IND vs PAK Super 4 Match: దుబాయ్: భారత్‌, పాకిస్థాన్‌ మధ్య జరిగిన గ్రూప్‌ మ్యాచ్‌ సమయంలో తలెత్తిన "హ్యాండ్‌షేక్‌" వివాదానికి కేంద్ర బిందువుగా నిలిచిన జింబాబ్వే మాజీ క్రికెటర్‌ ఆండి పైక్రాఫ్ట్‌ (Andy Pycroft) మళ్లీ ఆదివారం దుబాయ్‌ వేదికగా జరగబోయే Super4 మ్యాచ్‌కు మ్యాచ్‌ రెఫరీగా నియమితులయ్యారు. ఈ విషయాన్ని ESPNcricinfo తెలియజేసింది. ఆసియా కప్‌లో సెప్టెంబర్‌ 14న భారత్ చేతిలో 7 వికెట్ల తేడాతో పాకిస్థాన్‌ ఘోర పరాజయం అనంతరం, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) మ్యాచ్‌ రెఫరీ ఆండి పైక్రాఫ్ట్‌ ను వెంటనే తీసేయాలని డిమాండ్ చేసింది. వారి ఆరోపణల ప్రకారం, పైక్రాఫ్ట్‌ గ్రూప్‌ దశలో టాస్ సమయంలో కెప్టెన్లు అఘా సల్మాన్, సూర్యకుమార్ యాదవ్‌ హ్యాండ్‌షేక్‌ చేయవద్దని చెప్పినట్టు తెలుస్తోంది.

అయితే అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) డిమాండ్‌ను తిరస్కరించింది, దాంతో పైక్రాఫ్ట్ తన స్థానంలోనే కొనసాగారు. అయితే ఈ వివాదం అక్కడితో ఆగలేదు. యుఏఈతో జరిగిన కీలక మ్యాచ్‌కి ముందే పాకిస్థాన్‌ జట్టు ప్రెస్ కాన్ఫరెన్స్‌ను రద్దు చేయడమే కాకుండా, మ్యాచ్‌కు కూడా ఆలస్యంగా రావడంతో 1 గంట ఆలస్యంగా ప్రారంభమైంది.

అదే వేదిక.. అదే సీన్ రిపీట్ అవుతుందా..

ఈ ఆలస్యం కారణంగా, పాకిస్థాన్ ఆటగాళ్లను హోటల్‌లోనే ఉంచి, PCB అధికారులు ICCతో చర్చలు జరిపినట్టు సమాచారం. యుఏఈతో టాస్‌కు కొన్ని క్షణాల ముందు, పాకిస్థాన్ జట్టు యాజమాన్యం పైక్రాఫ్ట్‌ను కలవడం మరో కొత్త వివాదానికి దారి తీసింది. ఈ సమావేశానికి సంబంధించిన వీడియోను PCB సోషల్ మీడియాలో పంచగా, తర్వాత వెంటనే తొలగించారు. ఇప్పుడు ఈ రెండు జట్లు మళ్లీ అదే వేదికపై తలపడబోతున్నాయి. తొలగించాలని పాక్ కోరిన ఆండి పైక్రాఫ్ట్‌ భారత్, పాక్ మధ్య జరగనున్న సూపర్ 4 మ్యాచ్‌కు సైతం రిఫరీగా వ్యవహరించనుండటం పాక్‌కు మింగుడు పడటం లేదు. ఈసారి పాక్ మ్యాచ్ ను బాయ్‌కాట్ చేస్తుందా, లేక రిఫరీని తొలగిస్తేనే మ్యాచ్ ఆడతామని డిమాండ్ చేస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది.

STORY | Asia Cup: Pycroft will be match referee again for Super 4s India-Pakistan game

The International Cricket Council (ICC) has once again assigned the high-voltage India-Pakistan Asia Cup Super 4s game on Sunday to its Elite Panel Match Referee Andy Pycroft despite PCB's… pic.twitter.com/y3xlHR5V55

— Press Trust of India (@PTI_News) September 20, 2025