ITR Filing: ఇన్‌కమ్ టాక్స్ రిటర్న్ (ITR) ఫైల్ చేసే సీజన్ మొదలైంది. ప్రతి ఏడాది లక్షలాది మంది లాస్ట్ డేట్ సమయంలో తొందరపాటుగా రిటర్న్స్ దాఖలు చేస్తారు. చాలా సార్లు తప్పు ITR ఫారమ్ సెలక్ట్ చేసుకుంటారు. దీని వల్ల తర్వాత నోటీసు రావడం, రీఫండ్ నిలిచిపోవడం లేదా మళ్లీ రిటర్న్ ఫైల్ చేయాల్సి వస్తుంది. ఒకవేళ మీరు కూడా మొదటిసారి ITR ఫైల్ చేస్తున్నారా.. లేదా ప్రతిసారీ ఎవరైనా సిఏ (CA) సహాయం తీసుకుంటుంటే ఈ వార్త చదవండి. ఏ ITR ఫారమ్ ఎవరి కోసం, ఇంట్లో కూర్చొని ఆన్‌లైన్‌లో రిటర్న్ ఎలా ఫైల్ చేయాలో అర్థం చేసుకోండి. దీని ద్వారా మీరు ఎవరికీ ఫీజు చెల్లించకుండా, మీ అంతట మీరే ఐటీఆర్ ఫైల్ చేయవచ్చు.

ITR అంటే ఏమిటి?
ITR అంటే ఇన్‌కమ్ టాక్స్ రిటర్న్ (Income Tax Return). మీరు ఓ ఆర్థిక సంవత్సరంలో ఎంత సంపాదించారు. ఎంత పన్ను చెల్లించారు అని ప్రభుత్వానికి తెలియజేసే ఒక ఫారమ్. ఒకవేళ ఎక్కువ ట్యాక్స్ కట్ అయి ఉంటే, రీఫండ్ కూడా లభిస్తుంది. ఉద్యోగం, వ్యాపారం, అద్దె, షేర్ మార్కెట్ లేదా ఫ్రీలాన్సింగ్ వంటి వాటి ద్వారా సంపాదించే వారికి ITR ఫైలింగ్ అవసరం.

మీకు ఏ ITR ఫారమ్ సరైనది?
తప్పుడు ఫారమ్‌ను సెలక్ట్ చేయడం అన్నిటికంటే పెద్ద తప్పు. అందువల్ల మొదట మీ ఆదాయం ఏ కేటగిరీలోకి వస్తుందో అర్థం చేసుకోవాలి. ఇక్కడ ఐటీఆర్ కి సంబంధించిన 4 ఫారమ్‌లను చూడండి.

ITR-1: ఇది అత్యంత ఈజీ ఫారమ్. మీ ఆదాయం కేవలం జీతం, ఒక ఇంటి ప్రాపర్టీ, వడ్డీ ద్వారా వస్తూ, వార్షిక ఆదాయం 50 లక్షల వరకు ఉంటే, సాధారణంగా ITR-1 ఫైల్ చేయాలి.

ITR-2: మీ ఆదాయం 50 లక్షల కంటే ఎక్కువగా ఉండి, ఒకటి కంటే ఎక్కువ ప్రాపర్టీలు ఉన్నా లేదా షేర్ మార్కెట్/ క్యాపిటల్ గెయిన్స్ నుంచి ఆదాయం వచ్చినా ఈ ఫారమ్ ఉపయోగించాలి.

ITR-3: వ్యాపారం చేసేవారు, ప్రొఫెషనల్స్, ఫ్రీలాన్సర్లు లేదా ట్రేడింగ్ ద్వారా సంపాదించే వారు ఈ ఫారమ్ నింపాలి.

ITR-4: ఇది చిన్న వ్యాపారస్తులు, దుకాణదారులు లేదా ప్రిజంప్టివ్ ఇన్‌కమ్ స్కీమ్ (presumptive income scheme) ఉన్న ట్యాక్స్ పేయర్ల కోసం ఈ ఫారమ్ ఉంటుంది.

