Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode | బుల్లితెర ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్న "కలవారి కోడలు కనకమహాలక్ష్మీ" సీరియల్ రోజు రోజుకూ ట్విస్ట్‌లు టర్న్‌లతో ఆసక్తికరంగా మారుతోంది. ఈ రోజు(సెప్టెంబరు 12న) ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరగనుందో ఎలాంటి ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకోనున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

మహా ప్రజంటేషన్‌..

ఇన్వెస్టర్లు వెళ్లిపోతాం అని చెప్పడంతో మహా తాను ప్రజంటేషన్ ఇస్తానని చెప్తుంది. మహాకి ఏం తెలీదులే తన ప్రజంటేషన్ విని ఇన్వెస్టర్లు వెళ్లిపోతారు అని అంబిక అనుకుంటుంది. ఇక విహారి వచ్చే లోపు మహా ప్రజంటేషన్ మొదలు పెట్టేస్తుంది. మహా ప్రజంటేషన్ విని అంబిక షాక్ అయిపోతుంది. ఇక ప్రజంటేషన్ అవుతూ ఉంటే విహారి ఎంట్రీ ఇస్తాడు. మహా ప్రజంటేషన్ చూసి ఇంప్రెస్ అయి నిల్చొంటాడు. చారుకేశవ విహారితో మహా ప్రజంటేషన్ చూస్తుంటే నీకు ఎవరైనా గుర్తొస్తున్నారా అని అడుగుతాడు. నాకు ఎవరూ గుర్తు రావడం లేదు నీకు ఎవరు గుర్తుస్తున్నారు అని విహారి అంటే.. తన ప్రజంటేషన్, తన మాట తీరు అంతా చూస్తుంటే లక్ష్మీ గుర్తొస్తుందని చారుకేశవ అంటాడు. దానిక విహారి ద్రోహం చేసి వెళ్లిపోయిన వాళ్లని గుర్తు చేసుకోవద్దు.. నాకు గుర్తు చేయొద్దు అని విహారి అంటాడు. ఇక ఇన్వెస్టర్లు మహా ప్రజంటేషన్‌కి ఇంప్రెస్ అయి డీల్స్ ఓకే చెప్తారు. విహారి మహా దగ్గరకు వెళ్లి చాలా బాగుందని చెప్తాడు.

సంధ్యని కలిసిన మహా..

మహా మనసులో విహారి గారు నా గురించి ఆలా అనుకోవడం తప్పులేదు.. ఆయన్ను ఆయన బంధాన్ని వదిలేసి వెళ్లిపోయాను. ఆయన కోపంలో అర్థం ఉంది అని మహా అనుకుంటుంది. సంధ్య లక్ష్మీకి కాల్ చేసి మీ ఆఫీస్ సైడ్ వస్తున్నా కలవాలి అని అంటుంది. మహా వెళ్లి సంధ్యని కలుస్తుంది. సంధ్య మహాతో నువ్వు చనిపోయినట్లు ఎవరో ఫేక్ డెట్ సర్టిఫికేట్ క్రియేట్ చేశారు. నింద కూడా విహారి గారి మీద వేశారు. ఎవరో కావాలనే విహారి గారి మీద ఆయన కుటుంబం మీద పగ పట్టారు నువ్వు జాగ్రత్తగా ఉండు అని సంధ్య అంటుంది.

త్యాగం వృథా..

