IMD Weather Alert Telugu States 2026:దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులు, సామాన్య ప్రజలు ఎప్పుడెప్పుడూ అని ఎదురు చూస్తున్న నైరుతి రుతుపవనాల గమనంపై ఐఎండీ శనివారం ఉదయం అత్యంత కీలకమైన హెచ్చరికతో కూడిన ప్రత్యేక బులెటిన్ విడుదల చేసింది. ఒక వైపు తెలుగు రాష్ట్రాలను పట్టిపీడిస్తున్న రోహిణి కార్తె తీవ్ర వడగాల్పులు, మోరవైపు నైరుతి దిశ నుంచి వేగంగా దూసుకొస్తున్న రుతుపవన మేఘాల మధ్య ప్రస్తుతం ఆకాశంలో భయంకరమైన యుద్ధం సాగుతోంది.

ప్రస్తుతం అరేబియా సముద్రంలో ఏర్పడిన ద్రోణి ప్రభావం తెలుగు రాష్ట్రాలపై ప్రభావం చూపుతోంది. మారుతున్న వాతావరణ పరిస్థితుల కారణంగా రోబోయే 48 గంటల పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడతాయని ఐఎండీ హెచ్చరించింది. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది.

కేరళను తాకిన రుతుపవనాల ప్రయాణం ఎలా ఉంది?

సాధారణంగా జూన్ 1 నాటికి కేరళ తీరాన్ని తాకాల్సిన రుతుపవనాలు ఈసారి రెండు రోజులు ముందే అనుకూలమైన వాతావరణ పరిస్థితులు, గాలుల వేగం కారణంగా కేరళ తీరానికి చేరువయ్యాయి. రాబోయే 24 ముంచి 48 గంటల్లో ఇవి పూర్తి స్థాయిలో కేరళ అంతటా విస్తరించి అక్కడ భారీ వర్షపాతాన్ని నమోదు చేయనున్నాయి. అరేబియా సముద్రంలో ఏర్పడిన పశ్చిమ గాలుల తీవ్రత, ఉపరితల ఆవర్తనం దీనికి ఎంతగానో తోడ్పడ్డాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

తెలుగు రాష్ట్రాల్లోకి ఎప్పుడు వస్తాయి?

కేరళలోకి ప్రవేశించిన తర్వాత రుతుపవనాలు కర్ణాటక, రాయలసీమ మీదుగా తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశించడానికి సాధారణంగా 7 నుంచి పది రోజుల సమయం పడుతుంది. ప్రస్తుత వేగాన్ని బట్టి చూస్తే జూన్ 7 నుంచి జూన్ 10 మధ్య నైరుతి రుతుపవానాలు ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమ, దక్షిణ తీర ప్రాంతాల ద్వారా తెలుగు రాష్ట్రాల్లోకి అడుగు పెట్టే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

రోహిణి కార్తె ఎండల తీవ్రత తగ్గుతుందా?

తెలుగు రాష్ట్రాల్లో ఒక సామెత ఉంది. రోహిణి కార్తెలో రోళ్లు పగులుతాయని అని మే 25వ తేదీన ప్రారంభమైన రోహిణి కార్తె జూన్ 8 వరకు కొనసాగుతుంది. ఈ పదిహేను రోజులు సూర్యుని కిరణాలు నిట్టనిలువుగా భూమిపై పడటం వల్ల ఉష్ణోగ్రతలు గరిష్ట స్థాయికి చేరుకుంటాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలు ఎండ వేడికి అల్లాడిపోతున్నారు. అయితే ఐఎండీ ఇచ్చిన అప్‌డేట్స్ ప్రకారం సామాన్యులకు కొంత ఊరట కలగబోతోంది.

ఉపరితల ద్రోణి ప్రభావంతో ముందస్తు వర్షాలు

రుతు పవనాలు కేరళకు చేరువవుతున్న వేల అటు బంగాళాఖాతంలో, ఇటు అరేబియా సముద్రం నుంచి తెలుగు రాష్ట్రాల వైపు తేమతో కూడిన గాలులు వీస్తున్నాయి. దీనికి తోడు అంతర్గత కర్ణాటక నుంచి తమిళనాడు మీదుగా ఒక ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. ఈ ద్రోణి కారణంగా రోహిణి కార్తె ఎండల తీవ్రతకు మధ్యాహ్నం వరకు ఉక్కపోతగా ఉన్నప్పటికీ సాయంత్రానికి వాతావరణం చల్లబడి ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తుంది. రాబోయే 48 గంటల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీల వరకు తగ్గే అవకాశం ఉంది. అంటే ఎండల తీవ్రత పూర్తిగా తగ్గకపోయినా, సాయంత్రం వేళల్లో కురిసే వర్షాలు వేడి నుంచి తాత్కాలిక ఉపశమనం కలిగిస్తాయి.

