kalavari kodalu kanaka Mahalakshmi serial today episode లక్ష్మీ, విహారి, సంధ్య కలిసి సీసీ కెమెరాల్లో భుజంగాన్ని చూస్తారు. భుజంగం పెట్రోల్ బంక్ ఉండే ఏరియాలో ఉండే అవకాశం ఉందని అనుకుంటారు. ఇక బాబాలా వచ్చిన భుజంగం ముఖానికి ఉన్న గడ్డం తీసి చూపించమని సంధ్య మరో టెక్నీషియన్కి చెప్తుంది. విహారి లక్ష్మీతో ఆ ఫొటో దొరకగానే నువ్వు నాకు మెసేజ్ చేయ్ నేను ఆ ఏరియాలో వెతుకుతూ ఉంటా అని చెప్పి వెళ్తాడు.

విహారి పెట్రోల్ బంక్ ఉన్న ఏరియాలో వెతుకుతూ ఉంటాడు. భుజంగం ముఖానికి గడ్డం తీసి ఎడిట్ చేయడంతో లక్ష్మీ హాస్పిటల్లో దాడి చేసిన భుజంగాన్ని గుర్తు పడుతుంది. వెంటనే సంధ్యతో ఇతనే ఆరోజు యమునమ్మని హాస్పిటల్లో చంపడానికి వచ్చాడని అతని ఫొటోని త్వరగా నాకు పంపండి అని అంటుంది. ఇక విహారి భుజంగం ఇంటి దగ్గర ఆగుతాడు. ఇంటికి తాళం వేయడం చూసి మొత్తం చూస్తూ ఉంటాడు. అప్పుడే భుజంగం అక్కడికి వస్తాడు. విహారి భుజంగం దగ్గరకు వెళ్లి ఈ ఇంట్లో భుజంగం అని ఎవరైనా ఉన్నారా అని అడుగుతాడు. ఆ పేరుతో నాకు ఎవరూ తెలీదండీ అని భుజంగం అంటాడు. ఈ ఇంట్లో ఎవరు ఉంటారని విహారి అడిగితే ఒక వ్యక్తి ఉంటాడు. అతను పెద్ద కోపిష్టి.. అని చెప్తాడు. ఇంతలో లక్ష్మీ ఫోన్ చేసి భుజంగం ఎలా ఉంటాడో తెలిసింది.. అని చెప్తుంది. ఫొటో వెంటనే పంపించు అని విహారి చెప్తాడు.

భుజంగం అప్పుడే విహారిని చూసి విహారి నువ్వు నన్ను చూస్తే నీ చావుని కూడా చూస్తావురా అని అనుకొని జేబులో ఉన్న చాకు తీయబోతాడు. ఇంతలో విహారి ఫోన్ స్విఛ్ ఆఫ్ అయిపోతుంది. ఫోన్లో ఛార్జింగ్ ఉందో లేదో చూసుకోవాలి కదండీ అని భుజంగం అంటాడు. విహారి భుజంగంతో నాకు ఎందుకో ఈ ఇంట్లోనే భుజంగం ఉన్నాడు అనిపిస్తుంది. నేను ఒక్కడినే వెళ్తే ఎవరైనా చూసి దొంగ అనుకుంటారు.. అదే మీరు వస్తే మీకు ఈ ఏరియా తెలుసు కాబట్టి ఎవరూ ఏం అనుకోరు అంటాడు. నా గురించి తెలియగానే చంపేస్తా అని భుజంగం అనుకుంటూ విహారితో లోపలికి వెళ్తాడు.

యమునని పోలీసులు కోర్టుకి తీసుకెళ్తారు. ఇంతలో లక్ష్మీకి ఓ అన్‌నౌన్‌ నెంబరు నుంచి ఫోన్ వచ్చి యమున బయటకు రావాలి అంటే నేను చెప్పింది నువ్వు చేయాలి అని అంటుంది. నీకు ఓ లొకేషన్ పెడతా వెంటనే రావాలి అని అంటుంది. ఇక సీత అయితే యమునని అడ్డు పెట్టుకొని విహారి, లక్ష్మీలను నామరూపాలు లేకుండా చేస్తా అని అనుకుంటుంది. యమునని తీసుకొని కోర్టుకి వెళ్తుంది. ఇక విహారి భుజంగం ఇళ్లు మొత్తం వెతుకుతాడు. భుజంగం గదిలో ఉన్న ఫైల్స్ చూసి తన వెంట వచ్చిన వ్యక్తే భుజంగం అని విహారికి అర్థమైపోతుంది. అప్పుడే భుజంగం వచ్చి విహారి మీద చాకుతో డాడి చేస్తాడు. విహారి తప్పించుకుంటాడు. ఇద్దరూ ఒకర్ని ఒకరు గట్టిగా కొట్టుకుంటారు. విహారి భుజంగాన్ని పట్టుకొని పోలీసులకు అప్పగిస్తాడు. యమునని కలిసి నిన్ను కాపాడుకుంటానని చెప్పాను కదామ్మా అని అంటాడు. భుజంగం విహారితో నన్ను అరెస్ట్ చేసినంత మాత్రానా నువ్వు మీ అమ్మ తప్పించుకున్నట్లు కాదు.. నీ ఫ్యామిలీని అంత ఈజీగా వదలనురా అని హెచ్చరిస్తాడు. లక్ష్మీ యమునని హగ్ చేసుకొని చాలా హ్యాపీగా ఫీలవుతుంది. ఇక ఏ సమస్య లేదు అని అనుకుంటారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.