Indiramma Housing Scheme: అర్హులైన ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు, మే నెలాఖరుకు అర్హుల జాబితా: పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
2 weeks ago 3
ARTICLE AD
Ponguleti Srinivas Reddy | ఆసిఫాబాద్: తెలంగాణలో అర్హత కలిగిన ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర గృహ నిర్మాణ, రెవెన్యూ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఈ నెలాఖరు వరకు లబ్ధిదారుల జాబితా సిద్ధం చేయాలని అధికారులను ఆయన ఆదేశించారు. సీఎం రేవంత్ రెడ్డి కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పర్యటించనున్న క్రమంలో ఏర్పాటు చేయనున్న సభాస్థలి, రెబ్బెన మండలం కాగజ్ నగర్ ఎక్స్ రోడ్, కాగజ్ నగర్ మండలం దాదానగర్, కాగజ్ నగర్ పట్టణంలోని సిర్పూర్ పేపర్ మిల్ క్రీడా ప్రాంగణాన్ని బుధవారం రాష్ట్ర మంత్రి, జిల్లా ఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్సీ దండే విఠల్, జిల్లా కలెక్టర్ కె.హరిత, బెల్లంపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు గడ్డం వినోద్, అధికారులతో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. జూన్ 2వ తేదీ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆసిఫాబాద్ జిల్లాలో సభ నిర్వహిస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో అర్హత కలిగిన ప్రతి పేదవారికి ఇందిరమ్మ ఇల్లు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చేతుల మీదుగా లాంచనంగా ప్రారంభించనున్నారని తెలిపారు. పేదవాడి ఆత్మగౌరవానికి ప్రతీకగా ప్రభుత్వం ప్రతి నియోజకవర్గంలో 3 వేల 500 ఇండ్లు మంజూరు చేస్తున్నామని, ఏప్రిల్ నాటికి రాష్ట్ర వ్యాప్తంగా 1 లక్ష 20 వేల ఇండ్లు మంజూరయ్యాయని, జూన్ నాటికి 2 లక్షల 35 వేల ఇండ్లు పూర్తవుతాయని తెలిపారు.
Also Read: Bandi Sanjay: ఎక్కడైనా కొడుకును తండ్రి పోలీసులకు అప్పగిస్తాడా? ఫాల్తుగాళ్లు నాపై దుష్ప్రచారం చేపిస్తున్నారు: బండి సంజయ్
గత ప్రభుత్వ హయాంలో 10 సంవత్సరాలలో ఆర్భాటాలకే పరిమితమయ్యారని, ప్రజా ప్రభుత్వం వచ్చిన సంవత్సరం లోపు 4 లక్షల ఇల్లు 22 వేల 700 కోట్ల రూపాయలతో శ్రీకారం చుట్టి అర్హులైన ఇంటి నిర్మాణ స్థాయికి అనుగుణంగా దశలవారీగా రూ. 5 లక్షలు లబ్ధిదారుల ఖాతాలో జమ చేయడం జరుగుతుందని తెలిపారు. మొదటి, రెండవ విడతలలో మాత్రమే కాకుండా అర్హత గల  పేదవారందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరయ్యేలా కృషి చేస్తాం అన్నారు. ఆదివాసి జిల్లా కుమ్రంభీమ్ ఆసిఫాబాద్ లో జూన్ 2వ తేదీన జరగనున్నముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటనను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రులు పొంగులేటి, జూపల్లి కృష్ణారావు సంబంధి అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ఇందిరమ్మ ఇండ్ల పథకానికి కేంద్రం నుండి ఒక్కో ఇంటికి రావాల్సిన రూ.1.13 లక్షల వాటా నిధుల కోసం మార్చి నుండి ఎదురుచూస్తున్నామని మంత్రి పొంగులేటి తెలిపారు. కేంద్ర నిధుల నమ్మకంతోనే లబ్ధిదారుల ఫైనల్ బిల్లులో కొంత మొత్తం ఆపామన్నారు. మరో 15 రోజుల్లో కేంద్రం నిధులు విడుదల చేయకపోతే, ఆ మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే పూర్తిగా భరించి లబ్ధిదారులకు అందజేస్తుందని భరోసా ఇచ్చారు.
మొదటి విడత కింద మంజూరైన 3.5 లక్షల ఇండ్లలో 1.32 లక్షల ఇండ్ల నిర్మాణం పూర్తయిందని, జూన్ నెలాఖరుకల్లా మరో 68-72 వేల ఇండ్ల శ్లాబ్ పనులు పూర్తవుతాయని వెల్లడించారు. 40- 50 ఏళ్ల క్రితం పాత కాలనీల్లోని శిథిలావస్థ ఇండ్ల స్థానంలో కొత్త ఇండ్లు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నామని, నిర్మాణానికి అవసరమైన ఇసుక, మట్టిని ఉచితంగా అందించాలని అధికారులను ఆదేశించామని తెలిపారు.
Read Entire Article