Iran War Updates: ట్రంప్ గాలి తీసేసిన ఇరాన్ -చర్చలే జరగడం లేదని ప్రకటన - అమెరికా అధ్యక్షుడిది మైండ్ గేమేనా?
3 weeks ago 4
ARTICLE AD
Iran says no talks with US: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన శాంతి చర్చల  ప్రకటనను ఇరాన్ అధికారిక మీడియా సంస్థ తస్నీమ్ (Tasnim) తీవ్రంగా ఖండించింది. ట్రంప్ వ్యాఖ్యలు కేవలం పశ్చాత్తాపం లేదా దౌత్యం కాదని, అవి అత్యంత ప్రమాదకరమైన మానసిక యుద్ధం (Psychological Warfare  అని ఇరాన్ అభివర్ణించింది. అమెరికాతో ఎటువంటి చర్చలు జరగలేదని, అసలు చర్చలు జరిపే ప్రసక్తే లేదని ఇరాన్ స్పష్టం చేసింది.
చర్చల వార్తలను కొట్టిపారేసిన ఇరాన్!
ట్రంప్ ప్రకటన ఒక  మైండ్ గేమ్
ఇరాన్ ఇంధన వనరులపై దాడులను ఐదు రోజుల పాటు వాయిదా వేస్తున్నట్లు ట్రంప్ ప్రకటించడం వెనుక శాంతి కాంక్ష లేదని, అది కేవలం భయంతో తీసుకున్న నిర్ణయమని ఇరాన్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.  ఒకవేళ మా విద్యుత్ కేంద్రాలపై దాడులు జరిగితే, పశ్చిమాసియాలోని అన్ని ఇంధన మౌలిక సదుపాయాలను నాశనం చేస్తాం అని ఇరాన్ హెచ్చరించిన తర్వాతే ట్రంప్ ఒక మెట్టు దిగి వచ్చారని ఆ దేశ మీడియా పేర్కొంది. ఇరాన్ ఎదురుదాడికి భయపడే అమెరికా ఈ  చర్చల  డ్రామాను తెరపైకి తెచ్చిందని  ఇరాన్ అంటోంది.
IRAN FOREIGN MINISTRY SAYS NO TALKS WITH WASHINGTON; ACCUSES U.S. PRESIDENT OF BUYING TIME AS REGIONAL DE-ESCALATION EFFORTS CONTINUE
— First Squawk (@FirstSquawk) March 23, 2026
ముఖ్యంగా అంతర్జాతీయంగా కీలకమైన స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్  విషయంలో ఇరాన్ తన పట్టును సడలించే ప్రసక్తే లేదని తస్నీమ్ వార్తా సంస్థ కుండబద్దలు కొట్టింది. యుద్ధానికి ముందు ఉన్న పరిస్థితులు ఇప్పట్లో పునరుద్ధరించేది లేదని, ఇంధన మార్కెట్లు అస్థిరంగానే ఉంటాయని ఇరాన్  ప్రకటిచింది.  అమెరికా తన సైనిక బలగాలను వెనక్కి తీసుకోనంత వరకు, బెదిరింపులు ఆపనంత వరకు ఎటువంటి చర్చలకు తావులేదని ఇరాన్ సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ స్పష్టం చేసింది.
ట్రంప్ ఒకవైపు  శాంతి అని చెబుతుంటే, ఇరాన్ మాత్రం అది  అబద్ధం  అని కొట్టిపారేయడం పశ్చిమాసియాలో గందరగోళాన్ని మరింత పెంచింది. ఈ ఐదు రోజుల గడువులో నిజంగానే తెరవెనుక చర్చలు జరుగుతున్నాయా లేక యుద్ధానికి సిద్ధపడేందుకు ఇరు దేశాలు సమయం తీసుకుంటున్నాయా అనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది. ఇరాన్ తన హెచ్చరికలను మరింత తీవ్రం చేయడంతో, మున్ముందు ఇజ్రాయెల్ ,  అమెరికా స్పందన ఎలా ఉంటుందో చూడాలి.
Read Entire Article