kalavari kodalu kanaka mahalakshmi serial today march 23rd: కలవారి కోడలు కనక మహాలక్ష్మీ: యమున కండీషన్ సీరియస్! భుజంగాన్ని చూసేసిన లక్ష్మీ!

3 weeks ago 4
ARTICLE AD
<p>kalavari kodalu kanaka mahalakshmi serial today episode భుజంగం స్వామిజీ వేషంలో వచ్చి భోజనం పెట్టమని అడుగుతాడు. యమును భోజనం పెడుతుంది. మొదటి ముద్ద తినమని అంటే యమున తినేస్తుంది. తర్వాత విహారి, లక్ష్మీ అక్కడికి వస్తారు. భోజనం ఆకు దగ్గర పిల్లి రక్తం కక్కుకొని చనిపోయి ఉంటుంది. ఇద్దరూ చూసి కంగారు పడి అమ్మా అని లోపలికి వెళ్లి చూస్తారు. యమున ఎదురుగా వచ్చి మాట్లాడుతుంది. విహారి, లక్ష్మీ కంగారుగా స్వామీజీ ఏం చేశారని అడుగుతారు.</p> <p>యమున గొంతు పట్టుకొని ఇబ్బంది పడుతూ స్వామీజీ మొదటి ముద్దు అన్న ప్రసాదం అని నాకు ఇచ్చారని చెప్తుంది. విహారి, లక్ష్మీ ఇద్దరూ యమునని హాస్పిటల్&zwnj;కి తీసుకెళ్తారు. యమునకు ట్రీట్మెంట్ ఇస్తారు. లక్ష్మీ, విహారి చాలా కంగారు పడతారు. అన్నంత పని చేశాడు కనకం అమ్మకి ఏమవుతుందా అని భయంగా ఉందని విహారి ఏడుస్తాడు. డాక్టర్ నర్స్&zwnj;తో &nbsp;బాడీలో ఉన్న విషం తీసేశాం కానీ ఇంకా విషం ఉందని కొన్ని గంటలు జాగ్రత్తగా చూసుకోమని డాక్టర్ అంటుంది. విహారి, లక్ష్మీలతో కండీషన్ సీరియస్&zwnj;గా ఉందని చెప్తారు. విహారి చాలా ఏడుస్తాడు. విహారి మెడిసిన్ కోసం వెళ్లగానే భుజంగం హాస్పిటల్&zwnj;కి వస్తాడు. లక్ష్మీని యమున గది దగ్గర చూసి యమున అంత స్ట్రాంగ్ విషం తిన్నా నువ్వు చావలేదా.. నువ్వు చేస్తేనే నీ కొడుకు భయపడతాడు. నా చేతులతోనే నిన్ను చంపేయాలి అని అనుకుంటాడు. డాక్టర్ గెటప్&zwnj;లో వచ్చి యమున గది దగ్గర నిల్చొంటాడు. లక్ష్మీ భుజంగంతో డాక్టర్ మా యమునమ్మని కాపాడండి అని అంటుంది. భుజంగం విహారిని చూసి ఎలా అయినా మీ అమ్మని చంపేస్తా నిన్ను ఏడిపిస్తా అని అనుకుంటాడు.&nbsp;</p> <p>భుజంగం యమున దగ్గరకు వెళ్లి చాకు తీసి యమునని పొడిచేయడానికి ప్రయత్నిస్తాడు. ఇంతలో లక్ష్మీ వచ్చి భుజంగాన్ని అడ్డుకుంటుంది. భుజంగం కాలర్ పట్టుకొని ఎవర్నా నువ్వు మా యమునమ్మని చంపాలని చూస్తున్నావ్.. నువ్వే కదా మా విహారి గారిని బ్లాక్ మెయిల్ చేసి యమునమ్మని చంపాలని చూస్తుంది. నిన్ను వదలనురా అని అంటుంది. భుజంగం లక్ష్మీని తోసేసి యమున ఆక్సీజన్ పైప్ తీసేయాలని చూస్తే లక్ష్మీ భుజంగం తల మీద కొట్టేస్తుంది. భుజంగం లక్ష్మీని నెట్టేస్తాడు. తర్వాత లక్ష్మీ భుజంగం ముసుగు తీసి అతన్ని చూస్తుంది. భుజంగం లక్ష్మీని నెట్టేసి పారిపోతుంటే లక్ష్మీ విహారికి కూడా చెప్తుంది. ఇద్దరూ భుజంగం వెనక పరుగు పెడతారు. మొత్తానికి భుజంగం పారిపోతాడు. లక్ష్మీ విహారితో అతన్ని చూశానని చెప్తుంది. జరిగిన కథ తెలిస్తే అసలు వాడి గురించి పూర్తి తెలుస్తుందని అనుకుంటారు.&nbsp;</p> <p>భుజంగం తప్పించుకొని విహారికి కాల్ చేస్తాడు. విహారి కాల్ లిఫ్ట్ చేసి ఈ రోజు అదృష్టం బాగుంది మా నుంచి తప్పించుకున్నావురా అని విహారి అంటే మీ అమ్మ అదృష్టం బాగుందిరా., మీ అమ్మ చావు నుంచి తప్పించుకుందని బాగా సంబరపడిపోతున్నావ్ అని భుజంగం అంటే మా ఆవిడ ఈ రోజు నిన్ను చూసిందిరా అని విహారి అంటే.. ముఖం చూశావ్ కానీ నా గురించి నీకు ఇంకేం తెలీదు కదా నువ్వు నీ భార్య నన్నేం చేయలేరురా.. అని అంటాడు. వాడు ఎక్కడున్నా వెతికి వెతికి పట్టుకుంటా అని విహారి అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.</p>
Read Entire Article