Jagadhatri Serial Today Episode September 14th: శ్రీవల్లిని కిడ్నాప్ చేసి తీసుకెళ్తుండగా...జగధాత్రి, కేదార్‌కు అనుమానం వచ్చి ఆపుతారు. కారులో శ్రీవల్లి ఉండటం చూసి నిలువరిస్తారు. ఆమెను కాపాడి ఇంట్లోకి తీసుకెళ్లిపోతారు.

Jagadhatri Serial Today Episode: జీతెలుగు ఛానెల్‌లో ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంటున్న జగధాత్రి సీరియల్‌ ఈరోజు మంచి ట్విస్టులతో సాగుతుంది. శ్రీవల్లిని శాశ్వతంగా ఇంటికి దూరం చేసేందుకు పాపారాయుడు ఆమెకు మత్తుమందు ఇచ్చి కిడ్నాప్ చేసి తీసుకెళ్లబోతాడు. అప్పుడే బయట నుంచి లోపలికి వస్తున్న జగధాత్రి...పాపారాయుడు కంగారుపడటం చూసి అనుమానిస్తుంది. కారు దగ్గరకు వచ్చి నిలదీస్తుంది.లోపల శ్రీవల్లి ఉండటం చూసి అడ్డుకుంటుంది. కేదార్‌ ఆమెను కాపాడి ఇంట్లోకి తీసుకెళ్తాడు. మరోసారి ఇంటివైపు వస్తే పోలీసులకు చెప్పి కేసు పెట్టిస్తానని కౌషికి పాపారాయుడికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తుంది. అటు సుధాకర్‌కు కాళ్లు రప్పించేందుకు కేదార్‌ మంటల్లోకి వెళ్లేందుకు సిద్ధమవ్వగా...అవుట్‌హౌస్‌లోనే కేదార్‌ను మంటల్లో వేసి చంపేందుకు యువరాజు కుట్రలు పన్నడంతో ఈరోజు ఎపిసోడ్ ఎంతో ఆసక్తిగా సాగుతుంది.
శ్రీవల్లిని కిడ్నాప్ చేసిన పాపారాయుడు
శ్రీవల్లిని ఇంటి నుంచి దూరంగా తీసుకెళ్లిపోవడానికి పాపారాయుడు వస్తాడు. కేదార్‌ చేతికి గాయమవ్వడంతో జగధాత్రి భర్తను తీసుకుని ఆస్పత్రికి వెళ్తుంది. శ్రీవల్లిని తప్పించడానికి ఇదే సరైన సమయమని భావించి వైజయంతి, నిషిక పాపారాయుడుని రెచ్చగొడతారు. దీంతో పాపారాయుడు శ్రీవల్లికి మత్తుమందు ఇచ్చి స్పృహతప్పి పడిపోగానే ఎత్తుకుని వెళ్లి కారులో పడేస్తాడు. ఆమెను తీసుకుని బయలుదేరుతుండగా....జగధాత్రి, కేదార్‌ బయట నుంచి ఇంట్లోకి వస్తుంటారు. పాపారాయుడు కంగారుగా వెళ్లిపోవడం చూసి జగధాత్రి అతన్ని ఆపుతుంది. ఎందుకు అంత కంగారుగా వెళ్తున్నారని ప్రశ్నిస్తుంది. నాకు మర్యాద ఇవ్వని ఇంట్లో ఉండలేనని చెప్పి వెళ్లబోతుండగా అడ్డుకుంటుంది. ఇంతలో బయట గొడవ జరుగుతోందని కౌషికి, సుధాకర్‌, కమలాకర్‌ కూడా బయటకు వస్తారు. ఈ జగధాత్రి ఏదో కొంప ముంచుతోందని వైజయంతికి కాళ్లు, చేతులు ఆడవు.
శ్రీవల్లిని గుర్తించిన ధాత్రి
పాపారాయుడు కారులో శ్రీవల్లి స్పృహతప్పి పడిపోయి ఉండటాన్ని జగధాత్రి గమనిస్తుంది. వెంటనే కేదార్‌ను కేకవేసి గేటు వేయమని చెబుతుంది. దీంతో కారు వెళ్లకుండా కేదార్ గేట్ మూసివేస్తాడు. వెంటనే పరుగెత్తుకుంటూ వచ్చిన జగధాత్రి...పాపారాయుడు దగ్గర ఉన్న కారు కీ లాక్కుటుంది. వెనక డోర్‌ తెరిచి చూడగా...