Jagadhatri Serial Today Episode: కేదార్‌కు ఓ చెల్లి ఉందని తను కూడా ఇదే ఊరిలో ఉందని జగధాత్రి వీరశంకర్‌కు చెబుతుంది. తాము ఓరోజు రోడ్డుపై వస్తుంటే...మీ అమ్మాయిగారి ఫొటోతో ఉన్న ఓ అమ్మాయి మాకు కనిపించిందని...మళ్లీ మేం వెళ్లి చూసేసరికి ఆమె లేదని చెబుతారు. వీరశంకర్‌ కూడా ఆనాటి రోజులు గుర్తుచేసుకుని నా బిడ్డ మరో అమ్మాయికి జన్మనిచ్చిందని తెలుసుకుని ఆనందపడిపోతాడు. దేవుడు అంతా మంచే చేస్తున్నాడని అందరినీ కలపడానికి ట్రై చేస్తున్నాడని చెబుతాడు.ఎప్పటికైనా నీ చెల్లి నీ దగ్గరకు వస్తుందని కేదార్‌తో అంటాడు.ఇదంతా విన్న నిషిక...వెళ్లి యువరాజుతో చెబుతుంది. ఇప్పుడు ఆ శ్రీవల్లి కేదార్‌ చెల్లి అని తెలిస్తే...మనం రోడ్డునపడటం ఖాయమని అంటుంది. అయితే వాళ్లిద్దరూ కలవకుండా ఉండటానికి ఏదైనా చేస్తానని యువరాజు అంటాడు.

జగధాత్రి నిద్రలేవక ముందే కేదార్ సుధాకర్‌ను తీసుకుని చల్లగాలికి బయటకు వస్తాడు.ధాత్రి లేచి కేదార్‌ కోసం ఇళ్లంతా వెతుకుతుంది.ఎక్కడా కనిపించకపోయేసరికి కంగారుగా కౌషికిని తీసుకుని బయటకు వస్తుంది.అక్కడ తండ్రీకొడుకులిద్దరూ సరదాగా నవ్వుకుంటూ మాట్లాడుకోవడం చూసి వాళ్లిద్దరూ అక్కడికి వస్తారు. అందరూ కలిసి నవ్వుకోవడం చూసి యువరాజు,నిషిక, వైజయంతికి కడుపు మండిపోతుంది. యువరాజు అక్కడికి వచ్చి మానాన్నను నిన్ను ఎవడు బయటకు తీసుకురమ్మాన్నాడని నిలదీస్తాడు. మానాన్నను చూసుకోవడానికి నీకు ఏం అధికారం ఉందని మండిపడతాడు. నోటికొచ్చినట్లు తిడటాడు. కేదార్‌పై చేయిచేసుకోవడానికి ప్రయత్నించగా....సుధాకర్‌ గట్టిగా అరిచి ఆపుతాడు. కేదార్ నా కొడుకని మీ అందరికీ తెలుసు...కానీ ఎవరూ దీన్ని అంగీకరించడానికి ఇష్టపడటం లేదని..మీరు బాధపడతారనే నేను కూడా ఇన్నాళ్లు మౌనంగా ఉన్నానని అంటాడు.మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్లిపోమని హెచ్చరిస్తాడు. దీంతో యువరాజు అక్కడి నుంచి వెళ్లిపోగా....కేదార్‌ తండ్రిని ఇంట్లోకి తీసుకెళ్తాడు.ఇప్పుడు నీకళ్లు చల్లబడ్డాయా అని నిషిక జగధాత్రితో అంటుంది. ఆ విషయం తర్వాత మాట్లాడుకుందాం కానీ.ముందు నాకు ఇచ్చిన మాట ఏం చేశావని ధాత్రి నిలదీస్తుంది. నీకు కడుపు లేదన్న సంగతి నువ్వు చెబుతావా..లేక నన్ను చెప్పమంటావా అని అంటుంది. నువ్వు చెబితే నిజం ఒప్పుకున్నట్లు అవుతుందని...నేను చెబితే మోసాన్ని బయట పెట్టినట్లు అవుతుందని అంటుంది. మధ్యాహ్నం వరకు సమయం ఇవ్వమని నిషిక అంటుంది.

కొత్త ప్రాజెక్ట్‌కు లీడ్‌రోల్‌ కోసం కౌషికి ఆలోచిస్తుంటుంది. సుధాకర్‌ ఇప్పుడు నేను నడవలేనిస్థితిలో ఉన్నాను కాబట్టి మీ పిన్నిని పెడదామని అంటాడు. మనం వెనక ఉండి చూసుకుందామని చెబుతాడు. ప్రాజెక్ట్‌ ప్రారంభం కాబోయే ముందే ఏం తెలియని పిన్నిని పెడితే మన ఇన్వెస్టర్లతోపాటు బోర్డుసభ్యులు ఒప్పుకోరని అంటుంది. ఇప్పుడు ఏం చేద్దామని అనగా....కౌషికి కేదార్‌ వైపు చూసి కేదార్‌ను పెడదామని అడుగుతుంది. నాకు ఏం తెలుసునని అంటాడు. జగధాత్రి కూడా ఒప్పుకోమని అంటుంది. నేను నాన్నతో నవ్వుతూ మాట్లాడితేనే యువరాజు ఎంత గొడవ చేశాడో చూశావు కదా అక్క...ఇప్పుడు వాడిని కాదని ఇంత పెద్ద రోల్‌ నాకు ఇస్తే ఖచ్చితంగా గొడవ చేస్తాడని అంటాడు.కాబట్టి ప్రాజెక్ట్‌ యువరాజుకు అప్పగించమని చెబుతాడు. వాడికి ఆవేశం తప్ప....ఆలోచన లేదని ఇంత పెద్ద ప్రాజెక్ట్‌ వాడిని నమ్మి వాడి చేతులో పెట్టలేమని చెబుతుంది.నేనే ఏదో ఒకటి ఆలోచిస్తానులే అని అంటుంది. మీ నాన్నకు దగ్గరయ్యేందుకు వచ్చిన అవకాశం ఎందుకు వదులుకున్నావని జగధాత్రి కేదార్‌ను అడగ్గా....వాడు నాన్నను ఏమైనా చేస్తాడేమోనన్న భయంతోనే వద్దని చెప్పానని అంటాడు.

నిషిక కడుపు జగధాత్రి వల్లే పోయిందని అందరినీ నమ్మించడానికి యువరాజు నాటకం ఆడతాడు. నిషిక ఫోన్ మాట్లాడుతూ వస్తుండగా....కరెంట్ వైర్ దారిలో వేస్తాడు. నిషిక అది తొక్కుతుందేమోనని భయపడి జగధాత్రి ఆమెను పక్కకు నెట్టివేస్తుంది.వెళ్లి కుర్చీలపై పడిపోయిన నిషిక...కడుపు నొప్పి అంటూ నాటకం ఆడుతుంది. డాక్టర్‌ను బెదిరించి ధాత్రి నెట్టడం వల్లే కడుపుపోయిందని చెప్పమని చెబుతారు. డాక్టర్‌ పరీక్షించి...నిషికకు అబార్షన్ అయ్యిందని అబద్ధం చెప్పడంతో కౌషికి, సుధాకర్‌ షాక్‌ తింటారు.