లోక నాయకుడు కమల్ హాసన్ (Kamal Haasan), ప్రముఖ తమిళ దర్శకుడు శంకర్ (Director Shankar) కలయికలో వచ్చిన 'ఇండియన్' (తెలుగులో 'భారతీయుడు') తమిళ, తెలుగు భాషల్లో భారీ విజయం సాధించింది. మూడు దశాబ్దాల క్రితం ఆ సినిమా ఓ సంచలనం. ఆ సినిమా వచ్చిన 28 ఏళ్ళకు సీక్వెల్ చేశారు. అయితే, 'ఇండియన్ 2' (తెలుగులో 'భారతీయుడు 2') విడుదలకు ముందు ప్రేక్షకులలో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కానీ, విడుదల అయ్యాక డిజాస్టర్ రిజల్ట్ అనుకుంది. దాంతో 'భారతీయుడు 3' గురించి ఆడియన్స్ మర్చిపోయారు. ఇప్పుడు ఆ సినిమాను రిలీజుకు రెడీ చేస్తున్నారు.

'ఇండియన్ 2' విడుదలకు ముందు షూట్...
మేజర్ షూటింగ్ పార్ట్ ఫినిష్ చేసిన శంకర్!
'ఇండియన్ 2' క్లైమాక్స్ చూస్తే... 'భారతీయుడు 3'కి లీడ్ ఇచ్చారు. క్లిఫ్‌ హ్యాంగర్‌తో సినిమాను ఎండ్ చేశారు. 'ఇండియన్ 2' విడుదలైన మూడు నాలుగు నెలల తర్వాత 'ఇండియన్ 3' విడుదల చేయాలని ప్లాన్ చేశారు. కానీ కుదరలేదు. మూవీ రిజల్ట్ కూడా ఆశించినట్టు లేకపోవడంతో 'భారతీయుడు 3'ను పక్కన పెట్టేశారు. ఓ దశలో థియేటర్లలో కాకుండా ఓటీటీలో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నట్టు న్యూస్ వచ్చింది. దాన్ని లైకా ప్రొడక్షన్స్ వర్గాలు ఖండించాయి అనుకోండి. ఇప్పుడు మళ్ళీ ఆ సినిమాను పట్టాలపైకి తీసుకొచ్చారు.

Also Read: Epic Movie Review - 'ఎపిక్' రివ్యూ: 'బేబీ' జంట మళ్ళీ హిట్టు కొట్టిందా? ఆనంద్, వైష్ణవిల సినిమా ఎలా ఉందంటే?

త్వరలో 'ఇండియన్ 3' పోస్ట్ ప్రొడక్షన్ షురూ!
'భారతీయుడు 2' చిత్రీకరణ చేసిన సమయంలో 'భారతీయుడు 3'లో మెజారిటీ పార్ట్ షూటింగ్ కూడా పూర్తి చేశారనేది తెలిసిన విషయమే. ఇంకొంత షూటింగ్, కొంత ప్యాచ్‌ వర్క్ పనులు మాత్రమే పెండింగ్‌ ఉన్నాయి. కంప్యూటర్ గ్రాఫిక్స్ వర్క్స్ప కూడా పూర్తి కావాల్సి ఉంది. త్వరలో ఆ పోస్ట్ ప్రొడక్షన్ పనులను ప్రారంభించి, ఈ సినిమాను ఫినిష్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారని కోలీవుడ్ టాక్. సో, వచ్చే ఏడాది 'ఇండియన్ 3' రిలీజ్ అయ్యే అవకాశం ఉంటుందని అనుకోవచ్చు.

Also Read: Karthi Sardar 2 Review In Telugu - సర్దార్ 2 రివ్యూ: కార్తీ కెరీర్‌లో భారతీయుడు 2 అవుతుందా? పీఎస్ మిత్రన్ సినిమా హిట్టా? ఫట్టా?