India: ఆరో స్థానానికి పడిపోయిన భారత ఆర్థిక వ్యవస్థ - మళ్లీ ఐదో స్థానానికి చేరిన బ్రిటన్
1 month ago 6
ARTICLE AD
India slips to sixth largest economy in 2025 : భారత ఆర్థిక వ్యవస్థ గమనానికి సంబంధించి అంతర్జాతీయ స్థాయిలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. 2024లో ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా వెలుగొందిన భారత్, 2025 నాటికి ఆరో స్థానానికి పడిపోయింది. అయితే, ఈ వెనకబాటు తాత్కాలికమేనని, మున్ముందు భారత్ జైత్రయాత్ర కొనసాగుతుందని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ మేరకు  సెంటర్ ఫర్ ఎకనామిక్స్ అండ్ బిజినెస్ రీసెర్చ్  (CEBR) తన తాజా నివేదికలో కీలక అంచనాలను వెలువరించింది.
India economy slips to 6th place in the latest IMF report for 2026 :
1. 🇺🇸 United States ~ $32.38 trillion
2. 🇨🇳 China ~ $20.85 trillion
3. 🇩🇪 Germany ~ $5.45 trillion
4. 🇯🇵 Japan ~ $4.38 trillion
5. 🇬🇧 United Kingdom ~ $4.26 trillion
6. 🇮🇳 India ~ $4.15 trillion pic.twitter.com/M6qHGKSQIJ
— Abhi ™ (@Patelizm) April 16, 2026
ప్రస్తుత గణాంకాల ప్రకారం, బ్రిటన్ తిరిగి ఐదో స్థానాన్ని ఆక్రమించడంతో భారత్ ఒక మెట్టు కిందకు దిగాల్సి వచ్చింది. రూపాయి విలువలో హెచ్చుతగ్గులు , అంతర్జాతీయ వాణిజ్య సమీకరణాలు ఈ మార్పుకు కారణమైనప్పటికీ, భారత ఆర్థిక పునాదులు బలంగానే ఉన్నాయని నివేదిక స్పష్టం చేస్తోంది. 2024 నుంచి 2029 మధ్య కాలంలో భారత్ సగటున 6.4 శాతం వార్షిక వృద్ధి రేటును నమోదు చేస్తుందని అంచనా వేస్తున్నారు.
భారత్ ఎదుట ఉన్న లక్ష్యం ఇప్పుడు మరింత స్పష్టంగా కనిపిస్తోంది. 2031 నాటికి జపాన్ , జర్మనీలను వెనక్కి నెట్టి, అమెరికా  , చైనా తర్వాత ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక శక్తిగా భారత్ అవతరించనుంది. ఈ ప్రయాణంలో భారత్ తన తయారీ రంగం , సేవా రంగం పై మరింత దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. మౌలిక సదుపాయాల కల్పన,  డిజిటల్ విప్లవం ఈ వృద్ధికి ఇంధనంగా మారుతున్నాయి.
Western media has been jumping for joy about this
And some Indian liberals who were burning in jealousy and hatred since 2014.
Yes, India is 6th largest economy
Remember that Dr. Singh, greatest economist in the world, had only managed to bring India to 10th from 12th. https://t.co/UqtIiBtoeH
— Abhishek (@AbhishBanerj) April 16, 2026
Read Entire Article