Jagadhatri Serial Today Episode కేడీ, జేడీలు గౌరీ వెనక ఊరి పెద్ద సోములు ఉన్నారని గుర్తిస్తారు. ఇది కేవలం ఒక్క సురేశ్‌ని ట్రాప్ చేయడానికే కాదు దీని వెనక చాలా పెద్ద కుట్ర ఉందని అనుకుంటారు. మొత్తం చూసి సీసీ కెమెరాలు ఉండటం చూసి రమ్యకి కాల్ చేసి దానికి సంబంధించిన పుటేజ్ కావాలని చెప్తుంది.

రమ్య మొత్తం చూస్తుంది. అందులో గౌరీ మొత్తం కావాలనే చేసినట్లు ఉంటుంది. రమ్య ఫుటేజ్ దొరికిందని చెప్పి జేడీకి పంపిస్తానని అంటుంది. జేడీ రమ్యతో అదే కాకుండా ఆరు నెలల వరకు ఈ ఏరియాలో ఫుటేజ్ చెక్ చేసి ఇవ్వమని చెప్తుంది. జేడీ, కేడీలు ఫుటేజ్ చూసి ఇక గౌరీ పని జైలుకే అని అంటుంది. జేడీ కౌషికి కాల్ చేసి జేడీ టీంకి విషయం చెప్పాం.. జేడీ టీం అన్నయ్య ఏం తప్పు చేయలేదని చెప్తారని అంటుంది. కౌషికి భర్తతో టెన్షన్ పడొద్దని చెప్తుంది. రమ్య జేడీకి కాల్ చేసి గౌరీ పెద్ద కిలాడీ అని ఫుటేజ్ పంపిస్తా అని చెప్తుంది.

రమ్య పంపించిన పుటేజ్‌లో గౌరీ గతంలో ఇలా చాలా సార్లు చేసినట్లు ఉంటుంది. జేడీ, కేడీలు చూసి దొరికేసిందని అనుకుంటారు. ఇక రమ్య ఇంతకు ముందు సురేశ్‌లా బాధితులు డిటైల్స్ పంపిస్తుంది. కేథార్ వాళ్లతో మాట్లాడుతాడు. ఇద్దరూ కొంత మందితో మాట్లాడుతారు. జేడీ, కేడీలు బస్తీ దగ్గరకు వెళ్లి కౌషికి వాళ్లని రమ్మని పిలుస్తారు. బస్తీ వాళ్లు అంతా ఎదురు చూస్తూ ఉంటారు. ఇంతలో జేడీ, కేడీలతో పాటు కౌషికి, సురేశ్‌లు వస్తారు. గౌరీ నాటకం మొదలు పెడుతుంది. డబ్బు ఇవ్వండి పెళ్లి వాళ్లకి ఇస్తాం అని సోములు అంటే వాళ్లని రమ్మని చెప్పండి మేం ఇస్తాం అని జేడీ అంటుంది. డబ్బులిస్తామని జేడీ వెళ్లి గౌరీని కొడుతుంది. నన్నే కొడతావా వీడియోలు వైరల్ చేస్తా అని గౌరీ అంటే తీయవే తీయ్ అని సురేశ్ అంటాడు. ఇక జేడీ పెద్దాయనతో సాక్ష్యాలు అడిగావ్ కదా చూపిస్తాను చూడు అని గతంతో గౌరీ ట్రాప్ చేసిన అన్ని వీడియోలు చూపిస్తారు.

గౌరీతో పాటు అందరూ బిత్తర పోతారు. పెద్దాయన చెమటలు పట్టేస్తాడు. జేడీ గౌరీని కొడుతుంది. సురేశ్ పెద్దాయన కాలర్ పట్టుకొని లాగిపెట్టి కొట్టి నువ్వేం పెద్ద మనిషివిరా అని కొడతాడు. అందరూ చీవాట్లు పెడతారు. జేడీ, కేడీలు పెద్దాయన, గౌరీలను లాక్కొని పోలీస్‌ జీపు ఎక్కిస్తారు. కౌషికి జేడీ, కేడీలకు థ్యాంక్స్ చెప్తుంది. బస్తీలో జరిగిన ఈ మోసాన్ని న్యూస్ వస్తుంది. కౌషికి ఇంట్లో అందరూ న్యూస్ చూస్తారు. సురేశ్‌ని ఎన్నో మాటలు అన్నారు కదా ఇప్పుడేంటి అని కౌషికి అడుగుతుంది. ఏదో అనేశాం అవన్నీ పట్టించుకోవద్దని వైజయంతి అంటుంది. అలా ఎలా ఒక మాట అంటే ఆలోచించి అనాలి అని కేథార్ అంటాడు. దానికి నిషి అడ్డమైన వాళ్ల కోసం అడ్డమైన వాళ్లు చెప్పాల్సిన అవసరం లేదు అని అంటుంది. ఎవరు అడ్డమైనా వాళ్లు వాళ్లు నాకు అండగా ఉంటేవాళ్లు మీరే అది అని కౌషికి నిషి నోరు మూయిస్తుంది. ఇకనైనా బుద్ధి తెచ్చుకోండి అని సుధాకర్ అంటే వైజయంతి చేతులు జోడించి క్షమాపణ చెప్తుంది. సురేశ్ క్షమిస్తాడు. ఇదంతా జేడీ కేడీల వల్లే అని కౌషికి, సురేశ్ కృతజ్ఞతలు చెప్పుకోవాలి అనుకుంటారు.దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.