అందులో శ్రీవల్లి స్పృహలేకుండా పడిపోయి ఉంటుంది. దీంతో అందరూ పాపారాయుడుని తిడతారు. ఇంకోసారి ఇంట్లోకి వస్తే పోలీసులకు కంప్లైంట్ చేస్తానని కౌషికి పాపారాయుడికి వార్నింగ్ ఇస్తుంది. సుధాకర్‌ బావమరిది గట్టిగా మందలించి ఇంటివైపు వస్తే కాళ్లు విరగ్గొట్టిస్తానని చెబుతాడు. ఇంట్లోకి వచ్చిన తర్వాత శ్రీవల్లికి స్పృహ వస్తుంది. అసలు పాపారాయుడు బాబాయి పదేపదే శ్రీవల్లిని ఎందుకు కిడ్నాప్ చేయాలనుకుంటున్నాడో అర్థం కావడం లేదని జగధాత్రి అంటుంది. శ్రీవల్లి ఇంట్లో ఉంటే పాపారాయుడు బాబాయికి వచ్చే నష్టమేంటని ప్రశ్నిస్తుంది. మనం ఇంతగా వద్దని చెబుతున్నా పదేపదే కిడ్నాప్‌ చేసి మరీ శ్రీవల్లిని ఎందుకు తీసుకెళ్తున్నాడో అర్థం కావడం లేదని అంటుంది. జగధాత్రి మాటలు విన్న కౌషికి, సుధాకర్‌ కూడా నువ్వు చెప్పింది వింటుంటే మాకు కూడా అదే అనుమానం వస్తుందని అంటారు.
వైజయంతికి కమలాకర్ వార్నింగ్
జగధాత్రి చివరి నిమిషంలో వచ్చి ప్లాన్ మొత్తం నాశనం చేసిందని నిషిక ఎగిరిపడుతుంటుంది. అప్పుడే అక్కడికి వచ్చిన కమలాకర్‌...వైజయంతికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తాడు. శ్రీవల్లి మా అన్నయ్య కూతురు అని తెలిసినా, కేదార్‌ సొంత చెల్లి అని తెలిసినా నేను నోరుమూసుకుని ఉండటానికి కారణం...ఈ విషయం తెలిస్తే అన్నయ్య నిన్ను ఇంట్లో నుంచి గెంటేస్తాడని కమలాకర్‌ వాళ్ల వదినతో అంటాడు. అందుకే ఈ ఇంట్లో మహారాణిలా బతకాల్సిన నా అన్న కూతురు పనిమనిషిలా అన్ని పనులు చేస్తున్నా ఊరుకుంటున్నానని...కానీ మీరు ఆమె ప్రాణాలే తీయాలని చూస్తున్నారని మండిపడతాడు. మరోసారి ఇలాంటి పిచ్చి వేషాలు వేశారంటే నేను అన్నయ్యకు నిజం చెప్పేస్తానని ఆ తర్వాత ఎవరిని ఇంట్లో నుంచి గెంటివేసినా నాకు సంబంధం లేదని చెప్పి వెళ్లిపోతాడు. అటు శ్రీవల్లి టెన్షన్‌ తట్టుకోలేక చస్తుంటే..ఇప్పుడు ఈ కమలాకర్‌ కూడా తయారయ్యాడని వైజయంతి ఏడుస్తుంది.
కేదార్ హత్యకు కుట్రలు
కేదార్‌ను అవుట్‌హౌస్‌లోనే చంపడానికి అన్ని సిద్ధం చేశానని యువరాజు అంటాడు. ఇప్పుడే ఆ శ్రీవల్లి విషయం బయటపడి ఇరుక్కున్నామని ఇప్పుడు ఆ కేదార్‌ను చంపడానికి ప్రయత్నించామని తెలిస్తే మీ నాన్న మనల్ని చంపేస్తాడని వైజయంతి యువరాజుతో అంటుంది. అయినా మనం ఏం ప్లాన్ చేసి చేయడం లేదు కదా...వాడే నాన్నకు కాళ్లు రప్పించడానికి ఈ ప్లాన్ వేశాడని యువరాజు అంటాడు. కాకపోతే మనం వెనక తలుపుకు గొళ్లెం వేస్తామంతే అని అంటాడు. వాడు మంటల్లో కాలిపోయిన తర్వాత ఎవరికీ తెలియకుండా వెళ్లి మనం గొళ్లెం తీస్తామని....చచ్చినవాడు బతికొచ్చి చెప్పలేడు కదా అని అంటాడు. మంటలు బాగా రావడానికి అవుట్‌ హౌస్‌లో కట్టెలు, పేపర్లు కూడా దండిగా పెట్టానని చెబుతాడు.

Jagadhatri Serial ,Jagadhatri ,TV Prasaram,JD and KD ,Jagadhatri Serial Promo,Today Jagadhatri Serial Today Episode

జగద్ధాత్రి సీరియల్, టీవీ ప్రసారం, జగద్ధాత్రి సీరియల్ టుడే ఎపిసోడ్, జగద్ధాత్రి సీరియల్ టుడే ఏపిసోడ్, జగధాత్రి సీరియల్ ప్రోమో, జేడీ అండ్ కేడీ