భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ (BCCI) దక్షిణాఫ్రికాతో జరిగే ODI సిరీస్ కోసం భారత జట్టును ప్రకటించింది. నవంబర్ 30 నుంచి ప్రారంభమయ్యే వన్డే సిరీస్‌కు కెఎల్ రాహుల్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తారు. వన్డే రెగ్యులర్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్, వైస్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ గాయాల కారణంగా ఈ సిరీస్‌లో భాగం కాలేదు. వారే కాకుండా, వన్డే సిరీస్‌లో (India Squad for South Africa ODI Series 2025) బీసీసీఐ మరో 5 మంది ఆటగాళ్లకు అవకాశం ఇవ్వలేదు.

వన్డే సిరీస్‌కు భారత ఆటగాళ్లు వీరే..

రోహిత్ శర్మ, KL రాహుల్ (కెప్టెన్) (WK), యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లి, తిలక్ వర్మ, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), రుతురాజ్ గైక్వాడ్, వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, నితీష్ కుమార్ రెడ్డి, ధ్రువ్ జురెల్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, ప్రసిద్ధ్ కృష్ణ, అర్షదీప్ సింగ్.

భారత్ vs దక్షిణాఫ్రికా ODIలు: పూర్తి షెడ్యూల్
ఇక్కడ అన్ని IND vs SA ODI మ్యాచ్‌ల తేదీలు, వేదికలు :

IND vs AUS తొలి వన్డే: 30 నవంబర్ (ఆదివారం), రాంచీ

IND vs AUS 2వ వన్డే: 3 డిసెంబర్ (బుధవారం), రాయ్‌పూర్

IND vs AUS 3వ వన్డే: 6 డిసెంబర్ (శనివారం), విశాఖపట్నం

మహమ్మద్ షమీ

గత కొన్ని నెలలుగా మహమ్మద్ షమీ పేరు వార్తల్లో ఉంటుంది. వన్డే సిరీస్‌ నుండి షమీని బీసీసీఐ డ్రాప్ చేసింది. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 తర్వాత షమీ ఇండియా తరపున ఆడలేదు. అదే సమయంలో, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ ఫిట్‌నెస్ గురించి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. షమీ నవంబర్ 26 నుండి ప్రారంభమయ్యే సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ T20 టోర్నమెంట్‌లో బెంగాల్ తరపున ఆడుతున్నాడు. అయితే టీమిండియా విషయానికి వస్తే, అతనికి మరోసారి నిరాశ తప్పలేదు.

వరుణ్ చక్రవర్తి

తన బౌలింగ్ యాక్షన్ టెస్ట్ ఫార్మాట్‌కు బహుశా సరిపోదని వరుణ్ చక్రవర్తి స్వయంగా చెప్పాడు. అయితే, T20 మ్యాచ్‌లలో అతని ప్రదర్శనను చూసి సెలెక్టర్లు అతనికి ODI జట్టులో అవకాశం ఇస్తారని భావించడం తప్పు కాదు. 2024లో T20 జట్టులోకి తిరిగి వచ్చిన తర్వాత 23 మ్యాచ్‌లలో 43 వికెట్లు తీశాడు. కాని ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత సైతం మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తికి ODI జట్టులోకి తిరిగి వచ్చే అవకాశం రాలేదు.

అక్షర్ పటేల్

అక్షర్ పటేల్ ఆస్ట్రేలియాతో జరిగిన ODI జట్టులో భాగంగా ఉన్నాడు. ఈ మూడు మ్యాచ్‌లలో 2 ఇన్నింగ్స్‌లలో బ్యాటింగ్ చేస్తూ 75 పరుగులు చేశాడు. ఆ సిరీస్‌లో మొత్తం 3 వికెట్లు తీశాడు. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్ లో జట్టుకు ఉపయోగపడే అక్షర్ పటేల్ ను కూడా దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్‌కు డ్రాప్ చేయడంతో అంతా ఆశ్చర్యపోతున్నారు. అయితే అక్షర్ T20 జట్టులో రెగ్యులర్ సభ్యుడిగా కొనసాగుతున్నాడు.

హార్దిక్ పాండ్యా

ఆసియా కప్ 2025లో ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యాకు గాయమైంది. ఆ తర్వాత ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్‌లో కూడా పాండ్యా ఆడలేదు. ఇండియా జట్టులోకి తిరిగి రావాలంటే అతను దేశవాళీ క్రికెట్‌లో తన ఫిట్‌నెస్‌ను నిరూపించుకోవాలి. ఈ క్రమంలో సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో బరోడా జట్టులో పాండ్యాకు చోటు దక్కింది. ఈ దేశవాళీ టోర్నమెంట్ తర్వాత డిసెంబర్ 9 నుండి ప్రారంభమయ్యే దక్షిణాఫ్రికాతో జరిగే T20 సిరీస్‌లో ఆల్ రౌండర్ ఆడే అవకాశం ఉంది.

సంజు శాంసన్

సంజు శాంసన్ ఓవైపు T20 మ్యాచ్‌లలో బ్యాటింగ్ ఆర్డర్ మారడం T20 ప్రపంచ కప్ 2026 జట్టులో అతని స్థానంపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. డిసెంబర్ 2023 తర్వాత శాంసన్‌కు వన్డే జట్టులో అవకాశం రాలేదు. ఇచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోలేదని విమర్శలు శాంసన్ పై ఉండనే ఉన్నాయి. అయితే కెప్టెన్ గిల్, వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ లేని సమయంలో ఏ కీలక ఆటగాడు జట్టులో లేకున్నా మూల్యం చెల్లించుకోక తప్పదు.