kalavari kodalu kanaka Mahalakshmi serial today episode లక్ష్మీ 7 నెలల ప్రెగ్నెంట్ అని తెలుసుకున్న పద్మాక్షి 7 నెల డెలివరీ చేయొచ్చా లేదా అని అడుగుతుంది. చేయొచ్చు కానీ చాలా కాంప్లికేషన్స్ అవుతాయి.. అని చెప్తుంది. డాక్టర్‌ని లక్ష్మీ దగ్గరకు తీసుకెళ్లి చూపిస్తుంది. సరోగసీ చేసిన అమ్మాయి కదా అని డాక్టర్ గుర్తు పడుతుంది. ఇంతలో లక్ష్మీ కళ్లు తెరుస్తుంది. లక్ష్మీని చూసిన డాక్టర్ అదృష్టవంతురాలివమ్మా.. నువ్వు నీ బిడ్డ ప్రమాదం నుంచి బయట పడ్డారు అని అంటారు. లక్ష్మీని జాగ్రత్తగా చూసుకోమని నర్సుకి చెప్పి వెళ్తుంది.

Also Read: నిండు మనసులు: సిద్ధూ, ప్రేరణకి బట్టలు పెట్టిన విజయానంద్! కన్నింగ్ మామ గణ, రాజశేఖరం మధ్య పుల్లలు పెట్టేశాడా!

లక్ష్మీ ఉన్న గదిలోని టీవీలో విహారి ఆఫీస్‌లో జరిగిన గొడవ న్యూస్ వస్తుంది. అది చూసిన లక్ష్మీ కంగారు పడి లేచి చూస్తుంది. బెడ్ రెస్ట్‌లో ఉండాల్సిన లక్ష్మీ లేచి బయటకు వచ్చేస్తుంది. నడవ లేని స్థితిలో హాస్పిటల్‌లో ఎవరో బుర్కా పెట్టుంటే అది లక్ష్మీ తీసుకొని వేసుకొని విహారి కోసం ఆఫీస్‌ దగ్గరకు బయల్దేరుతుంది. విహారి లక్ష్మీ గురించి అందరూ అన్న మాటలు గుర్తు చేసుకొని కోపంతో రగిలిపోతాడు. విహారి దగ్గరకు చారుకేశవ వచ్చి ఇంతకు ముందు ఎలా ఉండే వాడివి ఇప్పుడు ఎలా అయిపోయావ్ అని అంటాడు. విహారి మాత్రం ఏం పట్టించుకోకుండా మందు తాగుతూనే ఉంటాడు. కనకం గురించి అర్హత లేని వాళ్లు కూడా ఎలా మాట్లాడుతారు మామయ్య, ఇక్కడ అసలు కనకం టాపిక్ ఎందుకు వచ్చింది.. అని అడుగుతాడు. విహారి దగ్గరకు అంబిక వచ్చి విహారి ఏంట్రా ఇలా చేస్తున్నావ్.. నీ వల్ల మన పరువు పోయింది తెలుసా.. నువ్వు కొట్టిన బోర్డు ఆఫ్ డైరెక్టర్‌ కోపంగా ఉన్నాడు. నాకు ఉన్న పాత పరిచయాలతో అతని కాలు పట్టుకున్నాను.. నువ్వు వచ్చి అతనికి సారీ చెప్పు లేదంటే నిన్ను ఛైర్మన్ పదవి నుంచి తొలగించేయాలని భీష్మించుకున్నాడు.. రా వచ్చి సారీ చెప్పేయ్ విహారి అని అంబిక అంటుంది. చారుకేశవ కూడా విహారికి సారీ చెప్పేయ్‌రా అని అంటాడు.

Also Read: మనోజ్ నుంచి 25 లక్షలు తీసుకుని దొంగ జంట పరార్! ఊహల్లో తేలుతున్న ప్రభావతి - గుండెనిండా గుడిగంటలు మే1 ఎపిసోడ్

విహారి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ దగ్గరకు వస్తాడు. లక్ష్మీ కూడా అప్పుడే వచ్చి దూరం నుంచి చూస్తుంది. అతనికి సారీ చెప్పమని అందరూ అంటారు. అతను విహారితో మీరు చేసిన పనికి మీ మీద క్రిమినల్ కేసు పెట్టి మిమల్ని ఛైర్మన్ పదవి నుంచి తొలగించేలా చేయొచ్చు అని అంటాడు. ఏంటి ఇప్పుడు సారీ చెప్పాలి అంతే కదా అని విహారి అడిగితే మరో డైరెక్టర్ అంతే మీరు సారీ చెప్పాలి లేదంటే ఛైర్మన్ పదవి నుంచి దిగిపోవాలి అని అంటాడు. విహారి మందు తాగుతూ మేనేజర్ని పిలిచి నేను ఛైర్మన్‌గా రాజీనామా చేస్తున్నా వెంటనే రాజీనామా పత్రం ప్రింట్ చేసుకొని తీసుకురా అంటాడు. దూరం నుంచి లక్ష్మీ చూసి ఇలా జరగకూడదు అని అనుకుంటుంది. పేపర్లు తీసుకురాగానే విహారి సంతకం పెట్టేస్తాడు. లక్ష్మీ అడ్డుకోవాలని చూస్తే భుజంగం మనుషులు లక్ష్మీని కిడ్నాప్ చేస్తారు. విహారి పొగరుగా మందు తాగి డైరెక్టర్ భుజం తట్టి వెళ్లిపోతాడు.

Also Read: చిన్ని సీరియల్: కావేరి కేసు రీ ఓపెన్ చేయిస్తున్న మ్యాడీ! చెమటలు పట్టేసిన దేవా! సీసాలో ఆత్మ!

లక్ష్మీ తనని వదిలమని బతిమాలుతుంది. కారు ట్రాఫిక్‌లో ఆగుతుంది. అప్పుడే లక్ష్మీ విహారిని చూస్తుంది. విహారిని పిలిచే టైంకి రౌడీ, శోభ లక్ష్మీకి మత్తు మందు వేసి ముసుగు వేసేస్తారు. తర్వాత భుజంగం రౌడీకి కాల్ చేసి లక్ష్మీని తన ప్లేస్‌కి తీసుకెళ్లమని తర్వాత ఏం చేయాలో నేను చెప్తా అని అంటాడు. అంబిక ఇంటికి వచ్చి విహారి నుంచి కుట్ర చేసి సీఈఓ పదవి తీసుకున్నట్లు ఎవరికీ తెలీకూడదు అనుకుంటుంది. ఇంట్లో అందరినీ పిలిచి జరిగింది చెప్తుంది. అందరూ షాక్ అయిపోతారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.