<p>Jagadhatri Serial Today Episode: ఇంద్రాణికి ఇవ్వాల్సిన డబ్బులు మొత్తం ఇచ్చేసి ఇంద్రాణిని బయటకు వెళ్లిపోవాలని కౌషికి హెచ్చరిస్తుంది. నీ కళ్లలో బాధ చూడాలన్న నా ఆశ తీరడం లేదనుకుంటూ ఇంద్రాణి ఇక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఆ తర్వాత నిషిక ఏదో చెప్పబోతుండగా...కౌషికి ఆమె చెంప పగులగొడుతుంది. ఇంకోసారి ఈఇంటి పరువును శత్రువుల వద్ద తాకట్టు పెడితే చంపేస్తానంటూ మండిపడుతుంది. వైజయంతి అడ్డురాగా....మీరే ఇలా వెనకేసుకొచ్చి సగం చెడగొట్టారని ఆమెపై ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఈఇంట్లో నీకు ఏమి తక్కువ అయ్యయాని ఇలాంటి పనిచేశావని సుధాకర్‌ కోడలిని నిలదీస్తాడు..నాకు ఇంట్లో అన్నీ తక్కువే అయ్యాయి మామయ్య అంటుంది. ఇంట్లో ఏం చేయాలన్నా అందిరి పర్మిషన్లు తీసుకోవాలి అని అంటుంది. మిమ్మల్ని డబ్బులు అడిగితే ఏవో కారణాలు చెప్పారు.మరి ఏం చేయమంటారు అని నిలదీస్తుంది. మీరు ఇవ్వరు..నేను కూడా తెచ్చుకోకూడదా అని అంటుంది. ఇంద్రాణిని అప్పు అడిగే బదులు...వదినను అడిగితే ఇచ్చేది కదా అని జగధాత్రి అంటుంది. తప్పు నాదే కాదు..మీది కూడా ఉందంటూ కోపంగా లోపలికి వెళ్లిపోతుంది.మాటలతో మందలించకుండా చేయిచేసుకున్నావు ఎందుకు అని వైజయంతి కౌషికిని అంటుంది. ఆమె కూడా కోడలి వెంట లోపలికి పరుగు పెడుతుంది. నిషిక డబ్బులు తీసుకున్న విషయం నీకు ముందే తెలుసా అని యువరాజును కౌషికి నిలదీస్తుంది. తెలుసు అని అంటాడు. అందరూ యువరాజును కూడా తిట్టి లోపలికి వెళ్లిపోతారు.</p>
<p> ఇంట్లో కోపంతో రగిలిపోతున్న భార్యను యువరాజు ఓదార్చుతాడు. ఇంద్రాణి దగ్గర డబ్బులు తీసుకోవడం మన తప్పేనని అంటాడు. ఇంతలో వైజయంతి అక్కడికి వచ్చి ఇంద్రాణిపై కోపం కౌషికి నీపై చూపిందిలే...ఇవన్నీ పట్టించుకోవద్దని అంటుంది. ఇంంకా ఎన్నాళ్లు ఇలా ఉండాలమ్మా అని యువరాజు అంటాడు. జగధాత్రి వాళ్లను నెత్తిన పెట్టుకుని మమ్మల్ని మాత్రం శత్రువులుగా చూస్తోంది అంటాడు. ఇంతలో కోడలు కూడా అత్తపై మండిపడుతుంది.ఆ కేదార్‌,జగధాత్రి ఇంట్లో ఉండకపోతే...నేను వాళ్లతో పోటీపడటానికి ఆ ఇంద్రాణితో చేతులు కలిపేదాన్ని కాదు కదా అంటుంది. నేను మీ సంతోషం కోసమే కదా అన్ని చేస్తాను అనగా....మా సంతోషం కోసమే పెళ్లికి ముందు ఆ శ్రీవల్లిని కన్నారా అని అనడంతో...వైజయంతికి కోపం వస్తుంది. మామయ్య చేసిన ఘనకార్యం నుంచి ఎలా బయటపడాలి....వాళ్లను ఎలా బయటకు పంపాలని మేం చస్తుంటే...మీరు ఇంకో బిడ్డను తెచ్చి మా నెత్తిన పెట్టారంటుంది. మాకు దక్కాల్సిన ఆస్తి మేం ఎలా అయినా దక్కించుకుంటాం అంటుంది.</p>
