కోలీవుడ్ స్టార్ ధనుష్ కథానాయకుడిగా రూపొందిన తాజా సినిమా 'కర'. లేటెస్టుగా విడుదల అయిన ట్రైలర్ అందర్నీ ఆకట్టుకుంటోంది. బ్యాంకు దొంగగా ధనుష్ నటించినట్టు అర్థం అవుతోంది. ధనుష్ అంటే తెలుగులోనూ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆయన ప్రతి సినిమా తెలుగులోనూ విడుదల చేయడం కామన్. ఇప్పుడీ 'కర'ను సైతం తెలుగులో విడుదల చేయనున్నారు.

ఏప్రిల్ 30న థియేటర్లలోకి 'కర'
ధనుష్ 'కర' చిత్రాన్ని కుష్మిత గణేష్ సమర్పణలో డా. ఇషారి కె. గణేష్ ప్రొడ్యూస్ చేశారు. ఈ చిత్రానికి విఘ్నేశ్ రాజా దర్శకత్వం వహించారు. ఏప్రిల్ 30న తెలుగు, తమిళ భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాను తెలుగు ప్రేక్షకుల ముందుకు విఘ్నేశ్వర ఎంటర్టైన్మెంట్స్, ఆర్ స్టార్ లాజిస్టిక్స్ సంస్థలు తీసుకు వస్తున్నాయి. సిహెచ్ సతీష్ కుమార్, రాజేష్ కుమార్ బొబ్బర విడుదల చేస్తున్నారు.

Also Read: Vijay Deverakonda Nani: నాని, విజయ్ బాండింగ్‌కు ఇదుగో ఎగ్జాంపుల్... ఫ్యాన్స్‌ ఇప్పటికైనా వార్ ఆపుతారా?

'కర' సినిమాలో ధనుష్ సరసన 'ప్రేమలు' ఫేమ్ మమితా బైజు నటించారు. వీళ్ళు ఇద్దరూ మిడిల్ క్లాస్ జంటగా... భార్యాభర్తలుగా కనిపించబోతోన్నారని తెలుస్తోంది. ఈ చిత్రానికి జీవీ ప్రకాష్ సంగీతాన్ని అందించారు. ఇంకా కథ: విఘ్నేశ్ రాజా - ఆల్‌ఫ్రెడ్ ప్రకాష్, ఛాయాగ్రహణం: థేనీ ఈశ్వర్, కూర్పు: శ్రీజిత్ సారంగ్.

Also Read: విఘ్నేష్ శివన్ సినిమాతో హిట్ రాలేదు... ఇప్పుడు మరో సీనియర్‌కు ప్రదీప్ రంగనాథన్‌ ఛాన్స్ ఇస్తాడా?