Kakinada Crime News: యువతులతో రిలేషన్.. ప్రైవేట్ వీడియోల కోసమే చంపేశారు - కాకినాడ హత్య కేసు ఛేదించిన పోలీసులు
1 month ago 3
ARTICLE AD
హత్య కేసుకు సంబంధించిన వివరాలను కాకినాడ జిల్లా అదనపు ఎస్పీ, ఇన్చార్జి డిఎస్పి డాక్టర్ మహంతి కిషోర్ కుమార్  ఆదివారం నాడు మీడియాకు వెల్లడించారు. కాకినాడ త్రీ టౌన్ లా & ఆర్డర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సాంబమూర్తి నగర్ ఇందిరా కాలనీ, సెవెన్ హిల్స్ రోడ్లో నివాసం ఉంటున్న గండి గిరిధర్ అనే వ్యక్తి ఈ నెల 2వ తేదీన తన నివాసంలోనే గుర్తు తెలియని వ్యక్తుల చేత హత్యకు గురైన ఘటనపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు.
ప్రత్యేక దర్యాప్తు బృందాల ఏర్పాటు
మృతుడి తల్లి గండి జయలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కాకినాడ త్రీ టౌన్ లా & ఆర్థర్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ కెవిఎస్ సత్యనారాయణ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించగా ఈ హత్య కేసును కాకినాడ జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్  ప్రత్యేకంగా పర్యవేక్షిస్తూ హత్యకు పాల్పడిన నిందితులను త్వరితగతిన గుర్తించి అరెస్టు చేయాలని పోలీసు అధికారులను ఆదేశించారన్నారు. ఆయన ఆదేశాల మేరకు తన పర్యవేక్షణలో, కాకినాడ త్రీ టౌన్ లా ఆర్డర్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ కెవిఎస్ సత్యనారాయణ ప్రత్యేక క్రైమ్ బృందాలను ఏర్పాటు చేసి, సాంకేతిక ఆధారాలతో పాటు వివిధ కోణాల్లో దర్యాప్తు చేపట్టారన్నారు. ఈ దర్యాప్తులో భాగంగా సీసీ టీవీ ఫుటేజ్, సాంకేతిక ఆధారాలు, సంఘటనకు సంబంధించిన ఇతర ఆధారాలను విశ్లేషించి నిందితులను గుర్తించామని కిషోర్ కుమార్ చెప్పారు.
నిందితులు అరెస్టు
దర్యాప్తులో లభించిన ఆధారాల మేరకు ఈ నెల 12వ తేదీన తేదీన కాకినాడ త్రీ టౌన్ లా & ఆర్డర్ పోలీస్ స్టేషన్ ఇన్ స్పెక్టర్ కెవిఎస్ సత్యనారాయణ తమ సిబ్బంది సహాయంతో ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు చెప్పారు
అరెస్టు అయిన నిందితులు
1) పాలేపు వివేక్ @ బన్నీ, తండ్రి రాజు, వయస్సు 18 సం, ఇంటి నెంబరు 16-42-76, ఇందిరా కాలనీ, 5న నీధి, సాంబమూర్తి నగర్, కాకినాడ 2) ఏలూరి రామకృష్ణ, తండ్రి శ్రీను, వయస్సు 21 సం, ఇంటి నెంబరు 16-23-35/88, రోడ్ నెంబరు. 1, అయోధ్య నగర్, కాకినాడ
దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన అంశాలు..
దర్యాప్తులో వెల్లడైన వివరాల ప్రకారం మృతుడు గండి గిరిధర్  గతంలో వివాహం అయ్యి భార్యతో ఏర్పడిన విభేదాల కారణంగా విడాకులు తీసుకుని ప్రస్తుతం తన తల్లితో కలిసి నివాసం ఉంటున్నాడని, మృతుడు తనకు పరిచయం ఉన్న కొంత మంది మహిళలకు సంబంధించిన అసభ్యకరమైన ఫొటోలు, వీడియోలను తన సెల్ఫోన్లో భద్రపరచుకున్నట్లు దర్యాప్తులో వెల్లడైందని ఆయన చెప్పారు. మృతుడితో సన్నిహితంగా తిరిగే అదే ప్రాంతానికి చెందిన నిందితులు బన్నీ, రామకృష్ణలకు ఆ ఫొటోలు, వీడియోలను చూపించినట్లు తెలిసిందని, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఆ నిందితులు, ఆ ఫొటోలు, వీడియోలను మృతుడి వద్ద నుంచి తీసుకుని, వాటిలో ఉన్న మహిళల కుటుంబ సభ్యులను బెదిరించి డబ్బులు సంపాదించవచ్చని భావించినట్లు దర్యాప్తులో వెల్లడైందన్నారు. ఈ ఉద్దేశంతో మృతుడి వద్ద ఉన్న ఫొటోలు, వీడియోలను ఎలాగైనా తీసుకోవాలని నిందితులు ముందుగా పథకం వేసుకున్నారు.
