IPL 2026 CSK VS SRH Latest Updates: సొంత‌గ‌డ్డ‌పై జ‌రుగుతున్న లీగ్ మ్యాచ్ లో మాజీ చాంపియ‌న్ స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ బ్యాటింగ్ లో ఫర్వాలేదనిపించింది. స్థానిక ఉప్ప‌ల్ రాజీవ్ గాంధీ స్టేడియంలో శ‌నివారం చెన్నై సూప‌ర్ కింగ్స్ తో జ‌రిగిన మ్యాచ్ లో ఓ మాదిరి స్కోరు సాధించింది. టాస్ ఓడి ఫ‌స్ట్ బ్యాటింగ్ చేసిన స‌న్ రైజ‌ర్స్ నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 9 వికెట్ల‌కు 194 ప‌రుగులు చేసింది. ఓపెన‌ర్ అభిషేక్ శ‌ర్మ (22 బంతుల్లో 59, 6 ఫోర్లు, 4 సిక్స‌ర్లు), మిడిలార్డ‌ర్ బ్యాట‌ర్ హెన్రిచ్ క్లాసెన్ (39 బంతుల్లో 59, 6 ఫోర్లు, 2 సిక్స‌ర్లు) తో టాప్ స్కోర‌ర్లుగా నిలిచారు. బౌల‌ర్ల‌లో జామీ ఓవ‌ర్ట‌న్, అన్షుల్ కాంబోజ్ మూడు వికెట్ల‌తో స‌త్తా చాటాడు. కాంబోజ్ కు ప‌ర్పుల్ క్యాప్ ద‌క్కింది. ఇక టోర్నీలో చెరో 5 మ్యాచులు ఆడిన చెన్నై, స‌న్.. చెరో రెండు విజ‌యాల‌తో వ‌రుస‌గా 6, 8వ స్థానంలో నిలిచాయి.

A dependable 5⃣9⃣(39) 🔥

Heinrich Klaasen with yet another crucial knock 🧡

Did you have him in your Fantasy XI? 🤔

Updates ▶️ https://t.co/uJG04r8iXD #TATAIPL | #KhelBindaas | #SRHvCSK | @SunRisers pic.twitter.com/rj1cLCV97R

— IndianPremierLeague (@IPL) April 18, 2026

అభిషేక్ ఊచకోత‌..
ఇక టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగ‌గానే అంచ‌నాల‌కు త‌గిన‌ట్లుగానే ఓపెన‌ర్లు అభిషేక్, ట్రావిస్ హెడ్ (23) శుభారంభాన్నిచ్చారు. ఒక ఎండ్ లో హెడ్ నెమ్మ‌దిగా ఆడ‌గా, మ‌రో ఎండ్ లో మాత్రం అభిషేక్ విధ్వంసం సృష్టించాడు. తొలి ఓవ‌ర్లో నాలుగు ప‌రుగుల‌తో ఆచితూచి ఇన్నింగ్స్ ప్రారంభించిన స‌న్.. ఆ త‌ర్వాత ఓవ‌ర్ నుంచి దూకుడు స్టార్ట్ చేసింది. త‌ర్వాత ఓవ‌ర్లో సిక్స‌ర్ తో ట‌చ్ లోకి వ‌చ్చిన అభిషేక్, త‌ర్వాత బౌండ‌రీల‌తో రెచ్చిపోయాడు. కాంభోజ్ బౌలింగ్ లో వ‌రుస ఫోర్ల‌తో 15 బంతుల్లోనే అర్ధ సెంచ‌రీ పూర్తి చేసుకున్నాడు. అయితే ప‌వ‌ర్ ప్లే ఆఖ‌రి ఓవ‌ర్లో హెడ్, ఇషాన్ డ‌కౌట్ కావ‌డంతో ఒక్క‌సారిగా రెండు వికెట్లు ప‌డ్దాయి. ఓవ‌రాల్ గా ప‌వ‌ర్ ప్లేలో 75 ప‌రుగుల‌ను పిండుకుంది.

క్లాసెన్ ధ‌మాకా..
ఏడో ఓవ‌ర్లో బ్యాటింగ్ కు దిగిన క్లాసెన్ ఆరంభంలో ఆచి తూచి ఆడినా, ఆ త‌ర్వాత బ్యాట్ ఝ‌లిపించాడు. ఇక ఫిఫ్టీ అయిన త‌ర్వాత కాసేపటికే అభిషేక్ ఔట‌య్యాడు. త‌ర్వాత అనికేత్ వ‌ర్మ (2) కూడా విఫ‌ల‌మ‌య్యాడు. ఈ ద‌శ‌లో నితీశ్ కుమార్ రెడ్డి (12) తో క‌లిసి క్లాసెన్ జ‌ట్టును ఆదుకునే ప్ర‌య‌త్నం చేసింది. చిన్న పార్ట్న‌ర్ షిప్ నమోదు చేసింది. ఇక క్రీజులో కుదురుకున్నాక‌, క్లాసెన్ బౌండ‌రీలతో అద‌ర‌గొట్టాడు. ఈ క్ర‌మంలో 32 బంతుల్లో అర్ధ సెంచ‌రీ పూర్తి చేసుకున్నాడు. అయితే కీల‌క‌ద‌శ‌లో వికెట్లు కోల్పోవ‌డంతోపాటు క్లాసెన్ కూడా ఔట్ కావ‌డం జ‌ట్టు భారీ స్కోరుపై ప్ర‌భావం చూపించింది. స‌లీల్ అరోరా (13), ఇంపాక్ట్ ప్లేయ‌ర్ లివింగ్ స్ట‌న్ (1) విఫ‌ల‌మ‌య్యారు. ముఖేశ్ చౌద‌రీకి రెండు వికెట్లు ద‌క్కాయి. ఓవరాల్ గా మంచి బౌలింగ్ తో సన్ ను చెన్నై నిలువరించగలిగింది అనడంలో సందేహం లేదు.