India vs South Africa 2nd Test:భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా రెండో టెస్ట్ గువాహటిలోని బర్సపారా క్రికెట్ స్టేడియంలో జరుగుతోంది. మొదట బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 489 పరుగులు చేసింది, అయితే భారత జట్టు బ్యాట్స్మెన్ మొదటి ఇన్నింగ్స్‌లో ఘోరంగా విఫలమయ్యారు. కెప్టెన్ రిషబ్ పంత్ (7) బాధ్యతారహిత షాట్ ఆడి అవుట్ కాగా, సాయి సుదర్శన్ (15), ధ్రువ్ జురెల్ (15), రవీంద్ర జడేజా (6) కూడా తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరారు. ఈ సమయంలో కరుణ్ నాయర్ ఒక రహస్య సందేశాన్ని పంచుకోగా, అశ్విన్ కూడా స్పందించారు.

గువాహటి టెస్ట్‌లో టీమ్ ఇండియా 7వ వికెట్ 122 స్కోరు వద్ద పడింది. వాషింగ్టన్ సుందర్ 48 పరుగులు చేయకపోతే, మొత్తం స్కోరు 150కి చేరుకోవడం కూడా కష్టమయ్యేది. సుందర్ 92 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్స్ కొట్టాడు. కుల్దీప్ యాదవ్ కేవలం 19 పరుగులు చేసినప్పటికీ, 134 బంతులు ఎదుర్కొన్నాడు. ఇది పంత్, జురెల్, నితీష్ కుమార్ రెడ్డి, జడేజా ఆడిన బంతుల మొత్తం కంటే చాలా ఎక్కువ. సోమవారం నాడు టీమ్ ఇండియా ఇన్నింగ్స్ జరుగుతున్నప్పుడు, అనుభవజ్ఞుడైన ఆటగాడు కరుణ్ నాయర్ ఎక్స్ (X)లో ఓ పోస్ట్ చేశాడు.

కరుణ్ నాయర్ ఏం రాశాడు?

కరుణ్ నాయర్ నవంబర్ 24న తన ఎక్స్ (గతంలో ట్విట్టర్) ఖాతాలో, 'కొన్ని పరిస్థితులు బాధకలిగించినా ఏదో అనుభూతిని కలిగిస్తాయి. అయితే అక్కడ లేకపోవడం బాధను కలిగిస్తుంది.' అని రాశాడు. నాయర్ చేసిన ఈ పోస్ట్‌పై మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ కూడా నవ్వుతున్న ఎమోజీని షేర్ చేశాడు.

Some conditions carry a feel you know by heart — and the silence of not being out there adds its own sting.

— Karun Nair (@karun126) November 24, 2025

కరుణ్ నాయర్ ఈ సంవత్సరం ఇంగ్లాండ్ పర్యటనలో 8 సంవత్సరాల తర్వాత టెస్ట్ జట్టుకు ఎంపికయ్యాడు, అయితే అక్కడ పేలవమైన ప్రదర్శన తర్వాత అతన్ని టెస్ట్ జట్టు నుంచి తొలగించారు. స్వదేశంలో వెస్టిండీస్, ఆ తర్వాత దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్ట్ జట్టుకు ఎంపిక కాలేదు.

కరుణ్ నాయర్ అంతర్జాతీయ కెరీర్

33 ఏళ్ల కరుణ్ నాయర్ భారత్ తరపున 10 టెస్టులు, 2 వన్డే మ్యాచ్‌లు ఆడాడు. ఇందులో అతను వరుసగా 579, 46 పరుగులు చేశాడు. టెస్టుల్లో అతని అత్యధిక స్కోరు 303 పరుగులు, ఇది అతను 2016లో ఇంగ్లాండ్‌పై సాధించాడు.

గౌహతిలోని ACA స్టేడియంలో జరుగుతున్న IND vs SA రెండో టెస్ట్‌లో దక్షిణాఫ్రికా భారత్‌పై 314 పరుగుల ఆధిక్యాన్ని సంపాదించింది. తొలి ఇన్నింగ్స్‌లో వారు 489 పరుగులు చేశారు, ఆపై భారత్‌ను 201 పరుగులకే ఆలౌట్ చేశారు. కెప్టెన్ టెంబా బావుమాకు భారత్‌పై ఫాలో-ఆన్ విధించే అవకాశం లభించింది, కానీ మళ్ళీ బ్యాటింగ్ ఎంచుకున్నారు. జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ ఫెయిల్‌ అవ్వడంతో ఐడెన్ మార్క్రామ్, ర్యాన్ రికెల్టన్ ఇప్పటివరకు 26 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.

గౌహతిలో మార్కో జాన్సెన్-సైమన్ హార్మర్ ప్రదర్శన

దక్షిణాఫ్రికాకు చెందిన మార్కో జాన్సెన్- సైమన్ హార్మర్ భారత పర్యటనలో అద్భుతమైన ప్రదర్శన చేస్తున్నారు. IND vs SA తొలి టెస్ట్‌లో దక్షిణాఫ్రికా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌ వచ్చింది. తొలి ఇన్నింగ్స్‌లో జాన్సెన్ 6 వికెట్లు తీయగా, హార్మర్ 3 వికెట్లు పడగొట్టాడు. తొలి ఇన్నింగ్స్‌లో జాన్సెన్ 93 పరుగులు చేయడంతో దక్షిణాఫ్రికా 489 పరుగుల భారీ స్కోరు సాధించింది.

భారత బ్యాటింగ్ ఆందోళన

రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, ఆర్ అశ్విన్ రిటైర్మెంట్ తర్వాత భారత టెస్ట్ ఇబ్బంది పడుతోంది. కెఎల్ రాహుల్, రిషబ్ పంత్ రవీంద్ర జడేజా అవసరమైనప్పుడు రాణించడంలో విఫలమయ్యారు. యువ ఆటగాడు అయిన యశస్వి జైస్వాల్ కూడా తన కెరీర్‌లో ఇప్పటికే 27 టెస్టులు ఆడాడు, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌లో సెంచరీలు చేశాడు, అందువల్ల అతన్ని అనుభవం లేని వ్యక్తిగా పరిగణించలేము.