Jagadhatri Serial Today Episode: జీతెలుగు ఛానెల్‌లో ప్రేక్షకులను ఎంతో ఆకట్టుకుంటున్న జగధాత్రి సీరియల్‌ ఈరోజు మంచి ట్విస్టులతో సాగుతుంది. పిచ్చాసుపత్రిలో చేరడం కోసం వైజయంతి మెట్లమీద నుంచి కిందపడి పిచ్చిపట్టిన దానిలా నాటకం ఆడుతుంది. ఈవిషయం జగధాత్రి,కేదార్‌ వాళ్లు పట్టేస్తారు. రేపు వీళ్లను ఆస్పత్రిలో ఆడుకోవాలని అనుకుంటారు. సింధూను తీసుకుని జేడీ,కేడీ ఆస్పత్రికి రాగా....వైజయంతితో యువరాజు, నిషిక వస్తారు.
వైజయంతికి పిచ్చి
పిచ్చాసుపత్రిలో చేరాలంటే మీరు పిచ్చిపట్టినదానిలా నటించాలని నిషిక చెప్పడంతో వైజయంతి సరేనంటుంది. అయినా ఆస్పత్రి లోపలికి వెళ్లినా ఆ ఫైల్స్ ఎక్కడ ఉన్నాయో మనకు ఎలా తెలుస్తుందని వైజయంతి అంటుంది. ముందు లోపలకి అయితే వెళ్దామని ఆ తర్వాత సంగతి అప్పుడు చూద్దామని చెబుతుంది. అయినా ఆఫైల్స్ ఎక్కడ ఉన్నాయో మీనన్‌కు చెప్పేస్తే వాడే చూసుకుంటాడు కదా మధ్యలో మనకు ఎందుకు ఈ గొడవ అని యువరాజు అంటాడు. మీనన్‌ చేతికి ఫైల్స్ వచ్చినా మనల్ని వదిలిపెడతాడని నమ్మలేమని నిషిక అంటుంది.అదే ఆ ఫైల్ మనచేతిలో ఉంటే మనం చెప్పినట్లు వింటాడని చెబుతుంది. దీనికి వైజయంతి కూడా కరెక్టేనని అంటుంది. అయితే నేను చెప్పినట్లు మీరు మెట్లమీద నుంచి కిందపడి తలకు దెబ్బతగిలినట్లు నటించమని నిషిక చెబుతుంది. కోడలు చెప్పినట్లే మెట్లమీద నుంచి వైజయంతి పడిపోవడంతో అందరూ పరుగెత్తుకుని వస్తారు. ఏమైందోనని కంగారుపడతారు. చిన్నగా లేచిన వైజయంతి తనకు పిచ్చిపట్టినట్లుగా నాటకం మొదలుపెడుతుంది. సుధాకర్‌ను చూసి శోభన్‌బాబు అంటూ పిలుస్తుంది. దీంతో అత్తయ్యకు ఏదో అయ్యిందని రేపు మెంటల్ ఆస్పత్రికి తీసుకుని వెళ్లి చూపిస్తామని నిషిక అంటుంది.ఉన్నట్లుండి మెంటల్ ఆస్పత్రికి వెళ్దామని అంటున్నారంటే వీళ్లకు ఆ మీనన్‌ ఫైల్స్ అక్కడే ఉన్నాయని తెలిసిపోయినట్లు ఉందని...మనకన్నా ముందే అక్కడికి వెళ్లి ఆ ఫైల్స్ వెతకాలని అనుకుంటున్నారని జగధాత్రి అంటుంది.రేపు అక్కడికి వచ్చిన తర్వాత వీళ్ల పని చెప్పాలని కేదార్‌తో అంటుంది.
పిచ్చాసుపత్రికి వచ్చిన సింధూ
సింధూకు విషయం మొత్తం చెప్పి జగధాత్రి పిచ్చాసుపత్రికి తీసుకుని వస్తుంది. నాకు నటించాలంటేనే భయంగా ఉందని అంటుంది. మరి ఏం చెప్పి లోపలికి తీసుకెళ్తారని అంటే...నీకు పిచ్చిపట్టి ఎక్కువ తినేస్తున్నావని చెబుతామని అంటారు.అలాంటిదేమీ వద్దని ప్రేమలో విఫలమై ఇలా పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తున్నాని చెప్పమని చెబుతుంది.ఈ ఐడియా కూడా బాగుందని జగధాత్రి ఓకే అంటుంది. ఆ తర్వాత సింధూను తీసుకుని వాళ్లు ఆస్పత్రి లోపలికి వెళ్లిపోతారు. ఏమైందని అడిగితే లవ్‌ ఫెయిల్యూర్‌ అని చెబుతారు. దీన్ని అవకాశంగా తీసుకున్న సింధూ కేదార్‌ను గట్టిగా వాటేసుకుని నువ్వు నా బంగారానివి అంటూ హత్తుకుంటుంది. కేదార్ వదిలిపెట్టమని చెప్పినా వదిలిపెట్టదు. ఇది చూసిన జగధాత్రి కోపంతో రగిలిపోతుంది. ఏంటి ఇలా చేస్తున్నావని అంటే...డాక్టర్‌ నమ్మాలంటే ఆమాత్రం చేయాలని కదా అని అంటుంది. దీంతో జగధాత్రి మా చెల్లికి వెంటనే కరెంట్ ట్రీట్‌మెంట్ ఇద్దామని చెబుతుంది. దీంతో సింధూ భయపడి అలాంటి పని చేయవద్దని జగధాత్రిని వేడుకుంటుంది.ఇంకొకసారి కేదార్‌ దగ్గరకు వెళ్లావంటే నిన్ను పర్మినెంట్‌గా ఇక్కడే ఉంచేస్తానని హెచ్చరిస్తుంది.
పిచ్చివాళ్లతో వైజయంతి గొడవ
ఇంటి దగ్గర నుంచి పిచ్చిదానిలా వేషం వేసుకుని ఆస్పత్రికి వచ్చిన వైజయంతిని తీసుకుని యువరాజు,నిషిక లోపలికి వెళ్తారు. డాక్టర్ ఏమైందని అడిగితే మెట్లపై నుంచి కిందపడి తలకు దెబ్బతగిలిందని చెబుతారు. అప్పటి నుంచి పిచ్చిపిచ్చిగా చేస్తుందని చెబుతారు.ఇంతలో ఓ పిచ్చి అమ్మాయి వచ్చి వైజయంతి జుట్టుపట్టుకుని గట్టిగా పీకుతుంది. ఎంత వదలమన్నా వినిపించుకోకపోవడంతో వైజయంతి కూడా పిచ్చిపట్టిన దానిలా ఆ పిచ్చి అమ్మాయి జుట్టుపట్టుకుంటుంది. ఇద్దరూ జుట్లు పట్టుకుని కొట్టుకుంటారు.