Investments for Child : పిల్లల ఫ్యూచర్​ కోసం పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా ? ఈ ఈక్విటీ ఫండ్స్​తో అధిక రాబడి మీ సొంతం

2 weeks ago 2
ARTICLE AD

Best Investment Plans for Your Kids Future : ఇంట్లో చిన్నారి అడుగుపెట్టగానే.. తల్లిదండ్రులు వారి భవిష్యత్తు గురించి కలలు కనడం ప్రారంభిస్తారు. అది మగపిల్లాడు అయినా ఆడపిల్ల అయినా. వారికి చదువుకోసం అయ్యే ఖర్చు నుంచి మొదలు పెడితే.. పెళ్లి వరకు అయ్యే ఖర్చుల గురించి పేరెంట్స్ ఆలోచిస్తూ ఉంటారు. దాని కోసం తమ సంపాదనలో కొంత భాగాన్ని ఆదా చేయడం కూడా ప్రారంభిస్తారు. అయితే, పొదుపు లేదా పెట్టుబడి అనేది ఎక్కువ రాబడిని ఇచ్చేది అయితే పిల్లల భవిష్యత్తు బాగుంటుంది. అలాగే తక్కువ రిస్క్ ఉండేవాటిలో పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. మరి సరైన పెట్టుబడిని ఎలా ఉంచుకోవాలో చూసేద్దాం.

ఈక్విటీ బెస్ట్ అంటోన్న నిపుణులు.. ఎందుకంటే

పిల్లల భవిష్యత్తు కోసం చేసే పొదుపు స్వల్పకాలికంగా ఉండదు. ఉండకూడదు. సాధారణంగా చాలామంది పిల్లల గురించి 5, 10 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం పెట్టుబడి పెడతారు. అలాంటప్పుడు మీరు ఈక్విటీ పెట్టుబడులు పెట్టొచ్చు. ఎందుకంటే ఇవి కాలం పెరిగే కొద్ది రిస్క్ తగ్గిస్తాయి. దీర్ఘకాలంలో ఈక్విటీ ఉత్తమ రాబడిని ఇస్తుందని ఆర్థికి నిపుణులు చెప్తారు.

మంచి షేర్లలో పెట్టుబడి పెట్టాలనుకుంటే.. పెట్టుబడిదారులు స్టాక్ మార్కెట్ గురించి పూర్తిగా తెలుసుకోవాల్సి ఉంటుంది. అలాగే మంచి వృద్ధిని కలిగి ఉన్న కంపెనీలను ఎంచుకోవడంలో నైపుణ్యం కలిగి ఉండాలి. ఒకవేళ ఇది సాధ్యం కాకపోతే పిల్లల చదువు లేదా వివాహం కోసం మంచి ట్రాక్ రికార్డ్ ఉన్న ఈక్విటీ మ్యూచువల్ ఫండ్లలో దీర్ఘకాలికంగా పెట్టుబడి పెట్టవచ్చు. ఈక్విటీ పెట్టుబడితో సంబంధం ఉన్న రిస్క్ కాలక్రమేణా తగ్గుతుందని ఇప్పటికే నిరూపించబడింది. కొన్ని మ్యూచువల్ ఫండ్ కంపెనీలు ప్రత్యేకంగా పిల్లల కోసం కొన్ని పథకాలను కూడా ప్రారంభించాయి. అవేంటో వాటివల్ల కలిగే బెనిఫిట్స్ ఏంటో చూసేద్దాం.

HDFC చిల్డ్రన్స్ గిఫ్ట్ ఫండ్ (HDFC Childrens Gift Fund)

HDFC మ్యూచువల్ ఫండ్ ఫిబ్రవరి 2001లో రెండు ఫండ్లను ప్రారంభించింది. దానిలో ఒకటి HDFC చిల్డ్రన్స్ గిఫ్ట్ ఫండ్. ఇది సేవింగ్స్ ప్లాన్. దీనిని అక్టోబర్ 18, 2017న క్లోజ్ చేసింది. రెండవది HDFC చిల్డ్రన్స్ గిఫ్ట్ ఫండ్ - గ్రోత్ ప్లాన్. HDFC చిల్డ్రన్స్ గిఫ్ట్ ఫండ్ గ్రోత్ ప్లాన్​లో 6 నెలల్లో 14.15 శాతం, 2 సంవత్సరాలలో 21.36 శాతం, 5 సంవత్సరాలలో 12.76 శాతం రాబడిని ఇచ్చింది.

SBI మాగ్నమ్ చిల్డ్రన్స్ బెనిఫిట్ ఫండ్ - ఇన్వెస్ట్మెంట్ ప్లాన్

పిల్లల భవిష్యత్తు కోసం రూపొందించిన SBI మాగ్నమ్ చిల్డ్రన్ బెెనిఫిట్స్ ఈక్విటీ ఫండ్.. 6 నెలల్లో 7.84 శాతం, 1 సంవత్సరంలో 4.59 శాతం, 2 సంవత్సరాలలో 51.27 శాతం రాబడిని ఇచ్చింది.

ICICI ప్రుడెన్షియల్ చైల్డ్ కేర్ ఫండ్- డైరెక్ట్ ప్లాన్

ICICI ప్రుడెన్షియల్ చైల్డ్ కేర్ ఫండ్ - డైరెక్ట్ ప్లాన్ పనితీరు కూడా సంతృప్తికరంగానే ఉంది. ఈ ఫండ్ 6 నెలల్లో 9.50 శాతం, సంవత్సరంలో 2.69 శాతం, 2 సంవత్సరాలలో 17.95 శాతం రాబడిని ఇచ్చింది. ఈ ఫండ్ 5 సంవత్సరాల రాబడి 10.09 శాతంగా ఉంది.

కాబట్టి మీరు ఇలాంటి ఈక్విటీల గురించి తెలుసుకుని.. మీ పిల్లలకోసం బడ్జెట్ ప్లానింగ్ చేసుకోవచ్చు. అయితే మీకు వీటిపై అవగాహన లేదు అనుకుంటే మాత్రం కచ్చితంగా ఆర్థిక నిపుణుల సలహాలు తీసుకుని ప్రారంభించండి. అప్పుడే మీరు మంచి రాబడిని పొందగలుగుతారు. మీ పిల్లల భవిష్యత్తును అందంగా తీర్చిదిద్దగలుగుతారు.

Read Entire Article