Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode బుల్లితెర ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్న "కలవారి కోడలు కనకమహాలక్ష్మీ" సీరియల్ రోజు రోజుకూ ట్విస్ట్‌లు టర్న్‌లతో ఆసక్తికరంగా మారుతోంది. ఈ రోజు(అక్టోబరు 8న) ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరగనుందో ఎలాంటి ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకోనున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

లక్ష్మీ కోసం ఇప్పుడు ఎందుకు..

యమున లక్ష్మీ గురించి బాధ పడుతూ లక్ష్మీని దూరం చేసుకోవడం వల్లే ఇదంతా అని ఏడుస్తుంది. లక్ష్మమ్మ లేకపోవడమే ఇలా అవుతుంది అంటే మనం లక్ష్మమ్మ కోసం వెతుకుదాం అని పండు అంటాడు. పద్మాక్షి, సహస్రలు ఆ మాట వింటారు. పద్మాక్షి కోపంగా పండు అని అరుస్తుంది. పండు దగ్గరకు వెళ్లి గట్టిగా కొడుతుంది. ఏంట్రా నువ్వు ఈ ఇంట్లో ఎవరి పేరు వినిపించకూడదు ఆ పేరు ఎత్తుతావా.. వెతుకుతా అంటావా ఇక్కడికి తీసుకొస్తా అంటావా అని తిడుతుంది. వీడే ఇలా అన్నాడు అంటే ఈ మాట వాడిది కాదు యమున మాట అని పద్మాక్షి యమునని తిడుతుంది. ఇంకోసారి లక్ష్మీ పేరు రాకూడదు అని ఇద్దరూ యమునకి వార్నింగ్ ఇస్తారు.

లక్ష్మీ ఎవరు నానీ..

యమున, పండులని సిరి ఓదార్చి లక్ష్మీ ఎవరు అని అడుగుతుంది. తన గురించి వదిలేయ్ అమ్మా అని యమున అంటుంది. లక్ష్మీ గురించి యమున చెప్పే టైంకి సహస్ర సిరిని పిలిచేస్తుంది.

క్రిష్‌తో ఎక్కడికి వెళ్లావ్..

మహా ఆఫీస్‌కి వెళ్తే విహారి మహాని పిలిచి ఎక్కడికి వెళ్లావ్ అని అడుగుతాడు. గుడికి వెళ్లా అని మహా అబద్ధం చెప్తుంది. దానికి విహారి నువ్వు వెళ్లడం నేను చూశా అటు వైపు ఏ గుడి లేదు.. నేను చూశా నిజం చెప్పు అని అడుగుతాడు. దాంతో మహా పోలీస్ స్టేషన్‌కి వెళ్లా అని చెప్తుంది. విహారి, చారుకేశవ షాక్ అవుతారు. అంబిక చాటుగా మొత్తం వింటుంది. క్రిష్‌ని కూడా పోలీస్‌ స్టేషన్‌కి తీసుకెళ్లా అని మహా చెప్పి స్కెచ్ కూడా చూపించి ఈ రౌడీనే అటాక్ చేసిన విషయం చెప్తుంది. అంబిక షాక్ అయిపోతుంది. నాకు చెప్పకుండా నువ్వు ఎందుకు ఈ పనులు చేస్తున్నావ్ అని విహారి అడుగుతాడు. నాకు సాయం చేయాలి అనుకుంటున్నావ్ కానీ దీని వల్ల నీకే ప్రాబ్లమ్ అని విహారి కోప్పడతాడు.

అంబిక టెన్షన్..

అంబిక మహా మాటలు తలచుకొని మహా నా కొంప ముంచేసింది.. ఆ క్రిష్ ఎవరి డ్రాయింగ్ వేయించాడో. అందులో ఎవరు ఉన్నారో తెలుసుకుంటే జాగ్రత్త పడొచ్చు అని అంబిక ఫైల్స్ వెతకడం మొదలు పెడుతుంది. ఇంతలో చారుకేశవ వచ్చి ఏం వెతుకుతున్నావ్ అంబిక అని అడుగుతాడు. అంబిక కవర్ చేయాలని చూస్తుంది. మరదలా నాకు తెలీకుండా ఏమైనా గూడుపుటానీ చేస్తున్నావా అని అడుగుతాడు. నేను ఎప్పుడూ అలాంటి పనులు చేయడం లేదు బావా అని అంబిక అంటుంది. ఇక చారుకేశవ వచ్చి ఆ ఫైల్ తీసుకెళ్లిపోతాడు.

మహా లాగే ఆ లక్ష్మీ కూడా..

అంబిక సుభాష్‌ని కలిసి మహా చేసిన పని చెప్పి ఈ మహా కూడా అప్పటి లక్ష్మీ లాగే అన్నింటినీ అడ్డుకుంటుంది. ఈ బుడ్డోడు ఎవరి స్కెచ్‌ వేయించాడో తెలీడం లేదు. అది నా బొమ్మ అయితే కాదు నీది అయిండొచ్చు ఏమో అని అంబిక అంటే నాది కాదు అంబిక నాది అయితే ఇంత వరకు ఊరుకోడు. అది కచ్చితంగా నా మనుషుల్లో ఒకరి బొమ్మ అని సుభాస్ అంటాడు. ఇక ఇద్దరూ జాగ్రత్తగా ఉండాలి అనుకుంటారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.

ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన సీన్స్‌తో పాటు తదుపరి ఎపిసోడ్‌లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అనుకుంటే ఏబీపీ దేశం పేజీని ఫాలో అవ్వండి.