Janasena Politics: ఆ విషయంలో జనసేన ఘోరంగా ఫెయిల్... విజయ్ తో కంపేర్ చేస్తూ ట్రోల్ చేస్తున్నా పార్టీ నుండి కౌంటర్ ఏది?

4 weeks ago 4
ARTICLE AD

అమరావతి: తమిళనాడు ఎన్నికల్లో లో విజయ్ అత్యధిక సీట్లు సాదించడం ఏపీలో జనసేన కు తలనొప్పి గా మారింది. విజయ్ గెలుపును దృష్టిలో పెట్టుకొని  ఏపీలో పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తున్నారు ఆయన రాజకీయ ప్రత్యర్థులు. తొలిసారి పోటీ చేసినప్పుడే విజయ్ రెండు చోట్ల గెలవడం  పవన్ విషయంలో మాత్రం అది రివర్స్ లో జరగడం అలానే TVk పోటీ చేసిన తొలి ఎన్నికల్లోనే  నెంబర్ వన్ పార్టీగా నిలబడడం  జనసేన అప్పట్లో కేవలం ఒక్క సీటుకే పరిమితం కావడం ఇలా అనేక పోలికలు తీసుకొస్తూ సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ ని జనసేన ను టార్గెట్ చేస్తున్నాయి ప్రత్యర్థి పార్టీలు ఇతర ట్రోలర్స్.

అయితే ఇంత జరుగుతున్నా జనసేన నుంచి ఈ విషయంలో సరైన కౌంటర్ రాకపోవడం  ఆశ్చర్యమే. ఇదే సంగతి వేరే పార్టీ విషయంలో జరిగితే కచ్చితంగా ఇప్పటికే పార్టీ నుంచి కీలక నేతలు రంగంలోకి దిగి కౌంటర్ ఇచ్చి ఉండేవారు అనే మాట వినిపిస్తోంది. అలాగ IT వింగ్ పరంగా కూడా జనసేన బాగా వెనకబడి ఉన్నట్టు కనబడుతోంది అంటున్నారు పరిణామాలు గమనిస్తున్న వారు.

జనసేనలో కనబడుతున్న ఆ లోటు.. పవన్ దృష్టి పెట్టాల్సిందే

నిజానికి తమిళనాడులో పరిస్థితులు వేరు ఏపీలో సినారియో వేరు. రెండు చోట్ల రాజకీయ పరిణామాలను ఒకేలా చూడలేము. కానీ ఈ విషయాన్ని గట్టిగా కౌంటర్ చేయాల్సింది జనసేన నే. అయితే జనసేనలో ఆ ట్రబుల్ షూటర్ పాత్ర అస్సులు లేనట్టు గానే కనిపిస్తోంది. అయితే అధ్యక్షుడు పవన్, తప్పితే నాదెండ్ల మనోహర్ తప్ప  విమర్శలకు కౌంటర్ ఇచ్చే లీడర్ అక్కడ లేరు. ఒకప్పుడు జనసేనపై ఈగ వాలితే ఇమ్మీడియేట్ గా కౌంటర్ ఇచ్చే  వ్యక్తులుగా పేరు ఉన్న అద్దేపల్లి శ్రీధర్ లాంటి నేతలు, దిలీప్ సుంకరలాంటి అభిమానులు పార్టీలో లేరు. ఆ తర్వాత యాక్టివ్ పాత్ర పోషించిన బొలిశెట్టి  ప్రస్తుతం పార్టీకి దూరంగా ఉంటున్నారు.

పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ శస్త్ర చికిత్స కారణంగా రెస్ట్ తీసుకుంటుంటే  నాదెండ్ల మనోహర్ పితృ వియోగంలో ఉన్నారు.. నిజానికి ప్రస్తుతం పార్టీపై సోషల్ మీడియాలో జరుగుతున్న ట్రోల్స్ పై  స్పందించడానికి ఆ స్థాయి నాయకుల అవసరం లేదు. సెకండ్ గ్రేడ్ నాయకుల  కౌంటర్స్ సరిపోతాయి. కానీ ప్రస్తుతం వారికి దిశా నిర్దేశం చేసే వాళ్ళు కరువయ్యారు. అదే జనసేన అసలు సమస్య. పార్టీ హైకమాండ్ కి క్షేత్ర స్థాయి లీడర్ల కి మధ్య ఏదో తెలియని గ్యాప్ అయితే కనిపిస్తోంది. దానిపై ఖచ్చితంగా పార్టీ హై కమాండ్ దృష్టి పెట్టాల్సిందే.

అందరి దృష్టి విజయ్ vs పవన్ పైనే

విజయ్ పవన్ ల మధ్య ఇంతలా పోలిక ఎందుకు వస్తుందంటే వారిద్దరి కెరీర్ సమాంతరంగా సాగడమే.  ఇంచుమించు ఇద్దరూ సినిమాల్లోకి ఒకేసారి వచ్చారు. తండ్రి వారసత్వంగా విజయ్ సినిమాల్లోకి వస్తే, అన్నకు తమ్ముడిగా పవన్ తెరంగ్రేటం చేశారు. డాన్సులతో విజయ్, ఫైట్లతో పవన్  క్రొత్తతరం యువతను బాగా ఆకట్టుకున్నారు. విజయ్ నటించిన " లవ్ టుడే" సినిమాను సుస్వాగతం పేరుతో పవన్ తెలుగులో రీమేక్ చేస్తే పవన్ సూపర్ హిట్ "తమ్ముడు" ను  "బద్రి " పేరుతో విజయ్ తమిళంలో రీమేక్ చేశారు. రజనీకాంత్ కమలహాసన్ ల తర్వాత సూపర్ స్టార్ గా విజయ్ తమిళనాడు లో అవతరిస్తే  తెలుగు నాట పవన్ కళ్యాణ్ క్రేజ్ లో తారాస్థాయికి చేరుకున్నారు. ఇద్దరు తమ సినిమాల్లో సామాజిక అంశాలపై సందేశం ఇచ్చే ప్రయత్నం చేస్తూ వచ్చారు.

పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి తమిళనాడులో విజయ్ కూడా పార్టీ పెడతారన్న ప్రచారం ఆయన అభిమానులు చేస్తూ వచ్చారు.ఇన్నాళ్ళు కు అది.నిజమైంది కూడా. పవన్ కళ్యాణ్ ఏపీ కి ఉప ముఖ్యమంత్రి అయితే విజయ్ తమిళనాడు సీఎం పదవికి అడుగు దూరంలో ఉన్నారు. దానితో సహజంగానే ఇద్దరమధ్య కంపేరిజన్ మొదలైపోయింది. అది సోషల్ మీడియాలో ట్రోలింగ్ స్థాయికి చేరుకుంది. అయితే దీని వెనకాల పవన్ రాజకీయ ప్రత్యర్థుల ఆలోచన ఉందన్న  ఆరోపణ కూడా ఉంది.

కూటమి నుండి పవన్ కళ్యాణ్ ను విడదీసే ప్రయత్నంలో ఇవన్నీ జరుగుతున్నాయన్న ప్రచారమూ లేకపోలేదు. అయితే ఆ దిశగా బలమైన కౌంటర్ ఇచ్చే నాయకులే ప్రస్తుతం జనసేనలో కరువయ్యారు. బహుశా దీన్ని గమనించే నేమో త్వరలోనే అన్ని కమిటీలను ఏమిస్తామంటూ జనసేన ఒక ప్రకటన కూడా రిలీజ్ చేసింది. మరి కార్యాచరణలో అది ఏవిధంగా ఉంటుందో చూడాలి.

Read Entire Article