చండీగఢ్: IPL 2026లో లీగ్ స్టేజీలో భాగంగా ఈరోజు డబుల్ హెడర్ ఉంది. మొదటి మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ (Punjab Kings), సన్ రైజర్స్ హైదరాబాద్ (Sunrisers Hyderabad) మధ్య జరగనుండగా, శనివారం రాత్రి చెన్నై సూపర్ కింగ్స్ (CSK), ఢిల్లీ క్యాపిటల్స్ (DC) తలపడనున్నాయి. ఈ సీజన్లో 10 జట్లు కనీసం 3 మ్యాచ్‌లు ఆడేశాయి. ఈ క్రమంలో జట్ల బలాబలాలతో పాటు బలహీనతలు బయటపడుతున్నాయి.

లక్నో సూపర్ జెయింట్స్ LSGకి చెందిన ముకుల్ చౌదరి గత మ్యాచ్‌లో ఓడిపోయే పరిస్థితి నుంచి తప్పించి అద్భుత ఇన్నింగ్స్‌తో జట్టును గెలిపించగా, RRకి చెందిన వైభవ్ సూర్యవంశీ మొదటి బంతి నుంచే అంతర్జాతీయ స్టార్ బౌలర్లపై విరుచుకుపడుతున్నాడు. గత మ్యాచ్‌ను మినహాయిస్తే, RCB బౌలింగ్, బ్యాటింగ్ రెండు విభాగాల్లో రాణిస్తోంది. అత్యధికంగా టైటిల్స్ గెలిచిన జట్లు ముంబై ఇండియన్స్ MI, చెన్నై సూపర్ కింగ్స్ CSKలకు ఆరంభం అంతగా కలిసిరాలేదు. లీగ్ స్టేజీ సగం కూడా పూర్తికాకుండానే శ్రీలంక మాజీ కెప్టెన్ ఏంజెలో మాథ్యూస్ జోస్యం చెప్పాడు. తన ప్రకారం ఏ జట్టు ఖచ్చితంగా ఫైనల్‌కు చేరుకుంటుందో ఎక్స్ ఖాతాలో వెల్లడించారు.

Rajasthan will be in this years IPL final !

— Angelo Mathews (@Angelo69Mathews) April 10, 2026

రాజస్థాన్ రాయల్స్ IPL 2026లో ఇప్పటివరకూ ఆడిన 4 మ్యాచ్‌లలో విజయం సాధించింది. వీళ్లు కాకుండా ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఏ మ్యాచ్ ఓడిపోని ఏకైక జట్టు పంజాబ్ కింగ్స్. పంజాబ్ 3 మ్యాచ్‌లలో 2 గెలవగా, ఒక మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది.

రెండో IPL టైటిల్ కోసం రాజస్థాన్ నిరీక్షణ

IPL 2008లో ప్రారంభం కాగా, షేన్ వార్న్ కెప్టెన్సీలో రాజస్థాన్ రాయల్స్ ఐపీఎల్ మొదటి సీజన్‌ ట్రోఫీ గెలుచుకుంది. ఆ తర్వాత ఒక్కసారి మాత్రమే ఆ జట్టు ఫైనల్ వరకు చేరుకోగలిగింది. సంజూ శాంసన్ కెప్టెన్సీలో రాజస్థాన్ 2022లో ఫైనల్ చేరినప్పటికీ, టైటిల్ పోరులో గుజరాత్ టైటాన్స్ (Gujarat Titans) చేతిలో ఓడిపోయింది.

ఏంజెలో మాథ్యూస్ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ Xలో ఐపీఎల్ ఫైనలిస్ట్ జట్టుపై అంచనా వేశాడు. 'ఈ ఏడాది రాజస్థాన్ రాయల్స్ ఖచ్చితంగా IPL 2026 ఫైనల్‌కు చేరుకుంటుంది' అని చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. రాజస్థాన్ జట్టు ఈ సీజన్లో ఎంత ప్రమాదకరమైన జట్టుగా కనిపిస్తోందో ఈ పోస్ట్ తెలియజేస్తోంది. ఈ జట్టు ఓపెనర్లు యశస్వి జైస్వాల్, టీనేజీ సంచలనం వైభవ్ సూర్యవంశీ దిగ్గజ బౌలర్లపై విరుచుకుపడుతున్నారు. ముంబై ఇండియన్స్‌పై జట్టు 11 ఓవర్లలోనే 150 పరుగులు చేయగా, RCBపై 202 పరుగుల లక్ష్యాన్ని రాజస్థాన్ జట్టు 12 బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది. జట్టు విజయంలో ఓపెనర్లది కీలకపాత్ర. బౌలర్లు సైతం కీలక సమయాల్లో వికెట్లు తీసి ప్రత్యర్థి బ్యాటర్లను ఇబ్బంది పెడుతున్నారు.

బాగానే చెప్పావు. కానీ అంత త్వరగా డిసైడ్ అవ్వడం సరికాదని ఇతర జట్ల ఫ్యాన్స్ స్పందిస్తున్నారు.