Jamili elections are likely to be held in 2034: జమిలీ ఎన్నికల బిల్లు పెట్టడం కాదు అసలు ఎప్పుడు జమిలీ ఎన్నికలు నిర్వహిస్తారన్న సస్పెన్స్ చాలా మందిలో ఉంది. బిల్లులో ఆ విషయం ప్రస్తావించడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే విశ్వసనీయంగా తెలిసిన సమాచారం ప్రచారం జమిలీ ఎన్నికలు పూర్తి స్థాయిలో 2034లో జరుగుతాయి. ఇందుకు సంబంధించిన రోడ్ మ్యాప్ మాత్రమే చట్టంలో ఉన్నట్లుగా తెలుస్తోంది.

వెంటనే జమిలీ ఎన్నికలు అని ఆశపడుతున్న కొన్ని పార్టీలు

జమిలీ ఎన్నికల బిల్లు పార్లమెంట్ లో ఆమోదం పొందగానే ప్రభుత్వాలన్నీకూలిపోతాయని .. ఇక ఎన్నికలే అని కొన్నిపార్టీలు అనుకుంటున్నాయి. ఏపీలో వైసీపీ, తెలంగాణ బీఆర్ఎస్ ఇలాంటి జమిలీ ఎన్నికల ప్రకటనలు చేస్తున్నారు. కానీ బిల్లులో ఉన్న అంశాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. బిల్లు ఇంకా పార్లమెంట్ లో పెట్టలేదు కానీ అందులో అంశాలను మీడియా రిపోర్టుచేస్తోంది. తాజాగా బిల్లులో ఓ కీలక అంశం వెలుగులోకి వచ్చింది. ఆ ప్రకారం జమిలీ ఎన్నికలు 2034లో నిర్వహిస్తారు. అప్పటి వరకూ గ్రౌండ్ ప్రిపేర్ అయ్యేలా చట్టాల సవరణ, ఇతర జాగ్రత్తలు తీసుకుంటారని తెలుస్తోంది.

Also Read: YSRCP: ఆ ఎన్నికలనూ బహిష్కరించిన వైసీపీ - ఇక ఐదేళ్లు ఏ ఎన్నికల్లోనూ పోటీ చేయలేరు - మరి క్యాడర్ ఉంటుందా ?

మహిళా బిల్లు విషయంలోనూ సేమ్ స్ట్రాటజీ

మహిళా బిల్లు కూడా గతంలో కేంద్రం ప్రభుత్వం ఆమోదించింది. ఆ బిల్లు కూడా అంతే. వెంటనే అమల్లోకి రాదు. నియోజకవర్గాల పునర్విభజన తర్వాతే అమల్లోకి వస్తుందని చట్టంలో చేర్చారు. జమిలీ ఎన్నికలకూ అదే ఫార్ములా ఉపయోగిస్తున్నట్లుగా తెలుస్తోంది. పార్లమెంట్ లో చేయబోయే రాజ్యాంగ సవరణలో రాజ్యాంగంలో కొత్తగా 82A సెక్షన్ చేర్చబోతున్నారు. ఇది జమిలీ ఎన్నికలను నిర్దేశిస్తుంది. అలాగే 83 సెక్షన్ ప్రభుత్వాల కాలపరిమితికి సంబంధించి మారుస్తారు. ఆర్టికల్ 172, ఆర్టికల్ 327లో కూడా మార్పులు చేస్తారు. ఈ రెండు ఎమ్మెల్యేల పదవికాలం, ప్రజాప్రతినిధుల విషయంలో పార్లమెంట్ అధికారాలకు సంబంధించిన అంశాలవి. వీటిలోనూ సవరణలు చేయనున్నారు. ఇవన్నీ చేయాలంటే విపక్షాల మద్దతు అవసరం.

Also Read: Ravi Kishan On Allu Arjun Arrest: ఫిల్మ్ ఇండస్ట్రీకి చీకటి రోజు... అల్లు అర్జున్ అరెస్టుపై ఘాటుగా స్పందించిన బీజేపీ ఎంపీ

2029లో పాక్షిక జమిలీ ఎన్నికలు

ప్రస్తుతానికి చట్టంలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలను మాత్రమే కలిపి జమిలీగా నిర్వహించేలా చట్టంలో పెడుతున్నారు. జమిలీ ఎన్నికలకు ఎన్నో సమస్యలు ఉంటాయి. వాటిని ఒక్క సారిగా అన్ని ప్రభుత్వాలను రద్దు చేసేసి మళ్లీ ఎన్నికలు పెట్టడం ద్వారా సాధ్యం కాదు. మెల్లగా ఒకదాని తర్వాత ఒకటి పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్లాలి.. ఆ సమయానికి అంతా పకడ్బందీగా అయ్యేలా ప్రణాళికలు రెడీ చేసుకుంటారు.ఈ లెక్కన చూస్తే 2029కి పాక్షిక జమిలీ జరిగే అవకాశం ఉంది. ఆ ఎన్నికలకు ఆరు నెలల ముందు.. ఆరు నెలల తర్వాత జరిగే ఎన్నికలన్నింటినీ కలిపితే పాక్షిక జమిలీ అవుతుంది. ఆ తర్వాత ఎన్నికల నాటికి పూర్తి స్థాయి జమిలీకి రెడీ అవుతారని అర్థం చేసుకోవచ్చు. బిల్లు పెట్టిన తర్వాత పూర్తి వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది .