Illu Illalu Pillalu Serial Today Episode | ఫ్యామిలీ కలహాలు.. సంతోషాలు.. ఎత్తులు పైఎత్తులు.. ఇలా అన్ని రకాల ఎమోషన్స్‌తో బుల్లితెర ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్న "ఇల్లు ఇల్లాలు పిల్లలు" సీరియల్ రోజు రోజుకూ ట్విస్ట్‌లు టర్న్‌లతో ఆసక్తికరంగా మారుతోంది. ఈ రోజు(సెప్టెంబర్ 8న) ప్రసారం కానున్న ఎపిసోడ్‌లో ఏం జరగనుందో ఎలాంటి ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకోనున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

భద్రావతి మీద ఒట్టేసిన వల్లీ..

తిరుపతి సుకన్య వెంట పడటానికి నువ్వే కారణం అని భద్రావతి వల్లీని నిలదీస్తుంది. నీ సీక్రెట్స్ మొత్తం నాకు తెలుసు మీ ఇంట్లో చెప్పేస్తా అని బెదిరిస్తే నాకేం తెలీదు.. మీ బ్లడ్‌లోనే ఇదంతా ఉంది.. మీ చెల్లి లేచిపోయింది.. ప్రేమ లేచి పోయి ప్రేమ పెళ్లి చేసుకుంది.. ఇప్పుడు తిరుపతి బాబాయ్ కూడా అలా తయారయ్యారు. అయినా విషయం మీకు తెలిస్తే తిరుపతి బాబాయ్‌కి నాలుగు తగిలించకుండా నాకు తిడతారు ఏంటి నాకేం తెలీదు కావాలి అంటే మీ మీద ఒట్టు అని వల్లీ అంటుంది. దాంతో భద్రావతి వల్లీ మాటలు నమ్మేస్తుంది.

మా వాటా తీసుకొని వెళ్లిపోదాం..

భాగ్యం, సుకన్యలు ఆకుకూర క్లీన్ చేస్తూ.. తిరుపతి గురించి మాట్లాడుకుంటారు. రేపు మా పెళ్లి అయిపోతే మా వాటా తీసుకొని సింగపూర్ వెళ్లిపోతాం అని కన్య అంటే మరి మమల్ని వదిలేస్తావా అని భాగ్యం అడుగుతుంది. అలా ఎలా వదిలేస్తాను మీరు మాతో వస్తారు అని సుకన్య చెప్తుంది. ఇంతలో వల్లీ కోపంగా అక్కడికి వచ్చి అన్నీ విసిరేస్తుంది. నా ప్లాన్ మొత్తం అట్టర్ ఫ్లాప్ అయిపోయింది.. ఇక మన పప్పులు ఉడకవు.. తట్టాబుట్టా సర్దేసుకోండి అని వల్లీ అంటుంది. ఏమైంది అని అడిగితే ఇది తిరుపతిని వదిలేయాలి అంట అని భద్రావతి వాయించిన విషయం చెప్తుంది. భాగ్యం వాళ్లని వెళ్లిపోమని అంటే నేను తిరుపతిని లవ్ చేస్తున్నా నాకు వాడు కావాలి అని సుకన్య అంటుంది.

ఒక్క కన్నీరు.. ఒక్క మెసేజ్..

అన్నింటికీ ఇలా భయపడకూడదు నా సత్తా చూపిస్తా అని కన్య ఏడుస్తున్నట్లు నటించి తిరు నువ్వే లేని లైఫ్ నాకు వద్దు అని మెసేజ్ పెడుతుంది. ఏంటే నీ ప్లాన్ అని వల్లీ అడిగితే మొత్తం చెప్తుంది. ఇంతలో తిరుపతి ఇంటికి వచ్చే టైంకి సుకన్య ఉరి వేసుకున్నట్లు నటిస్తుంది. బయట నుంచి భాగ్యం వాళ్లు కూడా తెగ నటించేస్తారు. తిరుపతి చాలా కంగారు పడతాడు. వల్లీ తిరుపతికి విషయం చెప్తుంది. నువ్వు బయటకురా సుకన్య ఈ సారి తన వాళ్లు ఒప్పుకోకపోతే నిన్ను పెళ్లి చేసుకుంటాడు అని భాగ్యం వాళ్లు అనడం వల్లీ కంగారు పెట్టడంతో ఈ సారి మా వాళ్లు ఒప్పుకోకపోతే నిన్ను పెళ్లి చేసుకొని ఇంటికి తీసుకెళ్తా అని తిరుపతి చెప్తాడు. మొత్తానికి వల్లీ వాళ్లు తిరుపతిని తమ దారిలోకి తెచ్చుకుంటారు.

వల్లీని కాపాడేసిన అద్దం..

వల్లీ అద్దం ముందు తన అందాన్ని చూసి మురిసిపోతూ ఉంటే వేదవతి వెళ్లి లాగి పెట్టి ఒక్కటిస్తుంది. నువ్వు ఏమైనా తప్పు చేసుంటే నాకు చెప్పుంటే నేను నిన్ను కాపాడేదాన్ని కదా కానీ నువ్వు నీలో పెట్టుకుంటే ఎలా.. నువ్వు అంటే నాకు ఎంత ఇష్టమో నీకు తెలుసు కదా.. నువ్వు పెద్ద కోడలివే.. ఆ నర్మద నిన్ను ఇంట్లో నుంచి గెంటేయాలని చూస్తుందే నీకు తెలీదా.. ఈ ఇంట్లో అందరి కంటే నువ్వే నాకు ఇష్టం కానీ ఆ విషయం బయట పెడితే నీకు దిష్టి పడుతుందని చెప్పలేదు.. నువ్వు తెలిసో తెలీకో ఏదో తప్పు చేస్తే నాకు చెప్పు నేను మాత్రమే నీకు సపోర్ట్ చేయగలను అని అడుగుతుంది వేదవతి. నర్మద చాటుగా మొత్తం చూస్తుంటుంది. అత్తయ్యా మీ మనసులో నా మీద ఇంత ప్రేమ ఉందా.. నన్ను క్షమించండి అత్తయ్యా మీకు తెలీకుండా నేను ఓ తప్పు చేశాను అని వల్లీ అత్త కాలు పట్టుకొని నిజం చెప్పేటైంలో అద్దంలో నర్మదని చూసి ఆగిపోతుంది. రైస్‌మిల్లులో చందు బావ నాకు డబ్బు పోయిన విషయం ముందే చెప్పారు కానీ నేను మీకు చెప్పలేదు అని అంటుంది. నర్మద వల్లీ ఏం తప్పు చేయలేదే అని వేదవతి అంటుంది. వేదవతి వెళ్లిపోయిన తర్వాత నర్మదతో నీ ప్లాన్స్ ఇవా.. అని వల్లీ అంటే నిజం బయట పెట్టే వరకు నేను నిద్ర పోను అని నర్మద అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.

ఇలాంటి మరిన్ని ఆసక్తికర విషయాలతో పాటు తర్వాత ఎపిసోడ్‌లో ఏం జరగనుంది? తదితర ఆసక్తికర వివరాలు కోసం మా ఏబీపీ దేశం పేజీని ఫాలో అవ్వండి.