IPL 2026 Final RCB vs GT Live Score Update: ఐపీఎల్ 2026 లీగ్ ముగింపు దశకు వచ్చేసింది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), గుజరాత్ టైటాన్స్ (GT) జట్ల మధ్య హై-వోల్టేజ్ ఫైనల్ మ్యాచ్ రంజుగా సాగుతోంది. ఈ ప్రతిష్టాత్మక మ్యాచ్ లో టాస్ గెలిచిన బెంగళూరు కెప్టెన్ రజత్ పాటిదార్ ఫస్ట్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీంతో ఫ‌స్ట్ బ్యాటింగ్ చేసిన‌ గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో జీటీ 8 వికెట్ల‌కు 155 ప‌రుగులు చేసింది. స్పిన్ ఆల్ రౌండ‌ర్ వాషింగ్ట‌న్ సుంద‌ర్ స్ట‌న్నింగ్ ఫిఫ్టీ (37 బంతుల్లో 50 నాటౌట్, 5 ఫోర్లు ) సూపర్బ్ బ్యాటింగ్ తో అద్భుత ప్ర‌ద‌ర్శ‌న చేశాడు. బౌల‌ర్ల‌లో ర‌సిక్ స‌లామ్ కు మూడు వికెట్లు ద‌క్కాయి.

Read Also: IPL 2026 GT vs RCB Grand Final: బ్యాక్ టూ బ్యాక్ టైటిల్ పై ఆర్సీబీ గురి.. ఫైన‌ల్లో జీటీని త‌క్కువ స్కోరుకే ప‌రిమితం.. రాణించిన వాషింగ్ట‌న్, ర‌సిక్

రూ. 20 కోట్ల భారీ ప్రైజ్ మనీ..

ఈ సీజన్ లో కూడా BCCI గత ఏడాది లాగే భారీ ప్రైజ్ మనీ స్ట్రక్చర్ ను కంటిన్యూ చేస్తోంది. ఈ ఫైనల్ మ్యాచ్ లో ఛాంపియన్ గా నిలిచే టీమ్ కు రూ. 20 కోట్ల క్యాష్ రివార్డ్ దక్కుతుంది. అలాగే ఫైనల్ లో ఓడి రన్నరప్ గా నిలిచే జట్టుకు రూ. 12.5 కోట్ల ప్రైజ్ మనీ అందుతుంది. లీగ్ లో మూడో స్థానంలో నిలిచిన పంజాబ్ కింగ్స్ కు కూడా భారీ మొత్తమే దక్కనుంది. టీమ్ అవార్డులతో పాటు అద్భుతమైన పర్ఫార్మెన్స్ చూపించిన‌ ఇండివిడ్యువల్ ప్లేయర్లకు కూడా బోర్డు ప్రత్యేక క్యాష్ ప్రైజ్ లు ఇవ్వనుంది.

🚨 IPL 2026 AWARDS & PRIZE MONEY WINNERS 🚨

🟠 Orange Cap – Vaibhav Suryavanshi – ₹10 Lakh

🟣 Purple Cap – Kasigo rabada (GT) – ₹10 Lakh

🏅 4th Place – Rajasthan Royals (RR) – ₹6.5 Crore

🥉 3rd Place – Sunrisers Hyderabad (SRH) – ₹7 Crore

🥈 Runners-Up – Gujarat Titans… pic.twitter.com/v9em8cd1Qz

— Muffatball vikrant (@Vikrant_1589) May 31, 2026

ఆరెంజ్, పర్పుల్ క్యాప్ రేసు.. ఎమర్జింగ్ ప్లేయర్ గా సూర్యవంశీకి ఛాన్స్

టోర్నమెంట్ లో అత్యధిక రన్స్ చేసిన ప్లేయర్ కు ఇచ్చే ఆరెంజ్ క్యాప్ విన్నర్ కు రూ. 10 లక్షల ప్రైజ్ మనీ దక్కుతుంది. ప్రస్తుతం రాజస్థాన్ రాయల్స్ వండర్ కిడ్ వైభవ్ సూర్యవంశీ 776 రన్స్ తో టాప్ లో ఉన్నాడు.అలాగే అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ కు ఇచ్చే పర్పుల్ క్యాప్ తో పాటు రూ. 10 లక్షలు అందుతాయి. గుజరాత్ పేసర్ కాగిసో రబడా 28 వికెట్లతో తీయ‌గా, ఆర్‌సీబీ బౌలర్ భువనేశ్వర్ కుమార్ ఖాతాలో అన్నే వికెట్లు ఉన్నాయి . మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ కు రూ. 10 లక్షలు, ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్ కు రూ. 20 లక్షలు దక్కనున్నాయి.