విహారి గారి ఇంట్లో పరిస్థితి కూడా మారలేదు.. నేను బయటకు వచ్చేసి ఏడేళ్లు అయింది ఎవరూ మారలేదు.. ఇంట్లో ఎవరూ మారలేదు.. అన్ని మారాయి అనే కంటే ఇంకా ఎక్కువ అయ్యావి.. ఆ ఇంట్లో మారిన వారు ఎవరైనా ఉన్నారు అంటే అది విహారి గారే.. ఆయన ఇప్పుడు మంచితనం వదిలేసి మొండిగా మారిపోయారు. అన్నీ డబ్బుతో లెక్కిస్తున్నారు. నా వల్లే ఆయన ఆయన మనసుని గాయం చేసుకొని మారిపోయారు.. ఇప్పుడు నేను నా వాళ్లని మార్చుకుంటాను అని మహా అంటుంది. ఇంతలో సంధ్యకి విహారి కాల్ చేసి క్రిష్ వాళ్ల అమ్మ గురించి ఏమైనా తెలిసిందా.. క్రిష్ చాలా బాధ పడుతున్నాడు అని చెప్తాడు. నా కొడుకుకి తల్లిని నేనే అని చెప్పకుండా ఓదార్చుతా.. వాళ్ల నాన్నకి వాడిని దగ్గర చేస్తా అని లక్ష్మీ చెప్తుంది.

అక్క డబ్బు ఎవరికి ఇచ్చింది..

సుభాష్ అంబికకు కాల్ చేసి ఆస్తి మొత్తం సిరికి రాసేశారు కదా మరి నీ ప్లాన్ ఏంటి అని అడిగితే దానికి అంబిక ఆస్తి దక్కించుకోవడం నా నుంచి తీసుకున్న ఆధిపత్యం దక్కించుకోవడమే నా టార్గెట్.. ఆస్తి మొత్తం రాశారు కానీ డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ ఇంకా కాలేదు ఈ లోపు ఆస్తి నేను దక్కించుకుంటా అని అంబిక అంటుంది. అంబిక ఫోన్ మాట్లాడుతున్నప్పుడే పద్మాక్షి కంగారుగా 5 లక్షలు తీసుకొని నర్సుకి ఇవ్వడానికి వెళ్తుంది. అంబిక అది చూస్తుంది. పద్మాక్షిని ఫాలో అయి పద్మాక్షి నర్సుకి డబ్బు ఇవ్వడం చూస్తుంది. ఎవరికో అక్క డబ్బు ఇస్తుందేంటి అని అంబిక అనుకుంటుంది. పద్మాక్షి లోపలికి వెళ్లగానే అంబిక నర్సు కోసం వెతుకుతుంది. నర్సుని ఫాలో అవుతుండగా నర్సు ఆటోలో వెళ్లిపోతుంది.

ఆ అమ్మాయి ఎవరు..

అక్కకి ఏదో సీక్రెట్ ఉంది అదేంటో నేను తెలుసుకోవాలి అని పద్మాక్షి దగ్గరకు వెళ్లి ఆ అమ్మాయి ఎవరు.. తనకు ఎందుకు డబ్బు ఇచ్చావ్ అని అడిగితే పద్మాక్షి మేనేజర్ కూతురని కవర్ చేస్తుంది. అక్క ఏదో దాస్తుంది అదేంటో కనిపెట్టాలి అని అంబిక అనుకుంటుంది. ఇక సహస్ర విహారి కోసం బాక్స్ తీసుకొని ఆఫీస్‌కి వస్తుంది. సహస్ర విహారి క్యాబిన్‌లో ఫుడ్ సర్దుతూ ఉంటే విహారి వస్తాడు. నువ్వేంటి ఎప్పుడూ లేనిది ఇలా అని విహారి అడిగితే అత్తయ్య నీ కోసం కంగారు పడుతున్నారు అందుకే నేనే వండి తీసుకొచ్చా అంటుంది. విహారి తినడానికి రెడీ అవుతాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.

<a title="ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన సీన్స్‌తో పాటు తదుపరి ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అనుకుంటే ఏబీపీ దేశం పేజీని ఫాలో అవ్వండి. " href="https://telugu.abplive.com" target="_self">ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన సీన్స్‌తో పాటు తదుపరి ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అనుకుంటే ఏబీపీ దేశం పేజీని ఫాలో అవ్వండి.