ఇంటి నుంచే ITR ఎలా ఫైల్ చేయాలి?
ఇప్పుడు ITR ఫైల్ చేయడానికి ఎక్కడికీ వెళ్లాల్సిన అక్కర్లేదు. మొబైల్ లేదా ల్యాప్‌టాప్ ద్వారా ఇంటర్నెట్ ద్వారా ఇంట్లో కూర్చొని చేయవచ్చు.

ఇన్‌కమ్ టాక్స్ అధికారిక వెబ్‌సైట్ అంటే పోర్టల్ (https://www.incometax.gov.in/iec/foportal/) లో లాగిన్ అవ్వండి.

అవసరమైన డాక్యుమెంట్లు ఇవే..

పాన్ కార్డ్

ఆధార్ కార్డ్

ఫారమ్ 16 (Form 16)

బ్యాంక్ వివరాలు

AIS/TIS సమాచారం

ఇన్వెస్టిమెంట్, టాక్స్ సేవింగ్ ప్రూఫ్స్

సరైన సంవత్సరాన్ని ఎంచుకోండి: ఏ ఆర్థిక సంవత్సరం (FY) ఆదాయానికి రిటర్న్ ఫైల్ చేస్తున్నారో, దానికి అనుగుణంగా సరైన అస్సెస్మెంట్ ఇయర్ (AY) ఎంచుకోవాలి.

సరైన ITR ఫారమ్‌: ఇప్పుడు మీ ఆదాయాన్ని బట్టి సరైన ITR ఫారమ్‌ ఎంచుకోండి. పోర్టల్‌లో పలు చోట్ల హెల్ప్ ఆప్షన్ కూడా ఇస్తారు.

వివరాలను నింపండి: మీ జీతం, బ్యాంక్ వడ్డీ, పెట్టుబడులు, ట్యాక్స్ వివరాలను నింపండి. అన్నింటినీ ఖచ్చితంగా చెక్ చేయండి (వెరిఫై చేయండి).

ఈ-వెరిఫికేషన్ (e-Verification): రిటర్న్ ఫైల్ చేసిన తర్వాత ఆధార్ OTP, నెట్ బ్యాంకింగ్ లేదా డీమ్యాట్ అకౌంట్ ద్వారా ఈ-వెరిఫై చేయాలి. వెరిఫికేషన్ చేయకపోతే ITR అసంపూర్ణంగా ఉందని భావిస్తారు.

ITR ఫైల్ చేయడానికి ముందు మీ వద్ద ఈ 6 డాక్యుమెంట్స్ ఉండాలి, లేకపోతే మీ మనీ రీఫండ్ ఆగిపోతుంది.

ITR ఫైల్ చేసేటప్పుడు ఈ తప్పులు చేయవద్దు

తప్పుడు ITR ఫారమ్‌ ఎంచుకోవడం

AIS/TIS డేటా మ్యాచ్ అవ్వకపోవడం

బ్యాంక్ అకౌంట్ అప్‌డేట్ చేయకపోవడం

చివరి తేదీ వరకు వెయిట్ చేయడం

ఈ-వెరిఫికేషన్ చేయడం మర్చిపోవడం

త్వరగా ఫైల్ చేయడం ప్రయోజనం ఏమిటి?
ఐటీఆర్ త్వరగా ఫైల్ చేయడం వల్ల రీఫండ్ త్వరగా లభిస్తుంది. అలాగే చివరి నిమిషంలో వెబ్‌సైట్ స్లో అవ్వడం లేదా సాంకేతిక సమస్యల నుండి కూడా తప్పించుకోవచ్చు. ఇది కాకుండా హోమ్ లోన్, వీసా మరియు అనేక ఆర్థిక పనులలో ITR ఒక ముఖ్యమైన పత్రంగా పరిగణించబడుతుంది. అందువల్ల సమయం ఉండగానే సరైన పద్ధతిలో రిటర్న్ ఫైల్ చేయడం ముఖ్యం.