తెలంగాణలో జిల్లాల వారీగా హెచ్చరికలు

హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఇచ్చిన సమాచారం ప్రకారం తెలంగాణలోని పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ అయింది. రాష్ట్రంలో గంటకు 4 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. దక్షిణ, పశ్చిమ జిల్లాలలో వర్షాల ప్రభావం ఎక్కువగా ఉండబోతోంది. రాబోయే 48 గంటలు హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాలు రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్‌గిరి ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఐటీ కారిడార్‌తోపాటు సిటీలోని పలు ప్రాంతాల్లో సాయంత్రం లేదా రాత్రివేళల్లో ఆకస్మిక భారీ వర్షాలు కురుస్తాయి పిడుగులు పడే అవకాశం ఉంది.

దక్షిణ తెలంగాణ జిల్లాలైన మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్‌, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాలు, పశ్చిమ, మధ్య తెలంగాణ ప్రాంతానికి చెందిన వికారాబాద్, సంగారెడ్డి, మెదక్ నిజామాబాద్, కామారెడ్డి, నల్గొండ, సూర్యాపేట జిల్లాల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలి.

ఒక వైపు వర్షాలు పడుతున్నా, ఉత్తర తెలంగాణలోని కొన్ని జిల్లాలలో మాత్రం రోహిణి కార్తె ప్రభావం వల్ల మధ్యాహ్నం పూట వడగాల్పులు వీచే అవకాశం ఉంది. ఆదిలాబాద్ జిల్లా, కొమరం బీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, కరీంనగర్, పెద్దపల్లి జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 43 డిగ్రీల నుంచి 45 డిగ్రీల వరకు నమోదు అయ్యే ఛాన్స్ ఉంది.

ఎక్కువ మంది చదివిన ఈ టాప్ ట్రెండింగ్‌లో వార్తలు మిస్ అవ్వొద్దు

1

12 ఏళ్ల నిరీక్షణకు తెర.. హైదరాబాద్‌కు తిరిగి వస్తున్న 'ఐమాక్స్'! లొకేషన్ ఎక్కడంటే?

2

ఫోర్బ్స్‌ జాబితాలో ఇద్దరు తెలుగు కుర్రాళ్లు! ప్రయోగాశాలతో లారీ డ్రైవర్ కుమారుడికి ప్రపంచ ఖ్యాతి!

3

తెలంగాణలో రిటైర్డ్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్.. ₹2,000 కోట్ల జీపీఎఫ్ బకాయిలు విడుదల!

4

ఏపీ సీఎం, డిప్యూటీ సీఎంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే అనుచిత వ్యాఖ్యలతో కలకలం - కేసులు నమోదు చేయరా అని బీజేపీ ప్రశ్న

5

భిక్షాటన నుంచి ఈగిల్ టీమ్ దాకా - హైడ్రాలో ట్రాన్స్‌జెండర్ల సగర్వ ప్రస్థానం.. గౌరవానికి కేరాఫ్ అడ్రస్‌గా యూనిఫాం !

ఆంధ్రప్రదేశ్‌లో వెదర్ రిపోర్ట్

అమరావతి వాతావరణ కేంద్ర తెలిపిన వివరాల ప్రకారం బంగాళాఖాతం నుంచి వీస్తున్న తూర్పు గాలులు, సముద్రపు తేమ కారణంగా ఆంధ్రప్రదేశ్‌లోని కోస్తా తీరం వెంబడి, రాయలసీమ వ్యాప్తంగా వాతావరణం వేగంగా మారుతోంది. రుతుపవనాల రాకకు ముందు రాయలసీమలో సాధారణంగానే ముందస్తు వర్షాలు గట్టిగా పడతాయి. రాబోయే 48 గంటల్లో రాయలసీమ అంతటా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. చిత్తూరు, తిరుపతి, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్‌ఆర్ కడప, అన్నమయ్య, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో పిడుగులు పడే ప్రమాదం ఉంది.రైతులు పొలం పనుల్లో ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది.

నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, పల్నాడు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో బలమైన ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి. తీరం వెంబడి గాలుల వేగం ఎక్కువగా ఉంటుంది. శ్రీకాకుళం,విజయనగరం, పార్వతీపురం, అల్లూరి సీతారామరాజు, విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి జల్లులు పడతాయి. అయితే అక్కడ పగటి ఉష్ణోగ్రతలు, ఉక్కపోత ఎక్కువగా ఉంటుంది.