్ వీడియోలు, డబ్బులు సహా ఇతర వస్తువులు స్వాధీనం చేసుకున్నారు.

మంచిర్యాల జిల్లాకు చెందిన దంపతులు కరీంనగర్‌లోని ఆరెపల్లిలో ఉంటున్నారు. భర్త డిజైనర్‌గా పని చేస్తున్నాడు. భార్య యూట్యూబ్ ఛానల్‌ నడుపుతోంది. గత కొంత కాలంగా వీరు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు. దీని నుంచి బయటపడేందుకు సులువైన మార్గాన్ని ఎంచుకున్నారు.

సోషల్ మీడియా వేదికగా భార్య తన అర్ధనగ్న ఫోటోలతో ఫాలోవర్స్‌కు ఎర వేసేది. ఇందులో కాస్త తేడాగా మెసేజ్ చేసేవాళ్లు, వ్యక్తిగతంగా మెసేజ్ చేసే వాళ్లపై వల విసిరేవాళ్లు. వాళ్లతో ఏకంతంగా గడిపేందుకు ఓకే చెప్పారు.

భార్య సోషల్ మీడియా ఫాలోవర్స్‌తో ఏకంతంగా గడిపే సమయంలో ఆ దృశ్యాలను భర్త సీక్రెట్‌గా షూట్ చేసేవాడు. వీటితో వారిని బెదిరించి డబ్బులు వసూలు చేసేవాళ్లు. ఇలాంటి బాధితులు వందల మంది ఉన్నట్టు తేలింది. బాధితుల్లో వివిధ ప్రొఫెషనల్స్‌ కూడా ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ఎక్కడ వీడియోలు సోషల్ మీడియాలో పెడతారో అని కంగారు పడి వాళ్లు అడిగినంత సమర్పించుకున్నారు.

కుటుంబానికి బాగా తెలిసిన వారితో కూడా ఇలాంటి వ్యవహారాన్ని నడిపించారు ఈ దంపతులు. అతని నుంచి భారీగా వసూళ్లు చేశారు. ఈ మధ్య కాలంలో అతను వారికి దూరంగా ఉంటున్నాడు. దీంతో ఫోన్ చేసి ఐదు లక్షలు డిమాండ్ చేశారు. భయపడిపోయిన ఆ వ్యక్తి లక్ష రూపాయలు ఇచ్చాడు. మిగిలిన డబ్బులు త్వరలోనే ఇస్తానని అన్నాడు. ఈ విషయం తెలుసుకున్న బంధువులు ఫిర్యాదు చేయాలని సూచించారు. వారి సలహా మేరకు పోలీసులను ఆశ్రయించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.

వెంటనే ట్రాప్ చేసిన పోలీసులు దంపతులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద న్యూడ్ వీడియోలు, లక్షల రూపాయల డబ్బు, మొబైల్‌ ఫోన్‌లు, చెక్‌లు స్వాధీనం చేసుకున్నారు. ఈ దందాతోనే వారు 65లక్షల ప్లాట్‌, ఖరీదైన ఫర్నీచర్, బంగారం, కారు, వంటి కొనుగోలు చేసినట్టు పోలీసుల విచారణలో తేలింది.