IPL 2026 RR VS SRH Live Updates: ఐపీఎల్ 2026లో స‌న్ రైజర్స్ హైద‌రాబాద్ కు భారీ టార్గెట్ ఎదురైంది. శ‌నివారం డ‌బుల్ హెడ‌ర్ లో భాగంగా జైపూర్ లో జ‌రుగుతున్న ఈ మ్యాచ్ లో ఆతిథ్య రాజ‌స్థాన్ రాయ‌ల్స్ భారీ స్కోరు సాధించింది. అంత‌కుముందు టాస్ ఓడి ఫ‌స్ట్ బ్యాటింగ్ చేసిన రాయ‌ల్స్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 6 వికెట్ల‌కు 228 ప‌రుగులు చేసింది. కుర్ర విధ్వంస‌క ఓపెన‌ర్ వైభ‌వ్ సూర్య‌వంశీ స్ట‌న్నింగ్ సెంచ‌రీ (37 బంతుల్లో 103, 5 ఫోర్లు, 12 సిక్స‌ర్లు) తో టాప్ స్కోర‌ర్ గా నిలిచాడు. బౌల‌ర్ల‌లో ఇషాన్ మలింగాకు రెండు వికెట్లు ద‌క్కాయి. గ‌తంలో పంజాబ్ కింగ్స్ పై 240+ ప‌రుగుల టార్గెట్ చేసిన అనుభ‌వం స‌న్ కు ఉండ‌టంతో ఈ మ్యాచ్ లో కూడా అదే ఫీట్ ను పునరావృతం చేయాల‌ని ఆరెంజ్ ఆర్మీ అభిమానులు ఆశిస్తున్నారు. మ‌రోవైపు టోర్నీలో చెరో ఏడు మ్యాచ్ లు ఆడిన స‌న్, రాయ‌ల్స్.. ఐదు విజ‌యంల‌తో రాజస్థాన్ నాలుగో స్థానంలో 4 విజ‌యాల‌తో మూడో స్థానంలో నిలిచాయి.

Ruthless with the bat, all heart with the celebration! 🫶

An outrageous 3️⃣6️⃣-ball HUNDRED from Vaibhav Sooryavanshi 👏

Updates ▶️ https://t.co/PVdpjhxVEy#TATAIPL | #KhelBindaas | #RRvSRH | @rajasthanroyals pic.twitter.com/P8Hu3eMFcG

— IndianPremierLeague (@IPL) April 25, 2026

వైభ‌వ్ దూకుడు..
స‌న్ రైజర్స్ తో జ‌రిగిన గ‌త మ్యాచ్ లో డ‌కౌటైన వైభ‌వ్ సూర్య‌వంశీ, ఈ మ్యాచ్ లో ప్ర‌తీకారం తీర్చుకున్నాడు. సిక్స‌ర్ల‌తో ఆకాశ‌మే హ‌ద్దుగా చెల‌రేగాడు. త‌న ఇన్నింగ్స్ లో బౌండ‌రీల కంటే సిక్స‌ర్లే అధికంగా ఉండ‌టం విశేషం. వైభ‌వ్ ఐదు ఫోర్లు మాత్ర‌మే కొట్ట‌గా, ఏకంగా 12 సిక్సర్ల‌తో చెల‌రేగాడు. అయితే అంత‌కుముందు ఆరంభంలోనే య‌శ‌స్వి జైస్వాల్ (10) ని ఔట‌వ‌గా, అయిన‌ప్ప‌టికీ వైభ‌వ్ జోరు త‌గ్గ‌లేదు. ధ్రువ్ జురేల్ (35 బంతుల్లో 51, 8 ఫోర్లు, 1 సిక్స‌ర్) తో క‌లిసి అద్భుత‌మైన భాగ‌స్వామ్యం నెల‌కొల్పాడు. మెజారిటీ బ్యాటింగ్ త‌ను తీసుకుని, స‌న్ బౌలర్ల‌ను చిత‌క్కొట్టాడు. ఈ సీజ‌న్ లో ఒక్క సిక్స‌ర్ కూడా స‌మ‌ర్పించుకోని స‌న్ పేస‌ర్ స‌కీబ్ అహ్మ‌ద్ ను వైభ‌వ్ ఆటాడుకున్నాడు. సిక్స‌ర్ల‌తో ఆటాడుకున్నాడు. దీంతో ప‌వ‌ర్ ప్లేలో 76 ప‌రుగులు పిండుకుంది. ఈ క్ర‌మంలో 15 బంతుల్లోనే వైభ‌వ్ అర్ధ సెంచ‌రీ పూర్తి చేసుకున్నాడు. అదే జోరులో బౌలర్ల‌ను చితక్కొట్టి, 36 బంతుల్లో సెంచ‌రీ సాధించాడు. మ‌రో ఎండ్ లో 34 బంతుల్లో జురేల్ కూడా 34 బంతుల్లో ఫిఫ్టీ పూర్తి చేసుకుని, త‌ర్వాతి బంతికే వెనుదిరిగాడు.

పుంజుకున్న బౌల‌ర్లు..
త‌ర్వాత ఓవ‌ర్లోనే వైభ‌వ్ ఔట్ కావ‌డంతో స‌న్ బౌల‌ర్లు కాస్త రాయ‌ల్స్ కు ముకుతాడు వేశారు. ఫామ్ లో లేని కెప్టెన్ రియాగ్ ప‌రాగ్ (7)ను స‌న్ కెప్టెన్ పాట్ కమిన్స్ బౌల్డ్ చేశాడు. ఆ త‌ర్వాత డోనోవాన్ ఫెరీరా (33) ఉన్నంత సేపు వేగంగా ఆడ‌గా, ఆఖ‌ర్లో షిమ్రాన్ హిట్ మెయ‌ర్ (5) త్వ‌ర‌గా వెనుదిరిగాడు. దీంతో అనుకున్న దానికంటే రాయల్స్ కాస్త తక్కువగా స్కోరుకే పరిమితమైంది. ఈ మ్యాచ్ లో సెంచరీతో వైభవ్ ఆరెంజ్ క్యాప్ ను సొంతం చేసుకున్నాడు.