Kalyana Lakshmi Scheme In AP Online Apply: డ్వాక్రా మహిళల కుమార్తెల పెళ్లికి రూ.1 లక్ష లోన్! కల్యాణ లక్ష్మి స్కీమ్ దరఖాస్తు విధానం ఇదే!
3 weeks ago 5
ARTICLE AD
Who Is Eligible For Kalyana Lakshmi: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కొత్త పథకానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. డ్వాక్రా సంఘాల్లోని మహిళల కుమార్తెల వివాహానికి ఆర్థిక సాయం అందించేందుకు 'కల్యాణలక్ష్మి' పథకాన్ని అమల్లోకి తీసుకురానుంది. మే 23న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ స్కీమ్ స్టార్ట్ చేయనున్నారు. కల్యాణలక్ష్మి పథకాన్ని సెర్ప్, స్త్రీనిధి సంస్థలు సంయుక్తంగా అమలు చేయనున్నాయి. ఆడపిల్లల పెళ్లికి కల్యాణలక్ష్మి స్కీమ్ కింద రూ.లక్ష వరకు పావలా వడ్డీకి లోన్ మంజూరు చేస్తారు.
2026-27 నుంచి కల్యాణలక్ష్మి పథకం అమలుకు రూ.250 కోట్లు మంజూరు చేయాలని ప్రతిపాదనలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఏడాదికి కనీసం 25 వేల మంది డ్వాక్రా మహిళల కుమార్తెలకు ఈ పథకం కింద లబ్ది చేకూరనుంది. "అమ్మాయి పెళ్లి ఆర్థిక భారం కాదు.. ఆమె గౌరవం" అనే నినాదంతో ఈ స్కీమ్ ను ఏపీ ప్రభుత్వం అమలు చేయనుంది.
Also Read: ఆడపిల్లల కోసం కేంద్ర ప్రభుత్వ టాప్ 4 స్కీమ్స్ ఇవే! వీటిలో చేరితే భవిష్యత్ బంగారమే!
కల్యాణలక్ష్మి ముఖ్య వివరాలు
1. డ్వాక్రా సభ్యురాలి కుమార్తె వివాహానికి లోన్
2. రూ.10 వేల నుంచి రూ.లక్ష వరకు లోన్ మంజూరు
3. 4% వడ్డీకి లోన్
5. తీసుకున్న మొత్తానికి అనుగుణంగా ఈఎంఐలు, గరిష్టంగా 48 వాయిదాలు
అర్హులు
డ్వాక్రా సంఘంలో ఆరు నెలలు లేదా అంతకంటే ఎక్కువకాలంగా ఉన్న సభ్యురాలు.
బ్యాంకు, స్త్రీనిధి, ఉన్నతి, ఇతర లోన్లను సక్రమంగా చెల్లించాలి.
ఎలా దరఖాస్తు చేసుకోవాలి?
కావాల్సిన డాక్యుమెంట్స్
లగ్న పత్రిక
పెళ్లి కార్డు
పెళ్లి ఖర్చు అంచనా పత్రం
Read Entire Article