Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode కావేరి ఏడుస్తుంటే లక్ష్మీ వెళ్లి ఏమైందని అడుగుతుంది. లక్ష్మీ వీడియో అని కావేరి ఏడుస్తూ లక్ష్మీకి వీడియో చూపిస్తుంది. అది చూసి లక్ష్మీ కూడా షాక్ అయిపోతుంది. ఇక అంబిక వాయిస్ యాప్ యూజ్‌ చేసి కావేరికి కాల్ చేస్తుంది.

అంబిక మాట్లాడుతుంటే లక్ష్మీ మాట్లాడుతుంది. అంబిక మాటలు లక్ష్మీ వాళ్లకి వాయిస్ యాప్ వల్ల అబ్బాయి మాట్లాడినట్లు వినిపిస్తాయి. అంబిక లక్ష్మీతో వీడియో చూశారా.. ఆ వీడియోని సోషల్ మీడియాలో ట్రెండ్ చేయాలి అనుకుంటున్నా అని అంటుంది. వద్దు అని లక్ష్మీ అంటుంది. నువ్వు ఎవరు అని లక్ష్మీ అంటే నేను నీ శత్రువుని లక్ష్మీ నిన్ను పట్టాలి అంటే ఆ పిల్ల ఎర అని అంటుంది. నీకేం కావాలి అని లక్ష్మీ అడిగితే నావి రెండే రెండు డిమాండ్స్ మొదటిది నువ్వు ఎండీ పోస్ట్‌కి రిజైన్ చేయాలి రెండు నువ్వు ఆ ఇంటి నుంచి దూరంగా అజ్ఞాతంలోకి వెళ్లిపోవాలి అని కండీషన్ పెడుతుంది.

లక్ష్మీ అంబికతో నువ్వు చెప్పినట్లు చేస్తా అయితే నేను వెళ్లిపోయిన తర్వాత నువ్వు కావేరిని ఆ వీడియోతో ఇబ్బంది పెడితే అని లక్ష్మీ అడుగుతుంది. దానికి అంబిక నువ్వు వెళ్లిపోయిన తర్వాత రేపు ఇదే టైంకి నీకు ఒరిజినల్ వీడియో ఇస్తా.. నువ్వు ఎక్కడికి వెళ్లినా నాకు తెలుస్తుందని అంబిక అంటుంది.

హాస్పిటల్‌లో సహస్రకు డాక్టర్ టెస్ట్‌లు చేస్తుంది. రిపోర్ట్స్‌లో నిజం తెలిస్తే బావ అరుస్తాడని సహస్ర కంగారు పడుతుంది. విహారి మనసులో రిపోర్ట్స్ వస్తాయి.. నేను ఏ తప్పు చేయలేదు అని తెలుస్తుంది. కలలో కూడా నేను కనకానికి ద్రోహం చేయను అని తెలుతుంది అని అనుకుంటాడు. డాక్టర్ రిపోర్ట్స్‌ తీసుకొని వస్తుంది. సహస్ర చాలా కంగారు పడుతుంది. డాక్టర్ ఏ బాంబ్ పేల్చుతుందో అని అనుకుంటుంది. అయితే డాక్టర్ వచ్చి విహారి, సహస్ర కంగ్రాట్స్.. సహస్ర రెండో నెల గర్భవతి.. తనని జాగ్రత్తగా చూసుకో అని విహారికి చెప్పి మందులు రాసి ఇస్తుంది.

విహారి షాక్ అయిపోతాడు. సహస్ర చాలా హ్యాపీగా ఫీలవుతుంది. ఇక లక్ష్మీ బ్యాగ్ సర్దుకుంటుంది. కావేరి వచ్చి లక్ష్మీ నువ్వు నా కోసం బయటకు వెళ్తున్నావా.. వద్దు లక్ష్మీ అని కావేరి ఏడుస్తుంది. నీ క్షేమమే నాకు ముఖ్యం కావేరి మీ అమ్మగారికి విహారి గారు మాటిచ్చారు.. నీకు ఏ సమస్య రాకుండా ఉండాలి అంటే నేను వెళ్లాలి అని అంటుంది. దానికి కావేరి వద్దు లక్ష్మీ మనం వాళ్లని ఎలా అయినా ఎదుర్కొందాం వెళ్లొద్దు అని అంటుంది. విహారి అన్నకి చెప్దామని కావేరి అంటే దానికి లక్ష్మీ వద్దు అని తాను ఇంటి నుంచి వెళ్లిపోతున్నట్లు ఇంట్లో ఎవరికీ చెప్పను అని మాట తీసుకుంటుంది. నీ కళ్లలో మా అమ్మని చూసుకుంటున్నా నువ్వు వెళ్లిపోతే ఎలా లక్ష్మీ అని కావేరి ఏడుస్తుంది. ఏదో ఒక రోజు మనం కలుస్తాం అని చెప్పి లక్ష్మీ ఇంటి నుంచి వెళ్లిపోవడానికి సిద్ధ పడుతుంది.

కావేరి ఏడుస్తుంది. ఇంట్లో ఎవరూ లేని టైం చూసి లక్ష్మీ ఇంటి నుంచి బయటకు వెళ్లిపోతుంది. లక్ష్మీ వెళ్తున్న దారిలోనే విహారి, సహస్ర వచ్చినా విహారి లక్ష్మీని చూడడు. ఇక సహస్ర ఇంటికి రాగానే పద్మాక్షి సహస్రని గదిలోకి తీసుకెళ్తుంది. సహస్ర తల్లితో నేను ప్రెగ్నెంట్ అమ్మా అని సందడి చేస్తుంది. దాంతో పద్మాక్షి సహస్రని లాగిపెట్టి కొడుతుంది. ఇంకోసారి విహారి పిలవగానే వెళ్లావంటే చంపేస్తా అంటుంది. డాక్టర్‌తో మాట్లాడి పది లక్షలు ఇచ్చా కాబట్టి నువ్వు ప్రెగ్నెంట్ అని చెప్పిందని అంటుంది. ఇంకోసారి నువ్వు ఇంటి నుంచి బయటకు వెళ్లేటప్పుడు నాకు చెప్పకపోతే చంపేస్తా అంటుంది. విహారికి నీ మీద అనుమానం వచ్చింది.. జాగ్రత్తగా ఉండు.. ఇంకో మాట లక్ష్మీ మీద మనకు ఎంత కోపం ఉన్నా దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి.. నీ బిడ్డ దాని కడుపులో ఉంది కాబట్టి జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్తుంది.

చారుకేశవ లక్ష్మీ దగ్గరకు హడావుడిగా వచ్చి లక్ష్మీ ఎండీ పోస్ట్‌కి రాజీనామా చేసినట్లు ఉందని ఓ లెటర్ ఇస్తాడు. లక్ష్మీ రాజీనామా చేయడం ఏంటి అని అందరూ షాక్ అయిపోతారు. ఇంటి నుంచి వెళ్లిపోతున్నా దయచేసి నా కోసం వెతకవద్దు.. ఎప్పటికీ మీ ఇంటికి తిరిగిరాను అని రాసుంటుంది. ఉన్నట్టుండి లక్ష్మీ వెళ్లిపోవడం ఏంటి అని అందరూ కంగారు పడతారు. పద్మాక్షి, సహస్రలకు విషయం తెలిసి బిత్తరపోతారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.