<p>ఇంతలో కేదార్‌,జగధాత్రి భోజనం ప్లేట్ పట్టుకుని నిషిక రూమ్‌కు వస్తారు. నువ్వు భోజనం చేయలేదు కదా...అందుకే తెచ్చామని చెబుతారు. నాకు ఏ భోజనం వద్దు అంటుంది నిషిక. నువ్వు సిరికి నెక్లెస్ గిప్ట్‌గా ఇవ్వాలనుకోవడం తప్పుకాదని....కానీ అందుకోసం ఎవరికి చెప్పకుండా ఇంద్రాని వద్ద అప్పు చేయడమే తప్పని జగధాత్రి అంటుంది. నిషిక భోజనం తినిపించడానికి జగధాత్రి ట్రై చేస్తుంది. ఇంతలో ఆమెపైనే నిషిక మండిపడుతుంది. మీవల్లే ఇంట్లో మాకు గౌరవం లేకుండా పోయిందని తిడుతుంది. నీ ముఖం చూడాలంటేనే అసహ్యం వేస్తోందని ఇష్టానుసారం మాట్లాడుతుంది. అయినా సరే నిషికకు అన్నం తినిపించడానికి జగధాత్రి ట్రై చేయడంతో...అన్నం ప్లేట్ విసిరికొడుతుంది. నిన్ను చంపేస్తానంటూ జగధాత్రి గొంతు పట్టుకోగా....అప్పుడే అక్కడికి వచ్చిన ఆమె తండ్రి...నిషికపై చేయి ఎత్తుతాడు. జగధాత్రి ఆయన్ను ఆపుతుంది. వైజయంత్రి కూడా జగధాత్రి వల్లే నీ కూతురు ఇబ్బంది పడుతోందని చెప్పగా...ఆయన వారిస్తాడు. ఇంతలో నిషిక....నేను చెడు, అది మంచిదా అని నిలదీస్తుంది. మీ అక్క దేవత లాంటిదని చెబుతాడు. చిన్నప్పటి నుంచి నువ్వు జగధాత్రిని భాదపెడుతున్నా...అది నిన్ను ప్రేమిస్తూనే ఉందని చెబుతాడు. ఇదే కదా నువ్వు కోరున్నది అని నిషిక మళ్లీ జగధాత్రిని అంటుంది. నా వాళ్ల దగ్గర నున్ను చెడుగా చిత్రీకరించడమే కదా నువ్వు చేసేది అని అంటుంది. జరిగిందంతా నాకు తెలుసుని...తప్పు చేసింది నువ్వునని,అన్నం విసిరికొట్టినందుకు అక్కకు సారీ చెప్పమని నిషిక తండ్రి ఆదేశిస్తాడు. వైజయంతి,యువరాజు కూడా ఆమెకు నచ్చజెప్పడంతో నిషిక...జగధాత్రికి సారీ చెబుతుంది. కిందకు వచ్చి అన్నం తినమని జగధాత్రి అడుగుతుంది. దీంతో అందరూ కిందకు వస్తారు...</p>
<p> ఇంతలోసుధాకర్‌,కౌషికి కిందే ఉండటంతో నిషిక వాళ్ల తండ్రి వాళ్లను పలకరించి...అనాథ ఆశ్రమం ప్రారంభోత్సవానికి రావాలని ఆహ్వానిస్తాడు. తానే దగ్గర ఉండి కట్టించానని అనడంతో....మాకు చెప్పలేదేంటి నాన్న అని జగధాత్రి అడుగుతుంది. నీకు సర్‌ప్రైజ్ ఇద్దామనే చెప్పలేదంటాడు. ఏంటదని అడగ్గా...ఆశ్రమానికి మీ అమ్మ పేరు పెట్టానని చెబుతాడు. ఆవిడ మన ఇంటి పరువు తీసినందుకా ఎందుకు ఆమె పేరు పెట్టారని నిషిక నిలదీస్తుంది. మంచి జరిగేప్పుడు ఈ డిస్కషన్‌ ఎందుకు మీరు వెళ్లిరండి మేమంతా ఉదయమే వస్తామని సుధాకర్‌ చెప్పడంతో నిషిక తండ్రి అక్కడ నుంచి వెళ్లిపోతాడు.</p>