Amitabh Bachchan Shares Kalki 2 Shooting Pics : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా స్టార్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కించిన విజువల్ వండర్ 'కల్కి 2898 AD'. 2024లో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది. వరల్డ్ వైడ్ దాదాపు రూ.1100 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. ఈ మూవీ సీక్వెల్ కోసం వెయిట్ చేస్తున్న ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్. రీసెంట్‌గానే కల్కి 2 షూటింగ్ ప్రారంభం కాగా... ఫోటోలను బాలీవుడ్ లెజెండ్ అమితాబ్ షేర్ చేసుకున్నారు.

40 ఏళ్ల తర్వాత...

ఈ ఫోటోలను అమితాబ్ తన బ్లాగ్‌లో షేర్ చేశారు. 40 ఏళ్ల తర్వాత మళ్లీ కమల్‌తో కలిసి వర్క్ చేస్తున్నట్లు రాసుకొచ్చారు బిగ్ బీ. 'దాదాపు 40 ఏళ్ల తర్వాత కమల్ హాసన్‌తో కలిసి వర్క్ చేయడం గొప్ప అనుభూతి. లాస్ట్‌గా మేమిద్దరం 1985లో 'గిరఫ్తార్'లో కలిసి నటించాం.' అంటూ పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

'కల్కి 2898 AD'లో అమితాబ్ అశ్వత్థామగా నటించారు. సుప్రీం యాస్కిన్ పాత్రలో కమల్ హాసన్ కనిపించారు. 'ఆలస్యమైందా ఆచార్య దేవా...' అంటూ కర్ణుడి పాత్రలో ప్రభాస్‌ను క్లైమాక్స్‌లో చూపించి మూవీపై హైప్ భారీగా పెంచేశారు. కర్ణుడిగా ప్రభాస్‌ను చూసేందుకు యావత్ సినీ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది.

ప్రభాస్ జాయిన్ అయ్యేది ఎప్పుడు?

కొన్ని రోజుల క్రితమే కల్కి షూటింగ్ అఫీషియల్‌గా ప్రారంభం కాగా... అమితాబ్, కమల్ హాసన్‌లపై కీలక సీన్స్ షూట్ చేస్తున్నారు. మరి ప్రభాస్ ఎప్పుడు జాయిన్ అవుతారు? అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ప్రభాస్ పలు బిగ్ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. 'ఫౌజీ' మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఆగస్టులో మూవీ రిలీజ్ కానుండగా ఇంకా కొద్ది భాగమే షూటింగ్ పెండింగ్ ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో పాటే సందీప్ వంగా 'స్పిరిట్' మూవీ షూటింగ్ కూడా సాగుతోంది. ఈ క్రమంలో 'కల్కి 2' షూటింగ్ సెట్‌లో డార్లింగ్ ఎప్పుడు జాయిన్ అవుతారో తెలియాల్సి ఉంది.

Also Read : నాని, 'ఓజీ' డైరెక్టర్ సుజీత్ కొత్త మూవీ టైటిల్ ఇదే - అతను నెంబర్ వన్ చెఫ్ కాదు... కానీ...