kalavari kodalu kanaka Mahalakshmi serial today episode లక్ష్మీని రౌడీలు తరుముతూ ఉంటారు. పండు, విహారి అటుగా వస్తూ ఉంటారు. లక్ష్మీ ఓ చోటుకి వెళ్తే రౌడీలు లక్ష్మీని పట్టుకోవాలని చూస్తాడు. ఇంతలో టిఫెన్ పెట్టిన బామ్మ వచ్చి దోసె పెనంతో రౌడీలు ఇద్దరినీ చితక్కొడుతుంది. లక్ష్మీ దగ్గరకు వెళ్లి సమయానికి వచ్చాను కదా సరిపోయింది. చేతిలో డబ్బు లేదు అన్నావ్ మరి బ్యాగు తీసుకొని ఎక్కడికి బయల్దేరుతున్నావ్ అని అడుగుతుంది. గమ్యం లేని ప్రయాణం నాది అని లక్ష్మీ అంటే చూస్తే ఏదో కష్టంలో ఉన్నావని అర్థమైంది నాతో వచ్చేయ్ నేను ఒంటరినే అని బామ్మ లక్ష్మీని తన ఇంటికి తీసుకెళ్తుంది.

నేను మీకు భారం అయిపోతా బామ్మ అని లక్ష్మీ అంటే నన్ను బామ్మ అని పిలిచావ్..నా మనవరాలు నాకు ఎప్పటికీ భారం కాదమ్మా అని చనిపోయిన తన మనవరాలు లక్ష్మీ ఫొటో లక్ష్మీకి చూపిస్తుంది. నా మనవరాలు చనిపోయిన నాటి నుంచి ఒంటరిని అయిపోయా.. నిన్ను చూస్తే నా మనవరాలిని చూసినట్లే ఉంది.. నీలో నేను నా మనవరాలని చూసుకుంటా నువ్వు నాలో నీ అమ్మమ్మని చూసుకో.. ఈ ఒంటరి జీవితానికి ఓ ఆసరా దొరికింది అనుకున్నా.. నువ్వు నాతో ఉండమ్మా అని బామ్మ లక్ష్మీని ఒప్పిస్తుంది. లక్ష్మీకి బామ్మ నీ పేరు ఏంటి అని అడిగితే లక్ష్మీ అని చెప్పకుండా సిరి అని పేరు మార్చి చెప్తుంది. బామ్మ మురిసిపోతుంది. సిరి నువ్వు ఈ అమ్మమ్మ దగ్గరే ఉంటూ పండంటి బిడ్డకు జన్మనివ్వాలి అని అంటుంది.

జైలులో ఉన్న భుజంగానికి కానిస్టేబుల్ సీక్రెట్‌గా ఫోన్ ఇస్తాడు. భుజంగం తన మనిషికి ఫోన్ చేసి లక్ష్మీ ఇంటి నుంచి వెళ్లిపోయింది.. అది ఎక్కడుందో ఎవరితో ఉందో అన్నీ తెలుసుకోండి.. ఎంత ఖర్చు అయినా పర్లేదు ఆ లక్ష్మీ ఆచూకీ మాత్రం నాకు తెలియాలి అని చెప్తాడు. రాజు సరే అని అంటాడు. లక్ష్మీ కోసం యమున ఎదురు చూస్తూ ఉంటుంది. విహారి, పండు, చారుకేశవ వెతుకుతూ ఉంటారు. లక్ష్మీ సిరిగా బామ్మతో టిఫెన్ బండి దగ్గరకు వెళ్లి బామ్మకి సాయం చేస్తుంది. రోజులు గడుస్తున్నా లక్ష్మీ ఆచూకీ లేక యమున, వసుధ ఏడుస్తారు. విహారి వాళ్లు వెతుకుతూనే ఉంటారు. లక్ష్మీ ఇంటి నుంచి వెళ్లిపోవడానికి భుజంగమే కారణం అని విహారి అనుకుంటాడు. పద్మాక్షి సహస్ర దగ్గరకు వెళ్లి విహారి ఇంటికి రాక చాలా రోజులు అయింది.. నువ్వేం పట్టించుకోవా అని అడుగుతుంది. బావ ఎంత తిరిగినా లక్ష్మీ ఆచూకీ తెలీదు.. లక్ష్మీ గురించి బాధ పడతాడు.. నాలుగు రోజులు అయితే లక్ష్మీని మర్చిపోతాడు. అప్పటి వరకు నువ్వు బావ గురించి ఏమాత్రం ఆలోచించకు అని సహస్ర అంటుంది.

విహారి భుజంగం దగ్గరకు వెళ్లి భుజంగం కాలర్ పట్టుకుంటే కనక మహాలక్ష్మీ కనిపించడం లేదా అని భుజంగం అంటాడు. నా కనకం కనిపించడం లేదురా ఏం చేశావ్ అని విహారి అంటే భుజంగం పెద్దగా నవ్వుతాడు. నేను నీ పని చేయలేదు కానీ నువ్వు ఇలా తన కోసం బాధ పడుతుంటే చాలా సంతోషంగా ఉందని అంటాడు. నేను జైలులో ఉన్నాను లక్ష్మీని నేను ఏం చేయలేదు పోరా అని భుజంగం అంటాడు. లక్ష్మీని వాడి కంటే ముందు నేనే కనిపెట్టాలి అని భుజంగం అనుకుంటాడు. లక్ష్మీ ఏమైపోయింది.. విహారి ఎక్కడ తిరుగుతున్నాడు అని యమున చారుకేశవని అడుగుతుంది. ఇంతలో విహారి ఇంటికి వస్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.