మీరు ఆపిల్ ఐఫోన్ కొనాలనుకుంటున్నారా.. అయితే సాధారణంగా ధర చాలా ఎక్కువ అని వాయిదా వేస్తుంటారు. అయితే ప్రస్తుతం ఐఫోన్ కొనుగోలు చేసి వేల రూపాయలు ఆదా చేసుకునే అవకాశం లభించింది. 2024లో లాంచ్ అయిన iPhone 16 Plus ఇప్పుడు అద్భుతమైన డిస్కౌంట్‌తో మార్కెట్లోకి వచ్చింది. పెద్ద స్క్రీన్, పవర్‌ఫుల్ A18 చిప్‌సెట్, డ్యూయల్ కెమెరా సెటప్ ఉన్న ఈ ఐఫోన్‌ను ఇంత తక్కువ ధరకు కొనే అవకాశం ఇప్పట్లో మళ్లీ రాదు. ప్రస్తుతం విజయ్ సేల్స్‌లో ఇది రూ. 21,000 తగ్గింపుతో లిస్ట్ చేశారు. ఈ ఐఫోన్ 16 ప్లస్ స్పెసిఫికేషన్లు ఏంటి, ఈ డీల్‌ను ఎలా పొందాలో ఇక్కడ తెలుసుకుందాం.

ఐఫోన్ 16 ప్లస్ (iPhone 16 Plus) స్పెసిఫికేషన్లు
ఈ ఆపిల్ ఫోన్ iPhone 16 Plusలో 6.7 అంగుళాల బిగ్ Super Retina XDR OLED డిస్‌ప్లే వస్తుంది. ఇందులో యాపిల్ కంపెనీ ఫాస్టెస్ట్ అయిన A18 చిప్‌సెట్ అందించారు. ఇది యాపిల్ ఇంటెలిజెన్స్ ఫీచర్లు, మల్టీటాస్కింగ్‌ను సులువుగా హ్యాండిల్ చేస్తుంది. అల్యూమినియం ఫ్రేమ్‌తో కూడిన ఈ ఐఫోన్‌కు వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ విషయంలో IP68 రేటింగ్ లభించింది. ఫొటో, వీడియోగ్రఫీ కోసం దీని వెనుక భాగంలో డ్యూయల్ కెమెరా సెటప్ ఇచ్చారు. ఇందులో 48MP ప్రైమరీ లెన్స్, 12MP అల్ట్రావైడ్ సెన్సార్ ఉన్నాయి. ముందు భాగంలో 12MP కెమెరా అమర్చారు. ఈ ఫోన్ బ్యాటరీ 27 గంటల వరకు వీడియో ప్లేబ్యాక్ ఇస్తుందని ఆపిల్ కంపెనీ పేర్కొంది.

విజయ్ సేల్స్‌లో భారీ తగ్గింపు
iPhone 16 Plus భారత మార్కెట్లో రూ. 89,900 ధరతో లాంచ్ చేశారు. కానీ ప్రస్తుతం విజయ్ సేల్స్ అధికారిక వెబ్‌సైట్‌లో ఇది రూ. 71,890 కి లిస్ట్ అయింది. రూ. 18,000 కంటే ఎక్కువ డిస్కౌంట్ ఉన్న ఈ ఫోన్‌ను, HDFC క్రెడిట్ కార్డ్‌తో షాపింగ్ చేస్తే మరో రూ. 3,500 అదనపు తగ్గింపు లభిస్తుంది. దీంతో ఈ ఐఫోన్‌ 16పై మొత్తం రూ. 21,000 కంటే ఎక్కువ తగ్గింపు లభిస్తుంది.

Pixel 9a ధర భారీగా తగ్గింపు
గూగుల్ కొత్త మిడ్-రేంజ్ స్మార్ట్‌ఫోన్ Pixel 10a ప్రీ-ఆర్డర్‌లు ఫిబ్రవరి 18 నుండి ప్రారంభం కానున్నాయి. అంతకంటే ముందే, గూగుల్ ప్రస్తుత మోడల్ Pixel 9a విక్రయాలపై ఫోకస్ చేసి, ఫోన్ ధర భారీగా తగ్గించింది. భారత మార్కెట్లో Pixel 9a 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 49,999, 256GB వెర్షన్ ధర రూ. 54,999 కి లాంచ్ అయ్యాయి. ఇప్పుడు ఈ రెండు వేరియంట్ల ధరలపై ఏకంగా రూ. 10,000 చొప్పున డిస్కౌంట్ ప్రకటించారు. దీంతో గూగుల్ పీక్సెల్ 9ఏ 128 జీబీ వేరియంట్ రూ. 39,999కు, 256 జీబీ వేరియంట్ ను రూ. 44,999 కే కొనుగోలు చేయవచ్చు.