ఈ నెల 1వ తేదీ రాత్రి సమయంలో మృతుడి తల్లి, పక్క పోర్షన్లో నివసించే మృతుడి అన్నయ్య, వారి కుటుంబ సభ్యులు ఇంట్లో లేరని, మృతుడు ఒక్కడే ఇంట్లో ఉన్నాడని తెలుసుకున్న నిందితులు, అదే రోజు రాత్రి సుమారు 12.15 గంటలకు మృతుడి ఇంటికి వెళ్లారని కిషోర్ చెప్పారు. అక్కడ  మృతుడితో ఫొటోలు, వీడియోల విషయమై నిందితులు గొడవకు దిగగా అనంతరం వారు ముందుగానే తీసుకువెళ్లిన కత్తితో మృతుడి కంఠం, భుజంపై విచక్షణారహితంగా దాడి చేయడంతో తీవ్ర రక్తస్రావం జరిగి గిరిధర్ అక్కడికక్కడే మృతి చెందినట్లు దర్యాప్తులో తేలినట్లు చెప్పారు. హత్య అనంతరం నిందితులు సంఘటనా స్థలం నుండి పరారయ్యారన్నారు . కేసు దర్యాప్తులో భాగంగా సేకరించిన ప్రత్యక్ష పరోక్ష సాక్ష్యాధారాలు, సాంకేతిక ఆధారాలు, సీసీ కెమెరాల ఫుటేజ్, ఇతర అందుబాటులో ఉన్న ఆధారాలను సమగ్రంగా విశ్లేషించడంతో పాటు, నిందితులను విచారించగా, ఈ హత్యలో వారి ప్రమేయం ఉన్నదని నిర్ధారించుకుని వారిని అరెస్టు చేసామన్నారు. కేసుకు సంబంధించి మరిన్ని సాక్ష్యాధారాల సేకరణ, సాంకేతిక ఆధారాల విశ్లేషణ మరియు ఇతర అంశాలపై దర్యాప్తు కొనసాగుతున్నట్లు చెప్పారు.
నిందితుల వద్ద నుండి ఆధారాలు స్వాధీనం
నిందితుల వద్ద నుండి మృతుడిని హత్య చేయడానికి ఉపయోగించిన కత్తి, హత్య జరిగిన సమయంలో నిందితులు ధరించిన రక్తపు మరకలతో కూడిన దుస్తులు, నిందితులకు సంబంధించిన నాలుగు సెల్ ఫోన్లు, ఒక పెన్, జలాగే మృతుడిని హత్య చేసిన అనంతరం అతని వద్ద నుండి తీసుకెళ్లిన సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. స్వాధీనం చేసుకున్న వస్తువులు ఇతర సాక్ష్యాధారాలను కేసు దర్యాప్తులో భాగంగా తదుపరి శాస్త్రీయ పరీక్షలు, చట్టపరమైన ప్రక్రియ నిమిత్తం భద్రపరిచామన్నారు.
_ పోలీసు బృందానికి అభినందనలు
హత్య జరిగిన అనంతరం కేసును సవాలుగా తీసుకుని, త్వరితగతిన దర్యాప్తు పూర్తి చేసి నిందితులను గుర్తించి అరెస్టు చేసిన ఇన్స్పెక్టర్ కెవిఎస్ సత్యనారాయణ, సబ్ ఇన్స్పెక్టర్లు  జివివిఎస్ చౌదరి, వి ఆంజనేయరాజు హెడ్ కానిస్టేబుల్ సతీష్, కానిస్టేబుల్స్ మురళిరాజు, బి శ్రీనివాసరావు, ప్రేమ్ కుమార్, దర్యాప్తులో పాల్గొన్న క్రైమ్ సిబ్బందిని కాకినాడ జిల్లా ఎస్పీ జి బిందుమాధవ్ అభినందించారు.
Read Entire Article